నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ కర్నాటక హిజాబ్ వివాదంపై స్పందించారు. కర్నాటకలో హిజాబ్ ధరించిన విద్యార్థులను విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడాన్ని ఆమె వ్యతిరేకించారు. ముస్లీం విద్యార్థినీలను హిజాబ్‌లతో విద్యాసంస్థల్లోకి వెళ్లనివ్వకపోవడం భయంకరమని అని ట్వీట్ చేశారు. హిజాబ్ ను వ్యతిరేకించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను భయనక చర్యగా వర్ణించారు. భారత నాయకులు.. ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాలన్నారు. అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తి ..పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ . ముస్లీం మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ‘ఐయామ్ మలాలా’ (నేను మలాలా) అన్న పేరుతో ఆమె పుస్తకం రాసింది. అనేక ఉద్యమాలకు తన మద్దతు ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె హిజాబ్ ఘటనపై స్పందించారు.