Politics

మహారాష్ట్రకు కేసీఆర్ – TNI రాజకీయ వార్తలు – 16/02/2022

మహారాష్ట్రకు కేసీఆర్ – TNI రాజకీయ వార్తలు –  16/02/2022

* అయిదేళ్లు అవ‌కాశం ఇవ్వండి: మోదీ
పంజాబ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇవాళ ప‌ఠాన్‌కోట్‌లో ప్ర‌ధాని మోదీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. పంజాబ్‌కు సేవ చేసేందుకు అయిదేళ్లు అవ‌కాశం ఇవ్వాలంటూ ఆయ‌న కోరారు. రాష్ట్రంలో రైతాంగాన్ని, వాణిజ్యాన్ని, ప‌రిశ్ర‌మ‌ల‌ను లాభ‌సాటిగా మార్చ‌నున్న‌ట్లు మోదీ తెలిపారు. పేద‌ల సంక్షేమ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ స‌భ‌లో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా మోదీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్‌కు జిరాక్స్ కాపీ ఆమ్ ఆద్మీ అని ఆయ‌న విమ‌ర్శించారు. విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ సిక్కుల మ‌నోభావాల‌ను ప‌ట్టించుకోలేద‌ని, పాక్‌లో ఉన్న గురు నాన‌క్ నిర్యాణ స్‌మలం కర్తార్‌పూర్ సాహిబ్‌ను ఇండియా భూభాగంలోకి వ‌చ్చేలా కాంగ్రెస్ చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయింద‌ని మోదీ ఆరోపించారు. స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌పై ఆధారాలు అడిగిన కాంగ్రెస్ పార్టీపై కూడా మోదీ ఫైర్ అయ్యారు. ఆ పార్టీ పాపాల లీల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు

* పంజాబ్‌లో డ్రగ్స్ వ్యాప్తికి కారణం కాంగ్రెసే : మోదీ
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ కూటమి తరపున ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేరాల్లో భాగస్వాములని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు WWFలో మాదిరిగా పరస్పరం పోటీ పడుతున్నట్లు నటిస్తున్నాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కేవలం కాంగ్రెస్‌కు జెరాక్స్ కాపీయేనని చెప్పారు.

* ఈ నెల 20న మహారాష్ట్రకు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం సీఎం కేసీఆర్ ముంబయికి బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసి.. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే పూర్ణ మద్దతు తెలిపారు.కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారని థాకరే కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. రాష్ట్రాల హక్కుల కోసం దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగాలని.. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుందని చెప్పారు. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం అని సీఎం కేసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు.

* వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు : వివేక్
ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ప్రజలను మర్చిపోయారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ శవయాత్రలకు కేసీఆర్ ఫ్రస్టేషనే కారణమన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ, మోటార్లకు మీటర్లపై కేసీఆర్ అవాస్తవాలను ఖండిస్తున్నానన్నారు. ఇంకా వివేక్ మాట్లాడుతూ.. ‘‘నిజాం ఘగర్ ప్యాక్టరీని రీఓపెన్ చేస్తానని కేసీఆర్ మాట తప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నాడు. కేసీఆర్ తీరుతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతో రాష్ట్రం అప్పుల పాలైంది. అవినీతికేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారుఅని పేర్కొన్నారు.

* ప్రచారంలో దూకుడు పెంచిన కాంగ్రెస్
పంజాబ్లో కాంగ్రెస్ ప్రచారాన్ని దూకుడు పెంచింది. రాబోయే మూడు రోజులపాటు అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారంతో హోరెత్తించే విధంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. రేపు సీర్ గోవర్ధన్ పూర్ లో సంత్ రావిదాస్ జయంతికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ పంజాబ్ లో ప్రచారం చేయనున్నారు. పంజాబ్ లో రెండోసారి కాంగ్రెస్ గెలుపు కోసం కోసం రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని..అందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంటింటి ప్రచారం, రోడ్ షోల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో దూకుడు పెంచుతూ ప్రచారం చేయడం ఇదే తొలిసారి.
మరిన్ని వార్తల

* వివేకా హత్య కేసుపై జగన్ ఎందుకు మాట్లాడడంలేదు? : బోండా ఉమ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో వైసీపీ నేతల ప్రమేయం సాక్ష్యాలతో బయట పడినా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు మాట్లాడడంలేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అడ్డంగా దొరికినా.. తెలుకుట్టిన దొంగల్లా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని విమర్శించారు. అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. వివేకా హత్య కేసు వివరాలను సీబీఐ సగమే మాత్రమే వెలికితీసిందన్నారు. కరుడుగట్టిన నేరగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని బోండా ఉమ అన్నారు.

* సీఎం జగన్‌కు నక్కా ఆనందబాబు లేఖ
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని, దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని తెలిపారు. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్‌తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందన్నారు. రాష్ట్రంలో రూ. 9,251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కాల్చివేశామని పోలీసులు చెబుతున్నారన్నారు. కేవలం దొరికిన గంజాయి ఇన్ని లక్షల్లో ఉంటే ఇక దొరకని గంజాయి ఎన్ని లక్షల కిలోల్లో ఉంటుందని ప్రశ్నించారు. గతంలో విశాఖ మన్యంలో కేవలం వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు వైసీపీ పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించిందన్నారు. వైసీపీ నేతలు అక్రమ సంపాద కోసం మన్యంలో గంజాయిని వాణిజ్య పంటగా మార్చుకుని ‎అమాయకులైన గిరిజనుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.

* డిప్రేషన్‌తోనే కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు, అనుచిత వ్యాఖ్యలు: Bandi sanjay
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. డిప్రేషన్‌తోనే కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బుధవారం ఢిల్లీ వేదికగా బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన జరుగుతోందని విమర్శించారు.కేసీఆర్‌ సీఎం అయ్యాక 145 రోజులు ఫామ్‌హౌస్‌లో పండుకున్నారన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. అధికారం మాత్రం ఒకే కుటుంబం చేతుల్లో చిక్కుకుందని విమర్శించారు. ఆత్మబలిదానం చేసుకున్నవారి కుటుంబాలు ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదన్నారు. మీటర్లు పెట్టాలని కేంద్రం ఇప్పటి వరకు ఆదేశించలేదని… కావాలనే బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

*Telangana వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్టులు
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారు. అస్సాం సీఎంపైన కేసులు నమోదు చేయాలని పీసీసీ పిలుపు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీస్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు పోలీసు కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాల నేపథ్యంలో ముఖ్య నాయకులను, డీసీసీ అధ్యక్షులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ వద్ద టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు.

*ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పేటెంట్‌: తులసిరెడ్డి
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని, ఇది కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ రాష్ట్రానికి మోసం చేసిందన్నారు. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని.. వచ్చే ఎన్నికల్లోనైనా కాంగ్రె్‌సను గెలిపించాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు.

*పేదల కన్నీళ్లు తుడిచిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌: అచ్చెన్న
మానవసేవే మాధవ సేవ.. అన్న సిద్ధాంతంతో కష్టనష్టాల్లో ప్రజలకు తోడుగా నిలుస్తూ, పేదల కన్నీళ్లు తుడుస్తూ, బాధితులకు భరోసానిస్తూ, 25ఏళ్ల ప్రస్థానం సాగించిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవలు అనిర్వచనీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇంకా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ట్రస్ట్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

*అది ‘స్పెషల్‌ బ్రాండ్‌’ స్పెషల్‌ స్టేటస్‌: లోకేష్‌ ఎద్దేవా
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లు, స్పెషల్‌ ఫ్లైట్‌లో దాన్ని రాష్ర్టానికి తీసుకొచ్చినట్లు జగన్‌ కలకంటున్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘తాడేపల్లి కొంప నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీ వెళ్లినట్లు.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను అదే ఫ్లైట్‌లో పట్టుకొచ్చినట్లు, వైసీపీ నేతలు ఈలలు, కేకల్తో సంబరాల్లో మునిగినట్లు స్పెషల్‌ కల వచ్చింది. ఇంతలోనే తెల్లారింది. అప్పుడు అర్థమైంది.. అదంతా వారు ప్రత్యేకంగా తయారుచేయించిన స్పెషల్‌ స్టేటస్‌ లిక్కర్‌ బ్రాండ్‌ ఎఫెక్ట్‌ అని’ అని ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు.

*పేదల కన్నీళ్లు తుడిచిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌: అచ్చెన్న
మానవసేవే మాధవ సేవ.. అన్న సిద్ధాంతంతో కష్టనష్టాల్లో ప్రజలకు తోడుగా నిలుస్తూ, పేదల కన్నీళ్లు తుడుస్తూ, బాధితులకు భరోసానిస్తూ, 25ఏళ్ల ప్రస్థానం సాగించిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవలు అనిర్వచనీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇంకా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ట్రస్ట్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

*జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: నాదెండ్ల
సీఎం జగన్‌ తన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. తణుకులో మంగళవారం ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక వ్యవస్థ పతనమైందని, రాష్ట్ర భవిష్యత్‌పై ఏ మాత్రం ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన సమయంలో రూ.92 వేల కోట్ల లోటుంటే, ఇప్పుడు రూ.ఆరు లక్షల కోట్లకు పైచిలుకు అప్పులు చేశారన్నారు. పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఇప్పుడు ఎందుకు రావడం లేదన్నారు. కాగా, నిడదోలు, తణుకు నియోజకవర్గాల్లో ఇద్దరు జనసైనికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు జనసేన తరఫున రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించామని చెప్పారు. అలాగే, మత్స్యకారుల సమస్యలపై సోమవారం సాయంత్రం ఐదు గంటలకు టోల్‌ ఫ్రీ నంబరు అందుబాటులోకి వస్తే 500 మంది ఫిర్యాదులు నమోదు చేసుకున్నారని తెలిపారు.

*టీడీపీ హయాంలోనే బంజారాల అభివృద్ధి
టీడీపీ హయాంలోనే బంజారాల అభివృద్ధి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో సేవాలాల్‌ మహారాజ్‌కు చంద్రబాబు నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బంజారాలకు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చేసిన సేవల్ని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో కరెంటు ఉండటం లేదని, ఏదో మేలు చేస్తాడని జగన్‌ను నమ్మి ఓట్లేస్తే, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.