కాంట్రవర్సీలకు కేరఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఈయన తిండి లేకపోయినా సరే ఉంటాడేమో కానీ, వివాదం లేకుండా మాత్రం ఉండలేరు. తనను ఎవరూ తిట్టకపోతే చివరికి తనను తానే తిట్టుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎవరు ఏమన్నా.. తన జీవితం తన ఇష్టం అంటూ, తన చావు తాను చస్తానని కామెంట్ చేస్తుంటారు వర్మ. ఇక సోషల్ మీడియాలో వర్మ చేసే హంగామా మాములుగా ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరిపై కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక తాజాగా వర్మ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. చనిపోయిన వ్యక్తికి RIP చెప్పడం అవమానకరమైనది ఎందుకంటే ఇక్కడ శాంతియుతంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తులను సోమరిపోతులు అంటారు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు , “RIP” వంటి మాటలు చెప్పే బదులు మనం “మంచి జీవితాన్ని గడపండి.. ఎక్కువగా ఆనందించండి” అని చెప్పాలి. అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.