ముచ్చింతలలో జీయర్ స్వామీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన 216 అడుగుల ఎత్తు ఉన్న శ్రీమత్ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన సమతామూర్తి ప్రాంగణంలో నిర్మించిన 108 ఆలయాలను మోదీ సందర్శించారు. ఒక్కొక్క ఆలయం విశిస్తాను చినజీయారు స్వామీ ప్రధాని మోడీకి వివరించారు. అంతకు ముందు జీయరు స్వామీ ఆశ్రమానికి చేరుకున్న ప్రధాని మోదీకి జీయర్ స్వామితో పాటు రామేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. మోదీ వెంట గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.