* మొండి రుణ ఖాతాను (ఎన్‌పీఏ) స్టాండర్డ్ ఖాతాగా మార్చే విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాల అమలు గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబర్‌లో ఈ మార్గదర్శకాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ప్రకటించడం గమనార్హం.వీటి అమలుకు 2021 డిసెబంబర్ 31 వరకు ఇచ్చిన గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీలు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్గదర్శకాల కింద బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎన్‌పీఏగా గుర్తించిన ఏదైనా ఖాతాను తిరిగి స్టాండర్డ్ ఖాతాగా (సకాలంలో చెల్లింపులు చేసే) మార్చొచ్చు. సదరు ఎన్‌పీఏ ఖాతాదారు పూర్తి రుణం, వడ్డీ చెల్లింపులు చేసినట్టయితేనే ఇలా చేయడానికి అనుమతించింది.
* ‘అంతా బోగస్ లెక్కలు..! మమ్మల్ని నట్టేంటా ముంచేసింది..’ యాపిల్‌కు గట్టి షాకిస్తూ కోర్టుకు
ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంపెనీ యాపిల్‌కు గట్టి షాక్ ఇస్తూ కోర్టుకు ఈడ్చింది బ్రిటిష్ లోకల్ ఆథారిటీ. ఐఫోన్ అమ్మకాల క్లెయిమ్స్ విషయంలో షేర్ హోల్డర్స్‌ను తప్పుదారి పట్టించినందుకు యాపిల్‌పై దావా పడింది. నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావాలో…యాపిల్ జనవరి 2019లో లాభాల హెచ్చరికను జారీ చేయడానికి ముందు ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనలను యాపిల్ చేసిందని నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ ఆరోపించింది. ఈ కౌన్సిల్ 3.8 బిలియన్ యూరోల పెన్షన్ ఫండ్‌ను నడిపిస్తోంది. ఇది యాపిల్‌లో షేర్ హోల్డర్ కంపెనీగా ఉంది. 2018లో చైనాలో ఐఫోన్ల డిమాండ్‌పై వాటాదారులను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై నార్ఫోక్ కౌంటీ కౌన్సిల్ యాపిల్ చీఫ్ ఎర్జిక్యూటివ్ టిమ్ కుక్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మ్యాస్తిపై దావా వేసింది. కొన్ని నివేదికల ప్రకారం…యాపిల్ ఐఫోన్ అమ్మకాల ఒత్తిడి చూసే అవకాశం ఉందని కుక్ 2018లో వాటాదారులతో చెప్పారు.
*రామ్‌రాజ్ కాటన్.. తన ఉత్పత్తుల ప్రచారానికి రాకిం గ్ స్టార్ యష్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. యష్ ప్రచారంతో తమ ధోతీ బ్రాండ్ ఽవినియోగదారులకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని రామ్‌రాజ్ కాటన్ తెలిపింది. యషోమార్గ ఫౌండేషన్ ద్వారా ఆయన అందిస్తున్న సేవలు, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం రామ్‌రాజ్‌కి చిహ్నంగా ఉంటాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది కేఆర్ నాగరాజన్ సారథ్యంలోని రామ్‌రాజ్ కాటన్.. ధోతీలు, షర్టులు, నిట్‌వేర్, ఫ్యాబ్రిక్స్, కిడ్స్, ఉమన్స్‌వేర్ విభాగంలో అతిపెద్ద తయారీదారుగా ఉంది. ప్రస్తుతం 50 వేలకు పైగా నేత కుటుంబాలు రామ్‌రాజ్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి.
*కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) కింద తెలంగాణలోని కంపెనీలు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి. ఇది ఎంత లేదన్నా రూ.1,200 కోట్ల వరకు ఉంటుందని హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) జోస్‌కుట్టి వీఈ అన్నారు. సీఎ్‌సఆర్‌పై తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) నిర్వహించిన వెబినార్‌లో ఆయన ఈ విష యం వెల్లడించారు. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ప్రతి కంపెనీ తన నికర లాభంలో రెండు శాతం సీఎ్‌సఆర్ కింద ఖర్చు చేయాలి.
*ఈ నెల 28లోగా పాలసీదారులు తమ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని ఎల్‌ఐసీ కోరింది. వచ్చే నెలాఖరులోగా మార్కెట్‌కు వచ్చే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూలో 10 శాతం షేర్లను పాలసీదారుల కోసం రిజర్వు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 28లోగా పాన్ వివరాలు అప్‌డేట్ చేసిన పాలసీదారులు మాత్రమే ఇందుకు అర్హులు. వీరికి ఐపీఓ షేర్ల కేటాయింపు ధరలోనూ కొంత డిస్కౌంట్ ఇస్తారు. అర్హులైన పాలసీదారులు అందరికీ ‘దామాషా’ పద్దతిలో ఐపీఓ షేర్లు కేటాయిస్తారు.
*ఇజ్రాయెలీ కంపెనీ టవర్ సెమీకండక్టర్‌ను $ 5.4 బిలియన్లకు ఇంటెల్ కంపెనీకి అందించేందుకు అంగీకరించింది. పెరుగుతున్న డిమాండ్ మధ్య దాని తయారీ సామర్థ్యం మరియు సాంకేతిక పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని భావిస్తోంది. ఇంటెల్… ఈ రోజు(మంగళవారం) విడుదల చేసిన ఓ ప్రకటన మేరకు… టవర్ కోసం ఒక్కో షేరుకు $ 53 ను నగదు రూపంలో చెల్లించనుంది. ఇంటెల్ $ 5.4 బిలియన్ల డీల్‌లో టవర్ సెమీకండక్టర్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించింది
* క్రిప్టో కరెన్సీల నిషేధమే సరైన చర్య అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ అన్నారు. సోమవారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సమావేశంలో ప్రధానోపన్యాసం ఇస్తూ క్రిప్టోలు పోంజీ స్కీమ్‌ల కన్నా దారుణమైనవని, దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ముప్పు అని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను ఆర్‌బీఐ వ్యతిరేకిస్తున్నప్పటికీ సెంట్రల్ బ్యాంకు స్థాయిలో ఒక ఉన్నతాధికారి నిషేధించాలని వ్యాఖ్యానించడం ఇదే ప్రథమం. ఆర్థిక వ్యవస్థలోని నియంత్రణలన్నింటినీ బైపాస్ చేసేందుకే వాటిని రూపొందించారని అన్నారు. అవి కరెన్సీ, ద్రవ్య, బ్యాంకింగ్ వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చుతాయని ఆయన హెచ్చరించారు.. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే క్రిప్టోలను నిషేధించడమే సరైన చర్య అని అన్నారు.
* దివాలా ప్రక్రియలో ఉన్న ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ అప్పుల పరిష్కార ప్రక్రియ ఊపందుకుంది. వచ్చే నెలాఖరుకల్లా రూ.55,000 కోట్ల రుణ ఖాతాల పరిష్కార ప్రక్రియ పూర్తి కానుంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్ బోర్డు ఎన్‌సీఎల్‌ఏటీకి ఈ విషయం తెలిపింది. ఇందులో ఇప్పటికే కొన్ని ఖాతాల పరిష్కారం పూర్తికాగా, ఇంకొన్ని ఖాతాల పరిష్కార ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్టు తెలిపింది.
*చిన విషయం తెలిసిందే. ఈ బైబ్యాక్‌లో పాల్గొనడానికి అర్హులైన షేరు హోల్డర్లను నిర్ణయించేందుకు ఫిబ్రవరి 23ను రికార్డు తేదీగా నిర్ణయించింది. రూ.18,000 కోట్లు మించకుండా 4 కోట్ల వరకు షేర్లను బైబ్యాక్ చేయనుంది. గత ఐదేళ్ల కాలం లో కంపెనీ చేపడుతున్న నాలుగో బైబ్యాక్ ఇది. ఈసారి ఒక్కో షేరును కంపెనీ రూ.4,500కు కొనుగోలు చేయనుంది.