Health

వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ ఔషధాలు

వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ  ఔషధాలు

1.వాము:
వాతశ్లేష్మములనణచును. కడుపు నొప్పిని తగ్గించును. నులి పురుగులను, ఏలిక పాములను రానివ్వకుండును. వాంతులు, విరేచనాలను అరికట్టును. జీర్ణ వ్యవస్ధను బాగుచేయును.

2) కురాసాని వాము:
చక్కగా నిద్ర పట్టించును, కడుపులో పుట్టే హానికరమైన క్రిములనన్నింటిని పోగొట్టును. ప్రేగులను శుభ్ర పరచును.

3) కురంజి వాము:
పొత్తి కడుపులో ఏర్పడే నుసి పురుగులనెడి క్రిములను పోగొట్టుటకు ఇది పెట్టింది పేరు. సర్వ జీర్ణ వ్యాధులను తగ్గించును. మూత్ర మరియు మల ద్వార సంబంధిత వ్యాధులను తగ్గించును.

4) వస:
వాత పిత్త శ్లేష్మ దోషములను పోగొట్టును. కంఠమునకు హితకరమైనది. బుద్ధి మాంద్యమును పోగొట్టును. మాటలు త్వరగా చక్కగా వచ్చుటకు ఉపయోగపడును. ఙ్ఞాపక శక్తి పెంపొందించుటకు బహు ఉపయోగకారి. చిన్న పిల్లల చేస్టాలు అనెడి వ్యాధి, మూర్చలు, ఆటిజం అను వ్యాధులను రానివ్వకుండును.

5) కరక్కాయ:
కన్నులకు చాలా హితకరమైనది. దృష్టిమాంద్యంను రానివ్వకుండును. దగ్గు, ఆయాసంలను నివారించును. జ్వరములను తగ్గించును. రేచీకటిని దరిచేరనివ్వదు.

6) తానికాయ:
త్రిదోషములను హరించును. గొంతు బొంగురు పోవుట అను రోగమును పోగొట్టును. తల వెంట్రుకలను వృద్ధి చేయును. ఎర్రని తల వెంట్రుకలను నల్లగా చేయును. బాల నెరుపును రానివ్వకుండును. దప్పికను తగ్గించును. నోటిలోని, కడుపులోని పుండ్లను తగ్గించును. పుప్పి పళ్ళ సమస్యను రాకుండా చేయును.

7) శొంఠి:
రుచిని పుట్టించును. పైత్యమును తగ్గించును. రక్త క్షీణతను రాకుండా చేయును. జఠరాగ్నికిది ఉత్తమమైనది.

8) మిరియాలు:
ఫుడ్ పాయిజనింగ్ ను పోగొట్టును. అత్యుష్ణమును నివారించును. చర్మ దోషములను పోగొట్టును. జ్వరమును తగ్గించును. లివర్ , స్ల్పీన్ వ్యాధులను అరికట్టును. చికెన్ పాక్స్ , స్మాల్ పాక్స్ వ్యాధులను రాకుండా రక్షించును.

9) పిప్పళ్ళు:
శ్వాసకోశ వ్యాధులు రాకుండా రక్షించును. దగ్గును తగ్గించును. కామెర్లు రాకుండా చేయును. ఆహారం లేదా పాలు తీసుకున్న తరువాత అయ్యే వాంతులు మరియు విరేచనాలను అవ్వకుండా చేయును. పాల ఉబ్బసాని దరిజేరనివ్వకుండును.

10) మోడి:
క్షయ, నిమోనియా వ్యాధులు రాకుండా రక్షించును.డస్ట్ అలర్జీని రాకుండా కాపాడును. ధనుర్వాతం, మసూచి అను వ్యాధులను రానివ్వదు. కాళ్ళు చేతులు పడిపోవుట అను వ్యాధిని రానివ్వదు. ఎముకలకు, నరములకు మంచి శక్తిని ఇచ్చును.కీళ్ళ వాతమును రానివ్వదు.

11) మోదుగమాడ:
గజ్జి, తామర, సోభి, దురదలు, దద్దుర్లు మొదలను చర్మ వ్యాధులను రానివ్వదు. కలరా, మలేరియా వ్యాధులను రాకుండా రక్షించును. వినికిడి లోపము రాకుండా చేయును. చెవిలో చీమును తగ్గించును. చుండ్రు రాకుండా చేయును.

12) సునాముఖి:
ఆహారమును చక్కగా జీర్ణము కావించి సుఖ విరేచనము చేయును. రక్త శుద్ధి, రక్త వృద్ధి చేయును. బొల్లి వ్యాధిని రానివ్వదు. దేహమును మృదువుగా మరియు కాంతి వంతముగా వుంచును. చర్మ ఆరోగ్యమును రక్షించును.

13) ఆముదం:
సమస్ధ వాతములను పోగొట్టును. దీనికి వాతారి, వాతకి శతృవు అను పేర్లు కలవు. ప్రేవులలో మలము పేరుకుపోవుటను నివారించును. గ్యాష్ట్రిక్ ట్రబుల్ , అల్సర్ అను వ్యాధుల బారిన పడకుండా రక్షించును. టిన్సిల్స్ , ఎడినాయిడ్స్ , వివిధ రకాలైన కంతులను రానివ్వకుండా రక్షించును. మెదడు వాపు వ్యాధిని రానివ్వదు. డెంగ్యూ, గునియా, స్వెైన్ ఫ్లూ వ్యాధులను దరిజేరనివ్వదు. కీళ్ళ వాతమును, కండర వాతమును నిశ్శేషముగా పోగొట్టును. మస్క్యిలర్ డెస్ట్రొఫీ అను సర్వాంగ వాతవ్యాధిని రానివ్వకుండా రక్షించును. శరీరంలోని సమస్ధ అవయవములకు మేలు చేయును. చలువ చేయును. ఆముదం ఆరోగ్యమును కాపాడడంలో అత్యంత శ్రేష్టమైనది. దీని వాడుకలో ఏవిధమైన హాని లేదు.