Business

టాటాల దేశభక్తికి ఇదే నిదర్శనం

టాటాల దేశభక్తికి ఇదే నిదర్శనం

18వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను..కరోనా దెబ్బకు కుదేలైన విమానయానంను బతికించేందుకు దేశంలోనే అపరకుబేరులైన అంబానీలు, అదానీలు ముందుకు రాలేదు… అదే దేశ ప్రతిష్టకు ఆయువుపట్టుగా ఉన్న ఎయిర్ ఇండియాను ‘టాటా’లు అంత మొత్తం పెట్టి కొన్నారు అంతేకాదు.. భారతీయ సంప్రదాయాన్ని తాజాగా ఇనుమడింపచేశారు…భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేసేలా మోడ్రన్ దుస్తులు ధరించే ఎయిర్ హోస్టెస్ ను సంప్రదాయ చీరలు కట్టించి వారితో చేతులు జోడించి నమస్కారం పెట్టించి ఆహ్వానించేలా విమానంలో ఏర్పాటు చేశారు. ఇలా సంప్రదాయంలోనూ ‘టాటా’లు చూపిన శ్రద్ధకు దేశ ప్రజలంతా ఫిదా అవుతున్నారు…