Devotional

హంసలదీవి అందాలు చూసి తీరాల్సిందే!- TNI ఆధ్యాత్మికం – 16/02/2022

హంసలదీవి అందాలు చూసి తీరాల్సిందే!- TNI  ఆధ్యాత్మికం – 16/02/2022

కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి గ్రామంలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి ఆలయం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న యీ ఆలయం కృష్ణా నది సముద్రంలో కలిసే పవిత్ర సంగమ ప్రదేశంలో ఉండటం వలన ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ నీటిలో మునిగిన కాకి హంసగా మారిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. యీ ఆలయంలో మాఘ శుద్ధ నవమి నుండి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి వారికి కళ్యాణోత్సవం కూడా జరుపుతారు. యీ ఉత్సవాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఈ వేణుగోపాలస్వామి ఆలయం సముద్రపు ఆటుపోట్లు తట్టుకునేలా నిర్మించారు. అద్భుతమైన శిల్ప కళా చాతుర్యం ఇక్కడ కనిపిస్తుంది. యీ ఆలయాన్ని దేవతలు నిర్మించారని స్థలపురాణం చెబుతోంది. ఆలయ ముఖమండపం స్తంభాల మీద శాసనాలు నేటికీ కనిపిస్తాయి. యీ ఆలయానికి చాలాకాలం వరకూ గాలిగోపురం ఉండేది కాదు. 1977లో నిర్మించిన గాలి గోపురాన్ని త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు ఉద్ఘాటన చేశారు. వరాలిచ్చే దైవంగా ఇక్కడ భక్తులు శ్రీవేణుగోపాల‌ స్వామిని ఆరాధిస్తారు.. హంసలదీవి కళ్యాణోత్సవం సందర్భంగా.

h3
h4
h1
h2

* 18న మేడారం జాత‌ర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్
ఈ నెల 18న ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మేడారం జాత‌ర‌కు వెళ్ల‌నున్నారు. వ‌న దేవ‌త‌లైన‌ స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మకు కేసీఆర్ బంగారం స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. మేడారం జాత‌ర నేటి నుంచి 19వ తేదీ వ‌ర‌కు నాలుగు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఈ జాత‌ర‌కు దాదాపు కోటి మందికి పైగా భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు మంత్రులు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇక సీఎం కేసీఆర్ 20వ తేదీన ముంబ‌యికి వెళ్ల‌నున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల 21న నారాయ‌ణ‌ఖేడ్‌లో సంగ‌మేశ్వ‌ర బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 23వ తేదీన మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ను కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు.

3. శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ
తిరుపతిలోని అలిపిరి భూదేవి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద తిరుమల శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ ప్రారంభమైంది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లు జారీ చేయనున్నారు. ఈరోజు టోకెన్ తీసుకున్నవారికి 16వ తేదీ నుంచి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ప్రతి గంటకు 1500 మందికి ఉచిత టోకెన్లను టీటీడీ కేటాయిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది నుంచి కూడా శ్రీవారి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

4. నేటి నుంచి ఉదయాస్తమాన సేవా టికెట్లు
తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్ల బుకింగ్‌ బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం టీటీడీ దాతల నుంచి విరాళాలు ఆహ్వానిస్తోంది. ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ నుంచి దాతలు విరాళాలు సమర్పించవచ్చు. పలు కారణాలతో ఇప్పటివరకు ఖాళీలు ఏర్పడిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచారు.

5. అంజనాద్రిపై దేవాలయం వద్దు
తిరుమల అంజనాద్రిపై హనుమంతుడు జన్మించారని పేర్కొంటూ అక్కడ దేవాలయం నిర్మాణం చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. అంజనాద్రిపై సుందరీకరణ పనులు మినహా దేవాలయం, ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని టీటీడీని ఆదేశించింది. సుందరీకరణ పనులకు భూమిపూజ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, టీటీడీ ఈవోకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఆదేశాలిచ్చారు. తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రిపై హనుమంతుడు జన్మించారని పేర్కొంటూ అక్కడ దేవాలయం నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందని, దానిని నిలువరించాలని కోరుతూ కర్నూలుకు చెందిన రాఘవేంద్ర మరో ఇద్దరు పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కొప్పినీడి రాంబాబు వాదనలు వినిపించారు. తిరుమల ఏడుకొండలపై మనుషుల చేతి మీదుగా ఎలాంటి విగ్రహ ప్రతిష్ఠ జరగడానికి వీల్లేదని తిరుమళై ఒరుగు పుస్తకంలో స్పష్టంగా చెప్పారన్నారు. టీటీడీ సొంతగా ఏర్పాటు చేసుకున్న కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 16న కొండపై దేవాలయం నిర్మాణం తలపెట్టారని, ఆ పనులు నిలువరించాలని కోరారు. టీటీడీ తరఫున న్యాయవాది ఎ.సుమంత్‌ వాదనలు వినిపిస్తూ.. అంజనాద్రిపై ఎలాంటి దేవాలయ నిర్మాణం చేపట్టడం లేదని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సుందరీకరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
*తీవ్ర నిస్పృహలో టీటీడీ
తిరుమల గిరుల్లోని అంజనాద్రిలో అభివృద్ధి పనులకు 16న భూమిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో నిర్మాణాలు వద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు రావడం టీటీడీ యంత్రాంగాన్ని, పాలకమండలిని నిస్పృహకు గురిచేసింది. అంజనాద్రిపైనే ఆంజనేయుడు జన్మించాడని, అందువల్ల ఆయన జన్మస్థానం తిరుమలేనని గతేడాది టీటీడీ ఓ ప్రతిపాదన పండితుల ముందు పెట్టింది. దీనిపై పలువురితో కమిటీ వేసి అధ్యయనం చేయించింది. ఆ కమిటీ కూడా అంజనాద్రే హనుమ జన్మస్థలమంటూ ఏకాభిప్రాయం వెల్లడించింది. దీన్ని రాష్ట్ర ప్రభు త్వం, దేవదాయ, పురావస్తుశాఖలకు పంపిన టీటీడీ… ఆపై తిరుమలలో అధికారిక ప్రకటన సైతం జారీ చేసింది. దీనిపై కర్ణాటక రాష్ట్రం హంపీలోని కిష్కింధకు చెందిన గోవిందానంద సరస్వతి తొలినుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు సాహితీ, ఆధ్యాత్మిక రంగాలకు చెందినవారు కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయితే మరింత దూకుడుగా వ్యవహరించిన టీటీడీ హనుమ జన్మస్థలంలో భూమి పూజ చేయడానికి 16న ముహూర్తం నిర్ణయించగా హైకోర్టు ఆదేశంతో టీటీడీ వర్గాల్లో తీవ్ర నైరాశ్యం ఆవరించింది.

6. బంగారు వాకిలికి నూతన శోభ!
తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలికి నూతన శోభ తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. 1884లో మహంతు ధర్మదాసు బంగారు నిలయ విమాన మహాసంప్రోక్షణ సమయంలో ఈ వాకిలికి బంగారు మలాము పనులు చేశారని చెబుతుంటారు. తాపడం చేసి చాలా ఏళ్లు గడవడం, సిబ్బంది, భక్తులు తాకుతుండడంతో వెలిసింది. దీంతో బంగారువాకిలికి పూర్వవైభవం తీసుకురావాలని టీటీడీ తలపోస్తోంది. రూ.3 కోట్లకు పైగా ఖర్చుకానున్న బంగారుతాపడం పనులు చేయించేందుకు చెన్నైకి చెందిన ఓ దాత ముందుకు వచ్చినట్టు సమాచారం.

7. తిరుమలలో తగ్గిన బస్సు ఛార్జీలు
తిరుమలలో సందర్శనీయ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు ఛార్జీలను రూ. 110 నుంచి రూ. 90కు తగ్గించినట్లు తిరుమల డిపో మేనేజర్ పి. విశ్వనాథ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల డిపో భక్తుల సౌకర్యార్థం, టీటీడీ ఈవో ఆదేశాలతో బస్సు ఛార్జీలను తగ్గించిందని వెల్లడించారు.

8. మహా జాతరకు యునెస్కో యశస్సు
సుప్రసిద్ధ కాకతీయ కట్టడం రామప్ప రుద్రేశ్వరాలయానికి ఇటీవల యునెస్కో గుర్తింపు లభించింది. ఇదే కోవలో యునెస్కో Intangible cultural heritage విభాగం క్రింద అద్భుతమైన గిరిజన సాంస్కృతిక వేడుక అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. గిరిజనులు, గిరిజనేతరులు అసంఖ్యాకంగా హాజరయ్యే ఈ మేడారం జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పండగగా ప్రకటించింది. తాడ్వాయి మండలానికి సమ్మక్క సారలమ్మ మండలంగా పునఃనామకరణం చేసింది. ఈ జాతరను జాతీయ పండగగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు ఎంతోకాలంగా కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
*యునెస్కో గుర్తింపు లభిస్తే మేడారం జాతరను అధ్యయనం చేయడానికి, గిరిజన, ఆదివాసీ సంస్కృతిని తెలుసుకోవడానికి వివిధ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ఇప్పటివరకు తొమ్మిది ఉత్సవాలకు Intangible cultural heritage విభాగంలో యునెస్కో గుర్తింపు లభించింది. అవి: కలకత్తా దుర్గా పూజ (2021), కుంభమేళా (2017), నౌరూజ్ (2016), యోగ (2014), రామ్ లీలా (2008), లద్ధాఖ్ బౌద్ధుల బుద్ధపూజ (2012), కేరళ ముడియేట్టు నృత్యం (2010) మొదలైనవి. ఈ తొమ్మిది సాంస్కృతిక ఉత్సవాలతో పోల్చితే యునెస్కో గుర్తింపు దక్కేందుకు మన మేడారం జాతరకు అన్ని అర్హతలున్నాయి. చరిత్రను పరిశీలిస్తే, 800 సంవత్సరాల క్రితం అప్పటి కాకతీయ రాజులపై గిరిజన రాజులు తిరుగుబాటు చేశారు. ఆ నేపథ్యంలో జరిగిన యుద్ధంలో నేలకొరిగిన పడిగిద్ద రాజు, గోవిందరాజులు, జంపన్న సారలమ్మ, సమ్మక్కలను దేవతలుగా మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహించి కొలవడం సంప్రదాయకంగా వస్తోంది. ఈ మేడారం జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు సుప్రసిద్ధ సామాజికవేత్త హైమన్ డార్ఫ్ (1909–95) కూడా కృషిచేశారు. హన్మకొండ వేయిస్తంభాల గుడిలోని శాసనంలోనూ మేడారం ఆదివాసీ దేవతల ప్రస్తావన ఉంది.
*గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను, జానపదుల ఆచార వ్యవహారాలను మేడారం జాతర అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఏ విధమైన సౌఖ్యాలను ఆశించకుండా కేవలం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శన భాగ్యం దక్కితే చాలనే లక్షలాది జానపదుల భక్తిపూర్వక ప్రపత్తులు మరే సాంస్కృతిక ఉత్సవంలోనూ అంతగా కనిపించవు. ఒక విధంగా చెప్పాలంటే, మేడారం వేడుక ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుంచి గుత్తికోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడాలు; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒడిషా నుంచి సవర ఆదివాసీలు ఈ జాతరకు పెద్దయెత్తున తరలివస్తారు.
మతాలు వేరైనా, దేశాలు వేరైనా, పద్ధతులు వేరైనా జాతరలు సహజంగా జరిగే వేడుకలు. అయితే ఏ జాతరకూ లేని ప్రత్యేకతలు, అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో కనిపిస్తాయి. గలగల పారే నదిలో పుణ్యస్నానాలు చేసే కుంభమేళా లాంటి దృశ్యాలు ఇక్కడా కనిపిస్తాయి. గణగణమోగే గంటలు హిందూ దేవాలయాలు, క్రైస్తవ చర్చిలో వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండకోనల మధ్య జనసందోహం శబరిమలను తలపిస్తుంది. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించే మరో తిరుమల ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. దైవత్వం సంతరించుకున్న మానవత పుట్టిన మరో జెరూసలేం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
*కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే మేడారం జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా ఈ గిరిజన వేడుకలో అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు, దేవతలయ్యారు. ఇలా, ఇన్ని ప్రత్యేకతలు, విశిష్టతలు, విశేషాలు ఉన్న మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు లభించవలసిన అవసరముంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై సమగ్ర ప్రతిపాదనలను యునెస్కోకు పంపించాలి.
9. హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోంది: వై.వి.సుబ్బారెడ్డి
అంజనాద్రిలో ఆలయ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం అభినందనీయమని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ హనుమ జన్మస్థలంపై కొందరు వివాదాస్పదం చేస్తున్నారన్నారు. ఆకాశగంగలో ప్రస్తుతం ఉన్న ఆలయం అలాగానే ఉంటుందని స్పష్టం చేశారు. అంజనాదేవి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయమని తెలిపారు. హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోందని… అందుకే ఆకాశగంగ ప్రాంతాన్ని సుందరీకరించాలని నిర్ణయించామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామన్నారు. జమ్మూలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం నిర్మాణం సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పనిసరిగా ఆకాశగంగ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు.

10. సమతామూర్తి సందర్శనకు టికెట్‌.. పెద్దలకు రూ.150.. పిల్లల టికెట్‌ ధర ఎంతంటే?
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్‌ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ క్షేత్రంలో దర్శనానికి రుసుము పెడుతున్నారు.తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 టికెట్‌ ధర పెట్టాలని భావించారు. కానీ అది భక్తులకు భారమవుతుందన్న భావనతో దాన్ని రూ.150కి తగ్గించాలని అనుకున్నారు. అది కూడా ఎక్కువ అవుతుందని కొందరు కమిటీ సభ్యులు పేర్కొనటంతో పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు.రామానుజాచార్యుల స్వర్ణ మూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ ఫ్రేమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు అనుమతించరు. ఈ ప్రాంతంలో సాయుధులైన రక్షణ సిబ్బంది 24 గంటలూ పహారాలో ఉంటారు. ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఈ పనులు పూర్తయ్యేవరకు దర్శనాలను కేవలం సాయంత్రం వేళకే పరిమితం చేయాలని నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు అనుమతిస్తారు. పనులు పూర్తయ్యాక ఉదయం, సాయంత్రం వేళల్లో అనుమతించనున్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల 3డీ లేజర్‌షోను తాత్కాలికంగా ఆపేశారు. ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. లోపలకు ఎంతమంది వచ్చారు, బయటకు తిరిగి ఎందరు వెళ్లారన్న వివరాలు తెలిసే ఏర్పాటు చేస్తున్నారు. ఆ రెండు సంఖ్యలు సరిపోలకుంటే లోపలే అనుమానితులు ఉండిపోయారని భావించి క్షుణ్ణంగా తనిఖీ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణంలోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించకూడదని భావిస్తున్నారు. టికెట్‌ కౌంటర్‌ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్‌ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించాలి. ఫుడ్‌కోర్టు దగ్గర నిష్క్రమణ మార్గం ఉంటుంది. ఎంట్రీ వద్ద అప్పగించిన వస్తువులు కన్వేయర్‌ బెల్టు ద్వారా ఎగ్జిట్‌ వరకు చేరతాయి. అక్కడ వాటిని తీసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. వాహనాలను స్కానర్లతో తనిఖీ చేస్తారు. అనుమానిత వాహనాలను ఆపేందుకు బూమ్‌ బారియర్స్, బొల్లార్డ్స్‌ ఉంటాయి. వాటిని ఛేదించుకుని వెళ్లే ప్రయత్నం చేసే వాహనాల టైర్లను చీల్చే టైర్‌ కిల్లర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రంలో 250 మంది అర్చకులను నియమించనున్నారు. దివ్యదేశాలుగా పేర్కొనే 108 ఆలయాలకు ఇద్దరు చొప్పున, మిగతా ఆలయాల్లో మరికొందరని నియమిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఇతర అవసరాలకు కలిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటారని అంచనా.