Business

న‌ష్టాల్లో కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు – TNI వాణిజ్యం 07/02/2022

న‌ష్టాల్లో కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు – TNI వాణిజ్యం  07/02/2022

* జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్‌ల‌పై ప‌డ్డాయి. దీంతో సోమ‌వారం ఉద‌యం ప్రారంభం నుంచి స్టాక్‌ మార్కెట్‌లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఉద‌యం 11గంట‌ల స‌మ‌యానికి సెన్సెక్స్ 347 పాయింట్లు న‌ష్టంతో 58297.24 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా..నిఫ్టీ 118 పాయింట్లు న‌ష్ట పోయి 38604 వ‌ద్ద ట్రేడింగ్ ను కొన‌సాగిస్తుంది. ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ప‌వ‌ర్ గ్రిడ్ గ్రూప్‌,కోల్ ఇండియా, ఎన్టీపీసీ,హిందాల్కో, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో కొన‌సాగుతుండ‌గా..హీరో మోటా కార్ప్‌, అథేర్ మోటార్స్‌,టాటా సీఓఎన్ ఎస్‌,లార్సెన్‌, బ‌జాజ్ ఫైనాన్స్ షేర్లు న‌ష్టాల్లో ఊగిస‌లాడుతున్నాయి.

*ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌… ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం పేరుతో కొత్త టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. లైఫ్‌ స్టేజ్‌ కవర్‌, లెవల్‌ కవర్‌ పేరుతో రెండు పథకాలు అందుబాటులో ఉంటాయి. అన్ని ప్రీమియంలపై 105 శాతం వరకు రిటర్నులు ఇవ్వటం వీటి ప్రత్యేకత. 60 లేదా 70 ఏళ్లు లేదా పాలసీ మెచ్యూరిటీపై ఈ రిటర్నులు అందించనుంది. 64 కీలకమైన రుగ్మతలకు కవరేజీ కల్పించటంతో పాటు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ పాలసీని రూపొందించింది.

*స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.8,432 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.5,196 కోట్లతో పోల్చితే ఇది 62.27 శాతం అధికం. ఒక త్రైమాసికంలో అత్యధిక లాభం ఇదే కావడం విశేషం. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదా యం రూ.75,981 కోట్ల నుంచి రూ.78,352 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 6.48 శాతం వృద్ధితో రూ.30,687 కోట్లకు పెరిగింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.34 శాతం నుంచి 3.40 శాతానికి మెరుగుపడింది.

*డిసెంబరు త్రైమాసికంలో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.778.5 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.535.5 కోట్లుగా ఉన్నాయి. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 88 శాతం వృద్ధితో రూ.1,456 కోట్లకు పెరిగింది.

*కరోనా మహమ్మారి జీవితాలను ఛిద్రం చేసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో గృహస్థులు చారిత్రక రికార్డు స్థాయి లో పొదుపు చేశారు. ఆ సంవత్సరం గృహస్థుల పొదుపు రూ.7.1 లక్షల కోట్లుంది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇళ్లకే పరిమితమైన గృహస్థులు ముందు జాగ్రత్త చర్యగా లేదా నిర్భందంగా పొదుపు పెంచుకున్నారని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు ఒక నివేదికలో తెలిపారు.

*ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స (ఐఎ్‌సబీ) విద్యార్థులకు ఉద్యోగాల పంట పండింది. ఐఎ్‌సబీ హైదరాబాద్‌, మొహాలీ క్యాంప్‌సల్లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ) విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేందుకు ఈ ఏడాది ఏకంగా 270 కంపెనీలు పోటీపడ్డాయి

*జర్మనీకి చెందిన ‘నింబస్‌ హెల్త్‌ జీఎంబీహెచ్‌’ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌ ఔషధ తయారీ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది. 2018లో ఏర్పాటైన నింబస్‌ హెల్త్‌.. వైద్య అవసరాల కోసం గంజాయిని టోకుగా విక్రయించేందుకు లైసెన్సు కలిగి ఉన్న ప్రైవేట్‌ కంపెనీ. అప్‌ఫ్రంట్‌ చెల్లింపులతో పాటు వచ్చే నాలుగేళ్లలో నింబస్‌ హెల్త్‌ పనితీరు, ఆదాయ మైలురాళ్ల ఆధారంగా ఈ కొనుగోలును చేపట్టినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. అయితే, డీల్‌ విలువను మాత్రం వెల్లడించలేదు.

*వేగంగా దూసుకుపోయే అధునాతన వందే భారత్‌ ట్రెయిన్ల తయారీ కోసం మేధా సర్వో డ్రైవ్స్‌ అనే హైదరాబాద్‌ కంపెనీ పోటీ పడుతోంది. బొంబార్డియర్‌, సీమెన్స్‌, భారత్‌ హెవీ ఎలక్ర్టికల్స్‌తో పాటు మేధా సర్వో డ్రైవ్స్‌ కంపెనీ ఇందుకోసం ఇప్పటికే బిడ్‌ సమర్పించినట్టు సీనియర్‌ అధికారులు తెలిపారు. 2023 ఆగస్టునాటికి 75 వందే భారత్‌ ట్రెయిన్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఇప్పటికే 44 ట్రెయిన్ల తయారీ చేపట్టారు. మరో 58 ట్రెయిన్లకు ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ను సమీకరించే ప్రక్రియను రైల్వేస్‌ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. వచ్చే మూడేళ్లకాలంలో 400 వందే భారత్‌ ట్రెయిన్లను తయారు చేయాలన్నది లక్ష్యం.