NRI-NRT

వైభవంగా టాంటెక్స్ సంక్రాంతి

TANTEX Sankranthi 2022 - A Visual Feast

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలు శనివారం నాడు డల్లాస్‌లోని మార్ తోమా చర్చిలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు ఉమామహేష్ పార్నపల్లి స్వాగతోపన్యాసం చేసి సభికులకు శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి, మాజీ అధ్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, ఉత్తరాధ్యక్షుడు శరత్ రెడ్డి ఎర్రం, ఉపాధ్యక్షులు సతీష్ బండారు, కార్యదర్శి సురేష్ పఠనేని, సాంస్కృతిక కార్యదర్శి మాధవి లోకిరెడ్డి, కోశాధికారి సుబ్బారెడ్డి కొండు, సంయుక్త కోశాధికారి భాను ప్రకాష్ వెనిగళ్ల, పాలక మండలి అధిపతి వెంకట్ ములుకుట్ల, ఉపాధిపతి అనంత్ మల్లవరపులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతలుగా శ్రీనివాసులు బసాబత్తిన, మధుమతి వైశ్యరాజు వ్యవహరించారు. చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల వినాయకుని ప్రార్ధనా గీతం ఆలపించారు. కూచిపూడి కళాక్షేత్ర విద్యార్థులు సూర్య భగవానుడికి కూచిపూడి నృత్యం ద్వారా పుష్పాంజలి సమర్పించారు. లాస్య సుధా అకాడమీ, గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, సాయి నృత్య అకాడమీ స్కూల్ ఆఫ్ కూచిపూడికి చెందిన చిన్నారుల నాట్య ప్రదర్శనలు అలరించాయి. కార్తి గ్రూప్, యూ డాన్స్ టీం, దేశి ఇల్యూషన్ గ్రూప్ విద్యార్థుల సినీ గీతాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కళాకారులు ప్రభాకర్ కోట, చక్రపాణి కుందేటి, శారద చిట్టిమల్ల, స్నిగ్ఢ ఏలేశ్వరపు తమ పాటలతో అతిథులను అలరించారు.
వైభవంగా టాంటెక్స్ సంక్రాంతి
వైభవంగా టాంటెక్స్ సంక్రాంతి
వైభవంగా టాంటెక్స్ సంక్రాంతి