NRI-NRT

అమెరికాలో 9 లక్షలకు చేరిన కోవిడ్ మరణాల సంఖ్య

అమెరికాలో 9 లక్షలకు చేరిన కోవిడ్ మరణాల సంఖ్య

కరోనా మరణాల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికా మరో మైలురాయిని చేరుకుంది. శుక్రవారం నాటికి మహమ్మారి కారణంగా అమెరికాలో మరణించిన వారి సంఖ్య 9లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కారణంగా వల్ల కలిగిన మానసిక, శారీరక, భావోద్వేగా బాధలను భరించడం కష్టమన్నారు. ‘9లక్షల మంది ప్రజలను కరోనా బలితీసుకుంది. ఎంతో మంది తమకు ఇష్టమైన వారిని కోల్పోయారు. ఆ బాధ వర్ణాతీతం’ అన్నారు.అంతేకాకుండా కరోనాను ఎదుర్కొవడానికి ప్రస్తుతం ఎన్నో ఆయుధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో వ్యాక్సిన్ అత్యుమ ఆయుధంగా బైడెన్ అభివర్ణించారు. మహమ్మారిపై కొవిడ్ వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. దాదాపు 250 మంది అమెరికన్లు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా తమ ప్రాణాలతోపాటు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా రక్షించుకున్నారని పేర్కొన్నారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.