Devotional

రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు

రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు

వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 12 రోజుల వ్యవధిలోనే 2 కోట్ల 25 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. గత నెల 27వ తేదీ నుంచి భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా 2 కోట్ల 25 లక్షల 04 వేల 855 రూపాయల నగదుతోపాటు 247 గ్రాముల 860 మిల్లీల బంగారం, 12 కిలోల 940 గ్రాముల వెండి లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. గతంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో అత్యధికంగా కోటిన్నర రూపాయల ఆదాయం సమకూరగా, ఈసారి లెక్కింపులో ఏకంగా రూ.2 కోట్ల 25 లక్షలకు పైగా నగదు లభించడంతోపాటు భారీ మొత్తంలో బంగారం, వెండి సమకూరడం విశేషం.

*వీసా రావాలని…
రెండున్నర లక్షల కానుక తమ కుమార్తెకు వీసా రావాలని అజ్ఞాత భక్తులు రెండున్నర లక్షల రూపాయలను రాజరాజేశ్వరస్వామివారి హుండీలో సమర్పించారు. మంగళవారం హుండీ లెక్కించిన ఆలయ సిబ్బందికి తమకు కనిపించిన మూటను విప్పి చూడగా అందులో రెండున్నర లక్షల రూపాయల నగదుతోపాటు ‘డింపులుకు వీసా రావాలి‘ అని రాసిన కాగితం లభించింది.