* బీజేపీ ఎవరి దాయదక్షిణ్యాల మీద పనిచేయడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీ పై మాట్లాడిన సీఎం కేసీఆర్ కు త్వరలోనే గౌరవంగానే సమాధానం చెబుతామన్నారు. ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ యుద్ధం చేస్తామంటే తాము కూడా అదే తరహాలో ముందుకెళ్తామని స్పష్టం చేసారు. మరోవైపు ఈ నెల 15,16తేదీల్లో సాలర్జంగ్ మ్యూజియంలో అంతర్జాతీయ మ్యూజియం సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
* ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నారు కస్టమ్స్ అధారులు. ఓ ప్రయాణికుడు డ్రగ్స్ తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేశారు. అతని వద్ద సుమారు రూ. 60 కోట్లు విలువైన మత్తుపదార్థాలు దొరికినట్లు చెప్పారు.
* బ్రాందీ షాపుల వద్ద వాచ్‌మెన్‌ను హత్య చేసి దొంగతనాలకు పాల్పడే అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 బైకులు 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన దుర్గారావు అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి విజయనగరం జిల్లాలో 45 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు దుర్గారావుతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారీలోఉన్నట్లు డీఐజీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు
* పరిశ్రమల నగరం కోయంబత్తూరులో నకిలీ పత్రాలతో పది కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణం పొంది ఎగవేతకు పాల్పడిన కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌తో పాటు మొత్తం ఎనిమిదిమందిని క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
*కుప్పం సరిహద్దు ప్రాంతం కర్నాటక బిసనాథం దగ్గర జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. జల్లికట్టు పర్యవేక్షణ కోసం వచ్చిన కోలార్ డీఎస్పీ మురళీధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లకు తాడు తగలడంతో డీఎస్పీ తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను వెంటనే కుప్పం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు గడిచిన తర్వాత గానీ ఏ విషయం చెప్పలేనమని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కోలార్ ఎస్పీ సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చి డీఎస్పీ ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు
* విమానాశ్రయంలో 2.76 కిలోల బంగారం పట్టివేత – ఇద్దరి అరెస్టు
దుబాయ్, శ్రీలంక నుంచి శుక్రవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయానికి వచ్చిన రెండు విమానాల్లో అక్రమంగా తరలిస్తున్న 2.75 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. దీనిపై కస్టమ్స్ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో, దుబాయ్ విమానంలోని ప్రయాణికుల్లో నగరానికి చెందిన జమీన్‌కమల్(35) అనే వ్యక్తి సూట్‌కేస్ అరల్లో దాచిన 1.53 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీలంక నుంచి వచ్చిన మరో విమానంలోని అబుదాగీర్(39) నుంచి 1.23 కిలోల బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఇరువురి అరెస్టు చేసి విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
*గుంటూరు నగరం మండలం పూడివాడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పూడివాడలో నివాసముంటున్న కర్రి వెంకటేశ్వరరావు(40), ఆదిలక్ష్మి(35) దంపతుల మధ్య ఘర్షన చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భర్త తల గోడకు బలంగా కొట్టుకుంది. దీంతో వెంకటేశ్వరరావు మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగింది. మరణించిన వెంటనే భర్త మృతదేహాన్ని ఆదిలక్ష్మి తమ ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో పోలీసులు విచారణ నిర్వహించగా అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
* గుంటూరు జిల్లాలోని సంగడి కుంట కమ్మ బజార్‌లో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. అర్థరాత్రి సమయంలో కారు, బైక్‌లో నుండి మంటలు ఎగిసిపడ్డాయి. ఇంటి ముందు పెట్టిన వాహనాల్లో నుండి మంటలు రావటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* ఒంగోలు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్ణమిట్టలో కందుకూరి బాబు ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు రూ.4.5 లక్షల నగదు, 38 సవర్ల బంగారాన్ని దుండగులు అపహరించారు. ఒంగోలు విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్‌లో బాధితులు పెల్లి వేడుకలో ఉన్న సమయంలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* చిత్తూరు జిల్లాలోని తవణంపల్లి మండలం మాధవరం ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు మీద పడి ఏనుగు మృతి చెందింది. విద్యుత్ స్తంభాన్నిఢీ కొనడంతో స్తంభం రెండుగా విరిగి లైను ఏనుగుపై పడింది. దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
*వరంగల్ జిల్లాలోని బాలుడి ఆచూకి లభించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఆరేపల్లి దగ్గర కాకతీయ కాలువలో జారిపడి చిట్యాల యశ్వంత్ (10) అనే బాలుడు గల్లంతయ్యాడు. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ సరిగా లేక బహిర్భూమి కోసం కాలువ దగ్గరకు వచ్చిన యశ్వంత్ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. 18 గంటలైనా బాలుడి ఆచూకి దొరకలేదు. మరోవైపు నీటి ఉధృతిని తగ్గించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
*దుబాయ్, శ్రీలంక నుంచి శుక్రవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయానికి వచ్చిన రెండు విమానాల్లో అక్రమంగా తరలిస్తున్న 2.75 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. దీనిపై కస్టమ్స్ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో, దుబాయ్ విమానంలోని ప్రయాణికుల్లో నగరానికి చెందిన జమీన్‌కమల్(35) అనే వ్యక్తి సూట్‌కేస్ అరల్లో దాచిన 1.53 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీలంక నుంచి వచ్చిన మరో విమానంలోని అబుదాగీర్(39) నుంచి 1.23 కిలోల బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఇరువురి అరెస్టు చేసి విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
*ల్లీలోని జేజే కాలనీలో ఓ పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. భవనం శిథిలాల కింద నుంచి వీరి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.
*గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్కు మూడు న్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని ముక్కలు చేసి ఉంచారు.అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్ ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు. అవి గొంతులో ఇరుక్కుపోవడంతో స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాడు.
*విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విచారణలో ఉన్న నిందితుడు రికార్డు రూంలో ఉన్న సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం గాజులరేగకు చెందిన బేతా రాంబాబు అలియాస్ సురేష్ (44) ఈ నెల 7న నెల్లిమర్లలోని ఉపాధి హామీ కార్యాలయంలో జరిగిన బ్యాటరీల దొంగతనం కేసులో నిందితుడు. గురువారం నెల్లిమర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
*లారీ సహా 7.5 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం లారీ, నిందితులను సత్యవేడు సీఐ శివకుమార్రెడ్డి, నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాగలాపురం మీదుగా తమిళనాడుకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. నందనం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో మాటు వేశారు. చెన్నై వైపు వెళ్తున్న లారీ (ఏపీ03టీబీ2444)ని తనిఖీ చేయగా 150 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు) రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
*పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల వ్యవహారశైలి సరిగ్గా లేకపోవడంతో భార్యలు వారిని విడిచి పుట్టింటికి వెళ్లిపోయారు. పెద్ద సోదరుడి కుమార్తె(14) వారివద్దే ఉంటోంది. అయితే అన్నదమ్ములు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు కొంతకాలంగా ఆ బాలికను బెదిరించి అత్యాచారం చేస్తున్నారు. స్థానిక సచివాలయంలోని మహిళా పోలీసుకు సమాచారం అందడంతో బాలికను ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
*కర్నూలు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. ఆపరేషన్ చేయించేందుకు వెళ్తూ భార్యాభర్తలు, ఆమె సోదరి మరణించారు. ఒకరి తల మొండెం నుంచి వేరై రోడ్డుపై పడింది. మరో ప్రమాదంలో మిర్చి అమ్ముకుని వస్తున్న ఇద్దరు మృతిచెందారు
*బెంగళూరు నగర శివారులోని బిడదిలో వృద్ధ దంపతులను హతమార్చిన సం ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈగల్టన్ రిసార్టులోని ఒక విల్లాలో ఎయిర్ఫోర్స్ రిటైర్డు వింగ్ కమాండర్, తమిళనాడుకు చెందిన రఘురాజ్ (70), భార్య ఆశా(65) ఉంటున్నారు. ఇనుపసుత్తితో కొట్టి వీరిని హతమార్చారు. ఇంటి పనిచేసే బిహార్కు చెందిన జో గిందర్సింగ్ తన సహచరులతో కలసి కుట్ర పన్ని ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది.
*కాంచీపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది
*చెన్నై వానగరం అడయాలంపట్టు ప్రాంతంలో ఐదంతస్థుల మిద్దెపై నుంచి కిందకు దూకి 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం జరిగింది.45 ఏళ్ల వయసున్న హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి తన మారు కూతురిపై అత్యాచారం చేసిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్ సమీపంలోని తన గుడిసెలో నిందితుడు తన మారు కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.నిందితుడు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్(హెచ్ఐవీ) బారిన పడ్డాడు. అత్యాచారం చేయడం వల్ల మైనర్ బాలికకు కూడా హెచ్ఐవీ సోకిందా అనే కోణంలో పోలీసులు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. తల్లి లేని సమయంలో బాలికపై అత్యాచారం ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. బాలిక తల్లి కూడా హెచ్ఐవి పాజిటివ్.ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిందితుడు మైనర్బాలికను బెదిరించారు
*ఎర్రచందనం స్మగ్లర్లను తరలిస్తున్న విల్లుపురం డివిజన్ రవాణా సంస్థకు చెందిన బస్సును తిరుపతి అర్బన్ స్పెషల్ పార్టీ పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు ప్రధాన స్మగ్లర్లతోపాటు డ్రైవర్, కండక్టర్ను అదుపులోకి తీసుకున్నారు.
*ఓ మహిళ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, రూ.2 కోట్లు ఇవ్వకుంటే తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరిస్తోందని కలబుర్గి జిల్లా సేడం బీజేపీ ఎమ్మెల్యే రాజ్కుమార్ పాటిల్ తేల్కుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతోపాటు భర్తపైనా విధానసౌధ పోలీసులకు ఈనెల 5న ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు మహిళను స్టేషన్కు రప్పించి విచారణ జరిపారు.
*కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాలో సోమవారం తెల్లవారుజామున జోడిరంగాపుర వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినవారు మృత్యువాత చెందారు.
*దిండుగల్ జిల్లా గోపాలపట్టిలోని బహుళ అంతస్తుల వస్త్ర దుకాణంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించింది. దుస్తులు, ఏసీ పరికరాలు, ఫర్నిచర్, ఇతర వస్తువులు బుగ్గి పాలయ్యాయి.
*టోల్గేట్లో రుసుము చెల్లించేందుకు కదులుతున్న ట్యాంకర్ లారీని వెనుకవైపు నుంచి వచ్చిన కారు వేగంగా దూసుకెళ్ళి ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
* జూబ్లీహిల్స్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఖరీదైన కారుతోపాటు మరో మూడు కార్లు దగ్ధమయ్యాయి. ఇక్కడి జింఖానా క్లబ్‌కు వచ్చిన సభ్యులు శాంగ్రీల ప్లాజాలో కార్లను పార్క్ చేశారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రేంజ్‌రోవర్ కారుతోపాటు మరో మూడు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. టైర్లకు మంటలు వ్యాపించి పేలడంతో పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో రోడ్డుమీద వెళుతున్న వాహనదారులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.