DailyDose

కేసీఆర్ కు మాజీ ప్రధాని ఫోన్ – TNI తాజా వార్తలు 15/02/2022

కేసీఆర్ కు మాజీ ప్రధాని ఫోన్ –  TNI తాజా వార్తలు 15/02/2022

*కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు సర్వత్రా మద్ధతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ… సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. ఈమేరకు కేసీఆర్కు దేవెగౌడ ఫోన్ చేశారు.’రావు సాబ్… మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యుద్ధాన్ని కొనసాగించండి. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది.’ అని సీఎం కేసీఆర్కు దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవెగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు.మమతా బెనర్జీ ఫోన్భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి గురించి గట్టిగా ప్రతిపాదిస్తున్న పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ… కేసీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మమత సోమవారం స్వయంగా వెల్లడించారు. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిన్నానికి గురి కాకుండా తామంతా కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

* కాంగ్రెస్‌కు కేంద్ర మాజీ మంత్రి అశ్వనికుమార్ రాజీనామా
కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీలో తనకు లభించిన గౌరవానికి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమర్ పేర్కొన్నారు.

* సీఎం కేసీఆర్పై ఫిర్యాదు… కేసు నమోదు యోచనలో పోలీసులు!
సీఎం కేసీఆర్పై పోలీసులకు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో సర్జికల్ స్ట్రైక్‌కు ఫ్రూప్ కావాలని సీఎం డిమాండ్ చేశారు. దీనిపై అసోం పలువురు భాజపా నేతలు కేసీఆర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.

* మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఏపీఎస్పీఈ జేఏసీ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. కృష్ణపట్నం ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుఇతర సమస్యలపై స్పందించాలని మంత్రిని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా… రేపు సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశంలో అన్ని అంశాలు చర్చిస్తామని మంత్రి బాలినేని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం జేఏసీ నేత చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ… విద్యుత్ రంగంలో ఉన్న సమస్యలను వివరించామన్నారు. ఈ రోజుకి జెన్కో ఉద్యోగులకు జీతాలు వేయకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. ఈరోజు వారికి జీతాలు వేస్తున్నామని ప్రకటించారని తెలిపారు. కృష్ణపట్నంలో ఉన్న విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయవద్దనిపే రివిజిన్ విషయంలో తమ అభ్యతరాలను మంత్రికి వివరించినట్లు చెప్పారు. రేపు సమావేశం తరువాత కార్యాచరణ ప్రకటిస్తామని చంద్రశేఖర్ తెలిపారు.

* డీఎంకే నేతృత్వంలోని లౌకికవాద కూటమి అభ్యర్థు లకు మద్దతుగా ట్రిప్లికేన్‌ తెలుగు సంక్షేమ సంఘం విస్తృత ప్రచారం చేపట్టింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, ట్రిప్లికేన్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతి నిధ్యం వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్‌ పిలుపుమేరకు, ఈ సంఘం అధ్యక్షుడు .దశరథరావు, మహేష్‌, రమణారెడ్డి, పెంచలస్వామి, కోటేశ్వరరావు, యు.నాగయ్య, ఎం.శ్రీనివాసులు సహా బియ్యం వ్యాపారులు 116వ వార్డు డీఎంకే అభ్యర్థి ఏఆర్‌పీఎం కామరాజ్‌, 120వ వార్డు అభ్యర్థి ఆర్‌.మంగై తదితరులకు మద్దతుగా తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

* నిజాంపట్నం హార్బర్ కు సుమారు 4కిలోమీటర్లు సముద్రంలో ఇరుక్కుపోయిన శ్రీలంక బోటుశ్రీలంకకు చెందిన బోటును ఒడ్డుకు తెచ్చేందుకు యత్నిస్తున్న మెరైన్ పోలీసులుబోటులో చేపల వేటకు ఉపయోగించే వలలు లభ్యంనిన్న చేసిన ప్రయత్నాలు ఫలించక పోవటంతో పెద్ద బోట్లతో సముద్రంలోకి వెళ్ళిన మెరైన్, కోస్ట్ గార్డ్ పోలీసులు.

* వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది నేతల్లో ఆందోళన మొదలైంది. న్యాయవాదులను సీబీఐ అరెస్టు చేయడంతో వైసీపీ సోషల్ మీడియాలోని కొందరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో ఇద్దరు న్యాయవాదులుఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అనేకమంది తాము పెట్టిన పోస్టులను తొలగించడమే కాకుండా.. సాంకేతికంగా తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

* ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28 అర్ధరాత్రి నుంచి నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం జీవో నెంబరు 94 విడుదల చేసింది. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ కారణంగా నైట్‌ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మాస్క్‌లు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. మాస్క్‌ ధరించని వారికి రూ. 10 వేల నుంచి 20 వేల వరకూ పెనాల్టీ విధించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు అమలయ్యే విధంగా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే

* చెన్నైనగరానికి చెందిన నాలుగేళ్ల బాలుడు టీవీ చూస్తూ రిమోట్‌ బ్యాటరీని మింగేశాడు. అది కాస్త కడుపులో చిక్కుకోవడంతో పరిస్థితి విషమించింది. అయితే స్థానిక క్రోంపేటలోని రేలా ఆస్పత్రి వైద్యులు దానిని ఎండోస్కోపీ ద్వారా తొలగించి ఆ బాలుడిని రక్షించారు. ఆసుపత్రి సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.రవి నేతృత్వంలోని బృందం ఆ పసిబిడ్డను కాపాడారు. బాలుడి కడుపులో చిక్కుకుపోయిన 14 గంటల్లోనే బ్యాటరీని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. దీనిపై బాలుడి తండ్రి మాట్లాడుతూ.. మలవిసర్జన ద్వారా ఆ బ్యాటరీ బయటకు వచ్చే అవకాశముందని 12 గంటల పాటు వైద్యులు వేచి చూశారని, అయితే అది బయటకు రాకపోవడంతో పాటు పరిస్థితి విషమం గా మారుతుండడంతో ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని బయటకు తీశారని వివరిస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.

*విశాఖపట్నంనగరంలోని సీతమ్మధార జంక్షన్ అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్ద సీపీఐ నిరసనకు దిగింది. జీవీఎంసీ చెత్త పన్నులుఆస్తి పన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు మాట్లాడుతూ జగన్ సర్కార్ ప్రజల ప్రభుత్వం కాదన్నారు. పన్నుల భారం వేయడం వేయడం అంటే.. ప్రజల వెన్నుపోటు పొడవడమే అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణవ్యతిరేకిస్తూ జీవీఎంసీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన విజయ సాయి రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పన్నుల భారంస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయ సాయి రెడ్డి ఇప్పుడు స్పందించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

*సర్వీస్ రికార్డులో విద్యార్హతను ట్యాంపర్ చేశారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణను మూసివేసింది. విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. రిమాండ్ కోసం హాజరుపరిచినప్పుడు దిగువకోర్టు బెయిల్ మంజూరు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ బెయిల్ పిటిషన్పై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించారు

* ఈ నెల 25 నుంచి ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఎగ్జిబిషన్‌ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌ను కరోనా కారణాలతో 2 నుంచి నిలిపివేయడం తెలిసిందే.కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇచ్చింది. దాదాపు 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్లతో పాటు పలు రాష్ట్రాల స్టాళ్లను కూడా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

*81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఈనెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం ప్రకటించారు. ఏటా జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ ఫిబ్రవరి రెండో వారంలో ముగుస్తుంది. ఈ ఏడాది కూడా జనవరి 1న గవర్నర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అయితే ఒమైక్రాన్ తీవ్రతతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజుల్లోనే ఎగ్జిబిషన్ను మూసేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో ఎగ్జిబిషన్ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన సొసైటీ పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 25 నుంచి ఎగ్జిబిషన్ను తిరిగి ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. వారాంతపు రోజుల్లో రాత్రి 11గంటల వరకు కొనసాగుతుందని సెక్రటరీ ప్రకటించారు.

*హిజాబ్ వివాదం కొనసాగుతున్న వేళ.. కర్ణాటకలో (Karnataka) పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వివాదం ప్రారంభమయింది. క్రమంగా ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వ్యాపించింది. దీంతో రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు మూసేస్తున్నట్టు ప్రభుత్వం గత మంగళవారం ప్రకటించింది.

*దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 49 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 34 వేలకు దిగివచ్చాయి. నిన్నటికంటే ఇవి 24 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గింది.

*రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 20 నుంచి రెండ్రోజుల పాటు విశాఖలో ఆయన పర్యటిస్తారు. 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుని ప్రెసిడెన్షియల్ సూట్ (చోళా సూట్)కి వెళ్తారు. అక్కడ రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్యార్డుకు చేరుకుని ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మధ్యాహ్నం పీఎఫ్ఆర్ గ్రూప్ ఫొటో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.45గంటల వరకు రాష్ట్రపతి విందులో పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.

*బొమ్మనహల్ మండలం శ్రీధర గట్ట జడ్పీ హైస్కూల్లో ఓ విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన తాజాగా వెలుగు చూసింది. కోరిక తీర్చాలంటూ విద్యార్థినికి వేధింపులు ఎదురవుతున్నాయి. మొబైల్కు తరచుగా పీఈటీ వాయిస్ మెసేజ్ పంపిస్తున్నాడు. విద్యార్థిని ఇంట్లో లేని సమయంలో ఫోన్ చేశాడు. కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయడంతో పీఈటీ బాగోతం వెలుగులోకి వచ్చింది. విషయం బహిర్గతం కాకుండా విద్యాశాఖ అధికారులు రహస్యంగా విచారణ చేపట్టారు.

*లులు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీకి బహ్రెయిన్లో అరుదైన గౌరవం దక్కింది. యూసుఫ్ అలీకి బహ్రెయిన్ ప్రభుత్వం గోల్డెన్ రెసిడెన్సీ వీసాను అందించింది. దీంతో బహ్రెయిన్లో గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొందిన తొలి వ్యక్తిగా యూసుఫ్ అలీకి గుర్తింపు పొందారు.

*గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పల్లె ప్రజానీకానికి మరిన్ని సేవలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న సర్కారు.. ఇప్పుడు కొత్తగా వాటిల్లో ఏటీఎం సేవలను అందించేందుకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా.. తొలి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.