ఆంధ్రా గర్వించేలా మరో క్రికెటర్ నిలిచాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, పాతమల్లాయ పాలెంకు చెందిన షేక్ రషీద్, భారతజట్టు U-19 ప్రపంచ కప్ గెలవడానికి కృషిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భముగా రషీద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, తను మరెన్నో విజయాలు సాధించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్రికెటర్ రషీద్ కు అభినందనలు తెలిపారు.