Movies

కడలిలో అందాల కెరటం

కడలిలో అందాల కెరటం

కడలిలో పడవలో పూజాహెగ్డే ఒంటి ఊపులు అభిమానులను ఉర్రూతలూగించాయి. తమిళ హీరో విజయ్‌ సరసన ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’. ఇందులోని ‘అరబిక్‌ కుతు’ సాంగ్‌కు పడవలో ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోను మంగళవారం పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కొన్ని గంటల్లోనే ఆ డాన్స్‌ వీడియోసామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పూజా అలవోకగా వేసిన స్టెప్పులు అభిమానులను అలరించాయి. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరపరిచిన ఈ గీతం ఇప్పటిదాకా దక్షిణాదిన విడుదలైన తొలిరోజే అత్యధిక సంఖ్యలో వ్యూస్‌ దక్కించుకున్న పాటగా నిలిచింది. ప్రస్తుతం తన కుటుంబంతో మాల్దీవుల్లో సరదాగా గడుపుతున్నారు పూజాహెగ్డే. ఆమె కథానాయికగా నటించిన ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, ‘బీస్ట్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.