ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం గం. 2-10 కి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకునే ప్రధాని అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్‌కు M1-17 హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం గం.2-35కుచేరుకుంటారు.మధ్యాహ్నం గం. 2-45 నుంచి సాయంత్రం గం.4-15 వరకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గోంటారు. ఈ ఉత్సవాల్లో ఇక్రిశాట్ నూతన లోగోను ప్రధాని ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన జియ్యర్ స్వామి ఆశ్రమానికి సాయంత్రం గం.5లకు చేరుకుంటారు.అక్కడ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి గం.8 ల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లోప్రధాన మంత్రినరేంద్ర మోది పాల్గోంటారు. అనంతరం రాత్రి గం.8-25 కి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలు దేరివెళతారు.