[14:41, 08/02/2022] Muddu Kilaru: భామా కలాపం’లో అనుపమ లాంటి పాత్ర ఈ మధ్యకాలంలో చేయలేదు. గతంలో ‘రగడ’లో చేశా. సవాల్ విసిరే పాత్ర ఇది. కొత్తగా ఉంటుంది’’ అని ప్రియమణి అన్నారు. ‘ఆహా’ ఓటీటీ కోసం ఆమె నటించిన ‘భామాకలాపం’లో ప్రియమణి అనుపమా పాత్రలో కుకింగ్ యూట్యూబర్‌గా నటించారు. ఈ నెల 11న ఈ చిత్రం స్ర్టీమింగ్ కానుంది. ఈ సిరీస్ గురించి ప్రియమణి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘కోల్‌కతా మ్యూజియంలో అపహరణకు గురైన రూ.200 కోట్ల విలువైన గుడ్డు చుట్టూ తిరిగే కథతో సినిమా సాగుతుంది. ఇందులో ఓ మధ్య తరగతి గృహిణిగా, కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా కనిపిస్తా. ‘అనుపమ ఘుమఘుమ’ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తుంటుంది. రుచికరమైన వంటలు వండి ఆ వీడియోలను ఆ ఛానెల్లో పోస్ట్ చేస్తుంటుంది. ఇంటి నిర్వాహణతోపాటు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఈ షోలో అనుపమ పాత్ర గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి విషయంలో జోక్యం చేసుకునే తత్వం(మెడ్లింగ్) ఉన్న అమ్మాయి. అనుపమలో నాకు నచ్చనిది ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం. నచ్చింది ఆమె అమాయకత్వం. నిజజీవితంలో నాకు అనుపమకి ఎలాంటి పోలికలు లేవు. తనకు వంట మీద మంచి గ్రిప్ ఉంది. నాకు తినడం తప్ప వండటం రాదు. నిజజీవితంలో నేను అమాయకురాలిని కాదు. తనకులాగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించను. ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు.