DailyDose

సైబర్ నేరగాళ్ల అరెస్టు – TNI నేటి నేర వార్తలు – 16/02/20022

సైబర్ నేరగాళ్ల అరెస్టు – TNI నేటి నేర వార్తలు – 16/02/20022

* ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు చేసిన పోలీసులు….బి మఠం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ జగదీశ్వరి అనే అమ్మాయి వద్ద నుంచి 40 వేల రూపాయలు ఆన్లైన్ పేమెంట్ వేయించుకున్న నకిలీ పోలీసులు….గంటలో నగదు తిరిగి చెల్లిస్తామని నమ్మించి మోసం….ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఆశ్రయించిన జగదీశ్వరి….రంగంలోకి దిగిన కడప జిల్లా సైబర్ పోలీసులు….ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ మోసగాళ్ళు అరెస్ట్….వీరి ఇద్దరు గతంలో పలు సైబర్ కేసుల్లో నిందితులు….సమాచారం వెల్లడించిన జిల్లా ఆడిషనర్ ఎస్పీ దేవా ప్రసాద్….

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ (Barabanki) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆయోధ్య జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం దాటికి కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమయింది

* పి.వి.పాలెం మండలంలో యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం ఖాజీపాలెం నుంచి అల్లూరు వెళ్ళేందుకు ఆటో ఎక్కిన విద్యార్థిని
మిగిలిన ప్రయాణీకులు దిగిపోవడంతో ఆటోలో ఒంటరిగా ఉన్న విద్యార్థిని తో అసభ్యంగా ప్రవర్తించిన ఆటోడ్రైవర్ వేరే దారిలో ఆటోని తీసుకెళ్తుండగా కిందికి దూకేసి తప్పించుకున్న యువతి పరారయిన ఆటోడ్రైవర్ ల్ప గాయాలతో బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన యువతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* మదురై జిల్లా ఉసిలంపట్టిలో ఓ ఇంట్లో అనుమతి లేకుండా బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించి ఇంటి యజమాని దుర్మరణం చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

* గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. సిహోర్ పట్టణానికి సమీపంలోని అరిహంత్ ఫర్నేస్ రోలింగ్ మిల్లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది.

*విజయవాడలో అర్ధరాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎంపీ నందిగామ సురేష్ అతని అనుచరులతో హల్ చల్. బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ లో వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులని ఆపిన కృష్ణలంక ఎస్ ఐ.వకులు తాము ఎంపీ నందిగామ సురేష్ అనుచరుల అంటూ హంగామా..యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించిన ఎస్ ఐ సిబ్బంది….విషయం తెలుసుకుని అనుచరులతో అర్ధరాత్రి స్టేషన్ కు వచ్చిన ఎమ్ పీ నందిగామ సురేష్..ఎస్ ఐ సిబ్బంది తో వాగ్వాదం, పోలీసులతో బాహాబాహికి దిగిన అనుచరులు..జరుగుతున్న తతంగాన్ని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ని కొట్టి ఫోన్ లాక్కుని ఫర్నిచర్ ని ధ్వంసం చేసిన నందిగం సురేష్ అనుచరులువాళ్లు వెళ్ళిపోతుండగా గేటు దగ్గరికి వెళ్లి మరోసారి ఫోన్ ఇమ్మని అడిగితే మరోసారి కింద పడేసి కొట్టిన సురేష్ అనుచరులు బైక్ పై రాష్ డ్రైవింగ్ వెళ్తున్న వారిలో ఎంపీ సమీప బంధువు..విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న పోలీస్ అధికారులు.

*గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం డొంక వద్ద పి.కిల్లయ్య(39) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కిల్లయ్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు చిలకలూరిపేట డైకెమెన్ కాలనీ వాసిగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*తూర్పు గోదావరి సీతానగరం మండలంలోని రాపాక పంచాయతీ శ్రీరామనగరం గ్రామానికి చెందిన ఏపుగంటి యామిని 9వ తరగతి చదువుతోంది. ఇంటర్‌ చదువుతున్న ఆమె అన్న య్య దుర్గాప్రసాద్‌ సెల్‌ఫోన్‌లో సినిమా చూస్తుండగా తాను కూడా చూస్తానని అడిగింది. దీంతో ఇద్దరి మధ్య స్వల్వ వాగ్వాదం జరిగింది. తండ్రి మరో సెల్‌ఫోన్‌ కొని ఇస్తానని చెప్పి పొలం వెళ్లిపోయాడు. అనంతరం యామిని ఇంటి వద్ద ఉన్న పురుగుల తాగగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శుభశేఖర్‌ తెలిపారు

*రైలు ప్రయా ణికురాలు బ్యాగులో ఉన్న 19 తులాల బంగారం చోరీ అయింది. కాచిగూడ రైల్వే పీఎస్‌ సీఐ శ్రీనివా్‌సరావు వివరాల ప్రకారం.. ఉప్పల్‌లో నివాసముంటున్న ఎస్‌.సత్యప్రభ శుభకార్యానికి ఈ నెల 7న చెన్నైకు చంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్లి తిరిగి నగరానికి చేరింది. మార్గమధ్యలో ఆమె బ్యాగులో ఉన్న బంగారు నగలు తస్కరించారు. ఇంటికి వెళ్లి పరిశీలిస్తే బ్యాగులో నగలు లేకపోవడంతో మంగళవారం రాత్రి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు ఎగ్మోర్‌ రైల్వే పీఎ్‌సకు బదిలీ చేశారు.

*తనను విధుల నుంచి తొలగిస్తారన్న అనుమానంతో నూతనం గా బాధ్యతలు చేపట్టిన అంగన్‌వాడీ హెల్పర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పెదపూడి మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ఈనెల 4న పెద్దాడకు చెందిన పి.ఝాన్సీ అంగన్‌వాడీ హెల్పర్‌గా విధుల్లో చేరింది. ఆనాటి నుంచి ఆమె విధులు నిర్వహించకూడదని, విధుల నుంచి తప్పుకోవాలని రాజకీయంగా ఒత్తిడి వచ్చినట్టు సమాచారం. ఈ విషయమై కొందరు స్థానిక పెద్దలు ఈనెల 10న ఆమెతో తెల్లకాగితంపై సంతకం పెట్టించుకున్నట్టు తెలిసింది. విషయం తెలిసిన బాధితురాలి భర్త పెద్దలను అడగడంతో తనకు, తన భర్తకు హాని తలపెడతారన్న భయంతో ఈనెల 11వ తేదీ రాత్రి ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. ప్రస్తుతం ఝాన్సీ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.

*బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై దారాసింగ్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరు జిల్లాలో మట్కా రూపుమాపే దిశలో భాగంగా బజార్‌హత్నూర్‌ మండలంలో కొన్నిరోజులుగా జనార్దన్‌, నిలేష్‌, శ్రీరాంపాల్‌ మండలంలోని పలువురిని మట్కాకు బానిసలు చేస్తూ డబ్బులు ఆశచూపి మట్కాలో డబ్బులు పెట్టి ఇస్తున్నట్లు గ్రహించిన ఇంటలిజెన్స్‌ బృందం పోలీసులు మట్కా ఆడుతున్న సమయంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సూచించారు. వీరి వద్ద నుంచి రూ.4060 నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలలో పోలీసులు అమృత్‌రెడ్డి, స్వామి, సిబ్బది ఉన్నారు.

*హిజాబ్ వివాదం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పాకింది.బురఖా, హిజాబ్ ధరించిన ఇద్దరు బాలికలు దతియా పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలోకి ప్రవేశించడాన్ని చూసిన కొందరు వ్యక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో కనిపించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా పునరుద్ఘాటించారు.బురఖా, హిజాబ్ ధరించిన ఇద్దరు బాలికలు దతియాలోని ప్రభుత్వ పోస్ట్-గ్రాడ్యుయేట్ కళాశాల క్యాంపస్‌లోకి ప్రవేశించడాన్ని చూసిన కొంతమంది యువకులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం వైరల్ వీడియో క్లిప్‌లో కనిపించింది.

*మహారాష్ట్రలోని (Maharashtra) వషీమ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జిల్లాలోని సెలుబజార్‌ సమీపంలో ట్రాక్టర్‌ను వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

* జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన బచ్చన్‌సింగ్, పూర్ణంకౌర్‌ దంపతులకు ఐదుగురు పిల్లలు వీరిలో నలుగురు కుమార్తెలు కాగా ఒక్క కుమారుడు. వీరి పెద్దకుమార్తె(17) ఆరో తరగతి వరకు చదువుకుంది. అనంతరం చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్‌సింగ్‌ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేవారు. ఇటీవలే సుభాష్‌నగర్‌కు వచ్చా రు. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒక్కతే ఇంటి నుంచి బయటకు వెళ్లింది.