శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏర్పాట్లలో భాగంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఫిబ్రవరి 20న ధ్వజారోహణం(మీనలగ్నం) పెద్దశేష వాహనం
ఫిబ్రవరి 21న చిన్నశేష వాహనం, హంస వాహనం
ఫిబ్రవరి 22న సింహ వాహనం,ముత్యపుపందిరి వాహనం
ఫిబ్రవరి 23న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
ఫిబ్రవరి 24న పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
ఫిబ్రవరి 25న హనుమంత వాహనం, స్వర్ణరథం(తిరుచ్చి), గజ వాహనం
ఫిబ్రవరి26న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
ఫిబ్రవరి 27న రథోత్సవం(సర్వభూపాల వాహనం), అశ్వవాహనం
ఫిబ్రవరి 28న చక్రస్నానం ధ్వజావరోహణం.