Kids

ప్రపంచానికి ప్రింటింగ్‌ ప్రెస్ ను పరిచయం చేసిన గుటెన్ బర్గ్

ప్రపంచానికి ప్రింటింగ్‌ ప్రెస్ ను పరిచయం చేసిన గుటెన్ బర్గ్

ప్రపంచానికి ప్రింటింగ్‌ ప్రెస్‌ను జోహన్నెస్‌ గుటెన్‌బర్గ్‌ పరిచయం చేశారు. జర్మనీకి చెందిన ఈయన ప్రపంచంలోనే తొలి ప్రింటింగ్‌ మెషీన్‌ కనుగొన్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రింటింగ్‌ రంగంలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు నాందీ పలికిన గుటెన్‌బర్గ్‌.. 1468 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. ఈ ముద్రణ యంత్రం ఆవిష్కరణ తర్వాత విద్యారంగంలో విప్లవం వచ్చింది. పుస్తకాలు ముద్రించడం, ప్రజల్లో పుస్తకాలకు డిమాండ్‌ పెరగడం మొదలైంది. గుటెన్‌బర్గ్‌ తయారుచేసిన ఈ ప్రింటింగ్‌ యంత్రంపై తొలిసారి జర్మనీ భాషలో పద్యాన్ని ముద్రించారు.

*జర్మనీకి చెందిన జోహన్నెస్ గుటెన్‌బర్గ్ 1400 లో జన్మించి.. 1468 లో కన్నుమూశారు. ఈయన ప్రింటింగ్‌ యంత్రాన్ని రూపొందించడంతో చేతితో రాయడం, వుడ్-బ్లాక్ ప్రింటింగ్ ముగింపునకు పునాది వేశారు. గూటెన్‌బర్గ్ 1439 లో ప్రింటింగ్ మెషీన్‌ను కనుగొన్నాడు. ఇది కదిలే రకం ప్రింటింగ్ మెషిన్. 1456 లో జర్మనీలోని మైన్స్ నగరంలోని గుటెన్‌బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బైబిల్ మొదటి కాపీని ముద్రించారు. ఇక్కడే గుటెన్‌బర్గ్ విప్లవం ప్రారంభమైంది. గుటెన్‌బర్గ్ 300 బైబిల్‌ కాపీలను ప్రచురించి ఫ్రాన్స్‌కు పంపడంతో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈయన ముద్రణ యంత్రం రావడంతో ముద్రణలో చెక్కకు బదులుగా మెటల్ బ్లాక్‌లను ఉపయోగించారు. ఈ యంత్రం ఆవిష్కరణతో ఏ రకం కాగితంపైనైనా ముద్రించడం సులభమైంది. ఈ ముద్రణ యంత్రం ద్వారా రోజుకు వేయి కంటే ఎక్కువ పేజీలను ముద్రించేవారు. అంతకు ముందు రోజుకు 40 నుంచి 50 పేజీలు మాత్రమే ప్రింట్ చేసేవారు.

**మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2018: ఆస్ట్రేలియాను ఓడించి నాలుగోసారి ప్రపంచ కప్‌ను గెల్చుకున్న భారత అండర్-19 జట్టు
1972: ఆసియాలో మొదటి వింటర్ ఒలింపిక్స్ జపాన్‌లో ప్రారంభం
1964: భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ జననం
1954: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన మొదటి కుంభోత్సవంలో తొక్కిసలాట జరిగి 800 మంది భక్తుల మరణం
1938: ప్రముఖ భారతీయ నటి వహీదా రెహ్మాన్ జననం
1934: లుఫ్తాన్సా సంస్థ విమానం ద్వారా మొదటిసారి పార్సెల్‌ రవాణా ప్రారంభం
1925: భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు సర్వీస్ ముంబై-కుర్లా మధ్య ప్రారంభం
1815: స్విట్జర్లాండ్‌లో మొదటి జున్ను ఉత్పత్తి కర్మాగారం ప్రారంభం