Movies

అందుకే ఆ సినిమాకు ఒప్పుకున్న

Auto Draft

బాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్స్‌లో దీపిక పదుకొనే ఒకరు. ‘ఐశ్వర్య’ అనే కన్నడ సినిమాతో నటిగా కెరీర్‌ని ప్రారంభించిన ఈ నటి అనంతరం ‘ఓం శాంతి ఓం’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ సరసన చేసిన ఆ మూవీ మంచి హిట్ సాధించడంతో.. అనంతరం కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం ‘గెహ్రయాన్’. శకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. దీంతో ఈ చిత్రబృందం జోరుగా సినిమా ప్రమోషన్స్‌ సాగిస్తోంది. తాజాగా జరిగిన ఇంటర్య్వూలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.దీపికా మాట్లాడుతూ.. ‘జనాలు ఏం చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కాబట్టి వారు చేసే పనులను బట్టి వారిని అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఇదే నాకు ఈ సినిమా వల్ల తెలిసింది. వారి పనుల వెనక ఉన్న భావోద్వేగం లేదా ఆలోచననిఅర్థం చేసుకోగలిగితే.. మన ఆలోచన విధానంలోనూ మార్పు వస్తుంది’ అని చెప్పింది.‘గెహ్రయాన్’ సినిమాలోని తన పాత్ర గురించి దీపికా మట్లాడుతూ.. ‘యాక్టర్‌గా కొన్ని సార్లు సంబంధం లేని భావజాలం ఉన్న పాత్రలను చేయాల్సి వస్తుంది. కానీ అందరిని కన్విన్స్ చేసేలా.. నమ్మకంగా చేయడం యాక్టర్ పని. అదే ఈ సినిమాలో చేశా’ అంటూ తెలిపింది.ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ గురించి దీపిక మాట్లాడుతూ.. ‘నాకు పఠాన్‌లో యాక్షన్ ఎలా చేయాలో డైరెక్టర్ చెబుతారు కాబట్టి చేయగలిగాను. పద్మావత్‌లో డ్యాన్స్ ఎలా చేయాలో కొరియోగ్రాఫర్ చెబుతారు కాబట్టి దాన్ని చేశా. అలాగే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి దగ్గరగా ఉన్నారు అంటే అది కేవలం శారీరక సాన్నిహిత్యమే కారణం అనుకోవడం తప్పు. అది అంతకుమించి మనసుకి సంబంధించింది. అది మనకు తెలుసు. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ కోసం వర్క్ షాప్ నిర్వహించారు. అందులో శకున్ సైతం పాల్గొన్నాడు. ఆ వర్క్ షాప్ వల్లే మా మధ్య సన్నిహిత్యం పెరిగి.. సినిమాకి అవసరమైన కంటెంట్‌ని ఇవ్వగలిగాం’ అని చెప్పుకొచ్చింది.