WorldWonders

ట్యాoకర్ పేలి నలుగురు మృతి – TNI నేర వార్తలు 07/02/2022

ట్యాoకర్ పేలి నలుగురు మృతి –  TNI  నేర వార్తలు 07/02/2022

*సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేటలో గ్యాస్ ట్యాంకర్‌ పేలి ఇద్దరు మృతి చెందారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి మండలం కాట్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు శంకరయ్య (55), జమున(50), శ్రీధర్ గా గుర్తించారు. ఆత్మహత్యకి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

* విజయవాడ రూరల్ అంబాపురం లో రెండు వర్గాల మధ్య ఘర్షణ. జోజి అనే వ్యక్తి కి కత్తి పోట్లు. గుంటూరు ఆసుపత్రికి తరలింపు

* విజయవాడ కానూరు సనత్ నగర్ లో డివైడర్ ను ఢీ కొన్న బైక్. భర్త మృతి. భార్యకి గాయాలు. వివరాలు తెలియాల్సి ఉంది.

* వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కాగా అదే దారిలో వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అగి మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రుడిని వెంటనే వైద్య శాలకు తరలించారు. పోలీస్ లతో మాట్లాడి వేగంగా ట్రాఫిక్ నియంత్రణ, పంచనామా, శవ తరలింపు తదితర అంశాలను అక్కడే ఉండి పర్యవేక్షించారు. పోస్ట్ మార్టం వంటి వాటిని వేగంగా పూర్తి చేయాలని అదేశించారు. రోడ్డు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు.

* కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని శ్రీ బాలజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు.సోమవారం తెల్లవారుజామున ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ ఆలయంలోకి రాగానే ఆలయం గేటు తెరిచి ఉండడంతో.. చోరీ జరిగిన విషయాన్ని ఎస్సై రవికుమార్ కు సమాచారం అందించారు.

* మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు.

* భాగ్యనగరంలో బెట్టింగ్ ముఠా ఆటకట్టింది. బేగంబజార్ కేంద్రంగా ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన మొత్తం 8 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.60 లక్షల నగదు, క్యాసినో కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

* రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* అద్దంకిలో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశ్వభారతిరాయల్ కాలేజీ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘర్షణకు సంబంధించిన వీడియోలను కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అధికారపార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వైసీపీ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆరో డివిజన్ సుంకరవారితోటలో పిడుగుల వెంకట గాంధీ అనే వ్యక్తి తన ఇంటిపై మరో అంతస్థుకు శ్లాబ్ వేస్తున్నాడు.

* చిట్టీల పేరుతో సుమారు రూ. మూడు కోట్ల సొమ్ము కూడగట్టి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఉడాయించారు దంపతులు. ఈ సంఘటన సూరారంకాలనీలో జరిగింది. బాధితులు న్యాయం కోసం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ను ఆశ్రయించారు. వారికి న్యాయం జరిగేలా చూడాలని దుండిగల్‌ సీఐ రమణారెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు. సూరారంకాలనీ రాజీవ్‌గృహకల్ప 11వ బ్లాక్‌ ఎదురుగా మద్దిరాల పద్మ, విజయ్‌కుమార్‌ ఇరవై ఏళ్లుగా నివాసముంటున్నారు. స్థానికులతో కలుపుగోలుగా ఉంటూ చిట్టీల వ్యాపారం చేశారు.

* గన్నవరం మండలం అజ్జాంపూడి గ్రామ సమీపంలో కేసరపల్లి యువకులకు ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న బీహార్ యువకుడికి మధ్య వివాదం చెలరేగింది. కేసరపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సునీల్ అనే యువకుడుకు బీహార్‌కు చెందిన యువకుడికి మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* అద్దంకిలో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశ్వభారతిరాయల్ కాలేజీ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘర్షణకు సంబంధించిన వీడియోలను కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

*వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో జూరాల కాలువలో దూకింది. ఇది గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

*నెల్లూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. నారాయణరావుపేటలో రిజల్ట్స్ అపార్ట్‌మెంట్ మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడి రాజేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఓ ప్రయివేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుండేవాడు. గుప్తా పార్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పైనుంచి కిందపడే క్రమంలో కరెంట్ వైర్లు మీద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. ఆపై రాజేష్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*బాపులపాడు మండలంలోని వీరవల్లి పేపర్ మిల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాలిని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వాడపల్లి బాబు (40), వెంకటరమణ (42)గా పోలీసులు గుర్తించారు.

*మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు.

*బాలికపై అత్యాచారయత్నం ఘటన దాచేపల్లి మండలం కేశానుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను పట్టుకున్నాడు. బాలిక భయంతో కేకలు వేయటంతో చుట్టు పక్కల వారు దగ్గరకు రావడంతో ఆ యువకుడు పాపను వదిలేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దాచేపల్లి పోలీసులను సంప్రదించగా తమకు ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

*పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ పొలాల్లో కాచి ఉంచిన 1500లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం పులివెందు ల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ భాస్కర్‌రెడ్డిల ఆదేశాల మేరకు ఉలిమెల్ల గ్రామ పొలాల్లో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో చీకిచెట్ల మాటున ఐదు డ్రమ్ములలో కాచి ఉంచిన 1500 లీటర్ల నాటుసారా ఊట ఉండగా సిబ్బందితో కలిసి ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

*తనను అవమానించారని మనస్తాపానికి గురైన ఓ బాలి క ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండలో ఆదివారం చోటు చేసుకుంది.

*ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్‌ రోహిత్‌కుమార్‌ బిశ్వాల్‌(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

*విద్యబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కామంతో కండ్లు మూసుకుపోయి ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాల ప్రకారం… పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఆశ్వక్‌ అహ్మద్‌ ఖాన్‌ (35) 2015 నుంచి ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా శనివారం పాఠశాలలో సుమారు 8.30 గంటలకు సమయంలో అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా బాలిక వీపుపై విచక్షణారహితంగా కొట్టాడు.

*వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో శనివారం పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మూడు వాహనాలను సీజ్‌ చేశారు. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలం ఆకులనారాయణ పల్లి సమీపంలోని అడవుల్లో నిందితులు ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా తయారుచేసి వాహనాల్లోకి ఎక్కించి తరలించడానికి సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో పోరుమామిళ్ల సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఏ కాశినాయన ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తమ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు.

*నర్సీపట్నం గబ్బాడ సమీపం నెల్లిమెట్ట వద్ద నర్సీపట్నం రూరల్‌ పోలీసులు శనివారం గంజాయి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ఎస్‌. రమేష్‌ తెలిపిన వివరాలివి. ముందస్తు సమాచారం మేరకు నెల్లిమెట్ట జంక్షన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఇంతలో ఓ లారీ రావాడాన్ని గుర్తించి ఆపగా, డ్రైవర్‌ పరారయ్యాడన్నారు. లారీలో చూడగా, 1,100 కిలోల గంజాయి మూటలు బయట పడినట్టు చెప్పారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు

*అమలాపురం శివారు గాంధీనగర్‌ సమతానగర్‌లో నివాసం ఉంటున్న నక్కా శివప్రసాద్‌(36) శనివారం ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివప్రసాద్‌కు 12ఏళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లో ఉపాధి పొంది శివప్రసాద్‌ ఇటీవల అమలాపురం చేరుకుని రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇండ్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల శివప్రసాద్‌ కొందరు వ్యక్తులతో గొడవపడినట్టు సమాచారం.భార్య సుబ్బలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమలాపురం పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

*రఘునాథపాలెంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగిది. బాధితుడి వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పిట్ల రంగయ్య సుతారి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం పని నిమిత్తం భార్యను తీసుకొని ఖమ్మం వెళ్లాడు.

* బయ్యారం మండలం నారాయణపురం గ్రామ కార్యదర్శి వెంకటేష్ రెండో రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కలెక్టర్‎కి లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కార్యదర్శి వెంకటేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ బోట్‌ క్లబ్‌లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. బోట్‌క్లబ్ చెరువులో సరదాగా చేపలకు గాలం వేస్తూ పిల్లలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న సర్పవరం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.