తెలంగాణ అస్సోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) 5 వ వార్షికోత్సవ సమావేశాన్ని లండన్ లో నిర్వహించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ టాక్ సంస్థను అభినందించడం తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. నిత్యశ్రీ కూర్మాచలం, మల్లారెడ్డి-శుష్మణరెడ్డి దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం టాక్-2022 ఈవెంట్స్ క్యాలెండర్ ని టాక్ కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ నవీన్ రెడ్డి, సత్య చిలుముల, జాహ్నవి, మల్లారెడ్డి,ప్రవీణ్ కుమార్ వీర,సెరు సంజయ్,రవి రెటినేని,సుప్రజ, సత్యపాల్, శ్రీకాంత్ జెల్ల,హరిబాబు,శ్రీ విద్యా,రాజేష్ వర్మ,అవినాష్,నవీన్ కుమార్,రంజిత్,క్రాంతి,శ్రీ శ్రావ్య,శైలజ,వంశీ,పృథ్వీ ,శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
2022 “టాక్”(TAUK) కార్యక్రమాల క్యాలెండర్ ఆవిష్కరణ
Related tags :