* తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (ప్రజాపద్దుల కమిటీ) సమావేశం ఈ నెల 7వ తేదీ ఉదయం 11గంటలకు జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ కమిటీహాల్ లో జరిగే సమావేశంలో 2014,15 నుంచి 2018,19 వరకు మున్సిపల్ పరిపాలన, సీఅండ్ ఏజీ, అర్భన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన కార్యకలాపాలపై సమావేశం జరుగనుంది. అలాగే 8వ తేదీన ఉదయం 11గంటలకు వెనుకబడిన తరగతులు,షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్ మెంట్ శాఖ పనితీరుపై సమావేశంలో చర్చించనున్నారు.
* రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 4,198 కరోనా కేసులు నమోదయ్యాయ. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఏపీలో 22,97,369కి చేరిన కరోనా కేసులు చేరాయి. కరోనా కారణంగా 14,646 మరణాలు సంభవించాయి. ఏపీలో 83,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,94,359 మంది రికవరీ చెందారు.
* యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చైర్మన్‌గా తెలంగాణా విద్యావంతుడు ఎం జగదీశ్ కుమార్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ళ వరకు లేదా ఆయన వయసు 65 ఏళ్ళు నిండే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు, వీటిలో ఏది ముందైతే అంత వరకు కొనసాగవచ్చు. ఈ వివరాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపారు. ఆయన ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) ఉప కులపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
* టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులు ఐదు గంటలుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. రాజవొమ్మంగిలోనే పోలీసుల ఆధీనంలో ఉండిపోయారు. జీలుగు కల్లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించటానికి అనుమతించాలంటూ టీడీపీ నేతలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
* జంటనగరాలకు చెందిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అరుదైన అవకాశం లభించింది. శనివారం నగరానికి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకండంతో పాటు, వెళ్లేప్పడు వీడ్కోలు పలికే అవకాశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కల్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నగరానికి చేరుకోనున్న ప్రధాని మోదీకి మంత్రి తలసాని ఎయిర్ పోర్ట్ లో ఆయనకు స్వాగతం పలకనున్నారు. అలాగే విళ్లే సమయంలోనూ మంత్రి తలసాని ప్రధాని వెంట వుండి వీడ్కోలు పలుకుతారు.
* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు , 4 టెక్నాలజీ డెమానేషన్ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్ -3 కూడా ఉంది. ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగం ( పీఎస్ఎల్వీ – సి 52 ) ఫిబ్రవరి 14 న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టనుంది. ఇది భూ పరిశీలన ఉపగ్రహం. ( ఆర్ఎస్ఐశాట్ -1 ఎ ) తోపాటు ఐఎన్ఎస్ -2 డి ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. చంద్రయాన్ -3 ప్రయోగం. ఆగస్టులో చేపట్టేలా ప్రణాళికలు రచించారు. దీనిని గతేడాదే చేపట్టాలని నిర్ణయించినా కొవిడ్ వల్ల వాయిదా వేశారు. 2020, 2021 లో కరోనా మహమ్మారి వల్ల ఇస్రో రాకెట్ ప్రయోగాలు సక్రమంగా చేపట్టలేకపోయింది .
* జీలుగుకల్లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించటానికి లోదొడ్డి వెళుతున్న టీడీపీ నిజనిర్ధారణ కమీటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. రాజవొమ్మంగిలోనే టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులు కిడారి శ్రావణ్ కుమార్గిడ్డి ఈశ్వరి నిమ్మక జయకృష్ణదొన్ను దొరఎంవీవీ ప్రసాద్బొర్రా నాగరాజులతో పాటు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిలను పోలీసులు అడ్డుకున్నారు. జఢ్డంగిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
* డొల్ల కంపెనీలతో చైనీయులు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారు. పోలీసులకు ఏపీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఏపీలో 4, తెలంగాణలో 12, కర్ణాటకలో సుమారు 200, తమిళనాడు సహా.. పలు రాష్ట్రాల్లో బోగస్ కంపెనీలు స్థాపించినట్లు సమాచారం. ఏపీలో అమలాపురం, చిత్తూరు, విశాఖ, తిరుపతి కేంద్రాలుగా కంపెనీలను ఏర్పాటు చేశారు. చైనీయులతో పాటు కొందరు స్థానికులు డైరెక్టర్లుగా డొల్ల కంపెనీలను స్థాపించారు. ఏటా పెద్ద ఎత్తున టర్నోవర్ జరిగినట్లు చూపించి వందల కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు. ఆర్వోసీ ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. నిన్నటి ఉద్యోగ సంఘాల ఛలో విజయవాడ సభపై సమావేశంలో సీఎం జగన్ ఆరా తీశారు. ఉద్యోగుల భారీ సభ ఏర్పాటుపై సీఎంకు డీజీపీ గౌతమ్ వివరణ ఇచ్చారు.
* రామతీర్ధంలో ట్రస్టు బోర్డ్ కార్యకలాపాల్లో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు జోక్యాన్ని ఖండిస్తున్నామని కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శించిన ఎమ్మెల్యే బడ్డుకొండ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే విడిచిపెడుతున్నామన్నారు. రామతీర్ధం ట్రస్టుబోర్డు నిబంధనలను అధికారులు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
* కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కావాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు దాడి చేసిన ఘటనపై కేంద్రహోమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సోమిశెట్టి ఢిల్లీకి వెళ్లారు.
* పాలకీడు మండలం రావిపహాడ్ పరిధిలోని దక్కన్ సిమెంట్ సున్నపురాయి గని-III మైనింగ్ నిలిపివేతకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గని-II, గని-IIIలో జరిగిన చట్టవ్యతిరేక మైనింగ్‌కు అపరాధ రుసుము విధించాలని గతంలోనే మైనింగ్ శాఖను ఆదేశిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. రూ.600 కోట్లు అపరాధ రుసుము విధించవచ్చని ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు. సామాన్యుడి ఫిర్యాదుతో డెక్కన్ సిమెంట్ మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పంచలోహాలతో చేసిన 216 అడుగుల విగ్రహం.. కుల, మత, జాతి విభేదాలు లేని సమానత్వం కోసం కృషి చేసిన శ్రీరామానుజాచార్యుల ఆదర్శాలకు ప్రతీక అని పీఎంవో పేర్కొంది. కూర్చునే భంగిమలో ఉన్న, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాల్లో ఇది ఒకటి అని అభివర్ణించింది. శ్రీరామానుజాచార్యుల జీవితం, బోధనలను వివరిస్తూ 3డీ ప్రదర్శన తర్వాత సమతా విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశాలను కూడా ప్రధాని సందర్శించనున్నారు.
* తుంగభద్రనదిలో నీటిమట్టం పెరగడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. టీబీ డ్యామ్ నుంచి తుంగభద్ర నదికి నీటిని విడుదల చేయడంతో రెండవ పంటకు ఎలాంటి ఢోకా లేదని నది పరివాహక ప్రాంతాల ప్రజలురైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ పది వరకు నీరందితే రెండవ పంట ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు.
* ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెనింగ్ సెంటర్ (సెల్ట్)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్ డాక్టర్ సవీన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
*ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశా లను ఈనెల 5, 6, 7 తేదీల్లో నగరంలో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి.విజయ లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్. ఎం.డి.యూసుఫ్ వెల్లడించారు. గురువారం ఏఐటీయూసీ భవన్లో వారు మాట్లాడుతూ.. 3 రోజుల పాటు జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు కాచిగూడలోని మహారాజ క్లాసిక్ ఇన్ (ఓయో) హోటల్లో జరగనున్నట్టు వారు పేర్కొన్నారు.
*అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ చీఫ్‌ను హతమార్చినట్టు తెలిపారు. ఆపరేషన్ పూర్తయ్యాక కమాండోలు తిరిగి సురక్షితంగా తమ స్థావరానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు.
*గుర్తింపు కార్డులు లేకుండా దేశంలో 77 లక్షల మందికి కొవిడ్ మొదటి డోసు వ్యాక్సిన్ వేశామని, అలాగే 14.55 లక్షల మందికి రెండు డోసులు వేశామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే 4.82 లక్షల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు లేకుండా కొవిడ్ వ్యాక్సిన్ వేశామని కేంద్రం ఇంతకుముందు అఫిడవిట్లో పేర్కొన్న అంశాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం గుర్తుచేసింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. ఆ అఫిడవిట్ నిరుడు ఆగస్టులో దాఖలు చేసినదని, ప్రస్తుతం వివరాలను అప్డేట్ చేశామని చెప్పా రు. వాటిని అఫిడవిట్లో చేర్చాలని బెంచ్ ఆదేశించింది.
*పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించే గేట్ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా ఈ నెల 5న జరుగుతుందని స్పష్టంచేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పరీక్షకు విద్యార్థులు సిద్ధమయ్యారని, షెడ్యూల్‌కు 48గంటల ముందు వాయిదావేసి వారి కెరీర్‌తో ఆడుకోలేమని పేర్కొంది. పరీక్షను ఎప్పుడు నిర్వహించాలన్నది అకాడమీ పాలసీకి సంబంధించిన విషయమని, అందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్న విషయాన్ని గుర్తు చేసింది.
*కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం రూ.10,080 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్లు (గత ఏడాది కంటే 26 శాతం అధికం), ఆంధప్రదేశ్‌కు రూ.7,032 కోట్లు (గత ఏడాది కంటే 21 శాతం అధికం) కేటాయించినట్లు వివరించారు. రైల్ నిలయం నుంచి గురువారం సంజీవ్ కిశోర్ వర్చువల్‌గా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ, ట్రాఫిక్ పనుల కోసం బడ్జెట్లో రూ.9,125 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
*ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుభవార్త చెప్పింది. పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్ల మేరకు రుణం మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వెంటనే 1 బిలియన్ డాలర్లను ఆ దేశం అందుకునేందుకు మార్గం సుగమం ఆయింది.
*ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామం నందు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ పై వగాహన . ఈ ఈ కార్యక్రమాన్ని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి పి ఆశాలత అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన బెల్లంకొండ మండల ప్రభుత్వ ఆయుర్వేదిక వైద్యులు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల్లో ప్రబలంగా ఉన్న రెండు క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్. మహిళల్లో ఈ రెండు క్యాన్సర్ 75 శాతం ఉన్నాయి. అజ్ఞానo, భయం ,సామాజిక కళంకం ,కారణంగా 85 శాతం కేసులు చివరిదశలో ఉన్నాయి. ప్రతి స్త్రీకి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అధిక బరువు ప్రమాదాన్ని పెంచుతుంది కొవ్వు పదార్థాలు మాంసాన్ని అధికంగా తినడం తగ్గించాలి. 40 సంవత్సరాల తర్వాత నోటి గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతి మహిళ క్యాన్సర్ ను ఎలా గుర్తించడం ,మన శరీరంలో మానకుండా ఉండటం, అలాగే పెరుగుతున్న గడ్డలు పుట్టుమచ్చలు మరియు పులిపుర్లు పెరగడం వంటివి. కారకాలు బీడీ, సిగరెట్, తాగే వారి కంటే ఆ పొగను పీల్చే వారికి 30 శాతం క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుంది.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే జీవనశైలి లో మార్పులు. తాజా కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, ప్రతిరోజు భోజనంలో తాజా పండ్లు ఉండేలా, అరగంట శారీరక వ్యాయామము ఉండేలా చూడాలి, సిగరెట్ పాన్ గుట్కా వంటి వాటికి దూరంగా , మహిళలు ప్రతి నెల వక్షోజాలను స్వీయ పరీక్షలు చేయించుకుని గడ్డలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. క్యాన్సర్ నయం చేసే ఆధునిక వైద్య పద్ధతి లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి . పెళ్లికి ముందే అంటే లైంగిక జీవితాన్ని ఆరంభించటానికి ముందే వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చు అని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అనంతరం మహిళలకు అపెక్స్ కంపెనీకి చెందిన మల్టీ విటమిన్ సిరప్ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో హెల్ప్ పౌండేషన్ చైర్మన్ కంచర్ల బుల్లిబాబు, ,ఆశా కార్యకర్తలు అంగన్వాడీలు శ్రీదేవి ప్రమీల సుమతి ద్వాక్రా అని మేటర్ జానకీరాణ సభ్యులు అనిల్ మహిళలు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.