Business

రికార్డు గరిష్టానికి విమాన ఇంధనం ధర- TNI వాణిజ్యం

రికార్డు గరిష్టానికి విమాన ఇంధనం ధర-  TNI వాణిజ్యం

* ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ దారిలోనే హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీరేట్ల పెంపు వుంటుందని బ్యాంకు తెలిపింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫిబ్రవరి 14 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఈ వడ్డీరేట్ల పెంపు కేవలం రూ.2 కోట్లలోపున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తించనునాయి. ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.45 శాతానికి చేరింది.

* విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా ఏటీఎఫ్‌ ధరను 5.2 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్‌ సంస్థలు బుధవారం నిర్ణయించాయి. రెండు నెలల్లో ధరల పెంపు (ఈ ఏడాది) ఇది నాలుగో విడత కావడం గమనార్హం. కానీ, పెట్రోల్, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కిలోలీటర్‌ ఏటీఎఫ్‌కు రూ.4,482 మేర పెరిగింది. దీంతో ఒక కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ విక్రయ ధర రూ.90,520కు చేరింది.2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్‌ గరిష్ట ధర రూ.71,028గా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి చూస్తే కిలోలీటర్‌కు 16,497 మేర పెరిగినట్టయింది. గత డిసెంబర్‌లో రెండు విడతల్లో ఏటీఎఫ్‌ ధర తగ్గించడం గమనార్హం. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత తగ్గడం కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటు ధరల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఐటీఎఫ్‌ ధరలను సవరిస్తుంటాయి.

*దిగివచ్చిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవీ..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కూడా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్ లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పడిపోయింది. దీంతో ధర రూ. 50,400కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ. 46,200కు దిగొచ్చింది. ఇక, వెండి ధర రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,800కు చేరింది.

*మార్చి 10న ఎల్‌ఐసీ ఐపీఓ?
మార్కెట్‌ వర్గాల అంచనాల ప్రకారం.. ఎల్‌ఐసీ ఐపీఓ వచ్చేనెల 10న ప్రారంభమై 14న ముగిసే అవకాశం ఉంది. ఇష్యూ ద్వారా రూ.65,400 కోట్లకు వరకు సమీకరించవచ్చని, ఇష్యూలో విక్రయించనున్న షేర్ల ధర శ్రేణిని రూ.2,000-2,100గా నిర్ణయించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇన్వెస్టర్ల రోడ్‌షో తర్వాతనే కంపెనీ మార్కెట్‌ విలువను నిర్ధారించనున్నట్లు తెలిపింది. మార్చిలోనే ఈ ఇష్యూ పూర్తి చేయడంతోపాటు కంపెనీ షేర్లను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఎల్‌ఐసీలో ప్రభుత్వానిదే 100 శాతం వాటా. ఐపీఓలో 5 శాతం వాటాను విక్రయించనున్నట్లు, కంపెనీ ఎంబెడెడ్‌ విలువను (కంపెనీ ఆస్తుల నికర విలువ+ భవిష్యత్‌ లాభాల ప్రస్తుత విలువ) రూ.5.4 లక్షల కోట్లుగా నిర్ధారించినట్లు డీఆర్‌హెచ్‌పీలో ప్రభుత్వం పేర్కొంది. బీమా కంపెనీల మార్కెట్‌ విలువను అంచనాకు వేసేందుకు ఎంబెడెడ్‌ విలువే ఆధారం. బీమా రంగం లో కంపెనీ ఎంబెడెడ్‌ విలువకు 3 రెట్ల మార్కెట్‌ విలువ ప్రామాణికం. ఈ లెక్కన, ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చని మార్కెట్‌ వర్గాల భావిస్తున్నాయి. కంపెనీ ఐపీఓకు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లైన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయని సమాచారం. సెబీ ఆమోదంతో ఐపీఓ ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది.

*వేదాంత్‌ ఫ్యాషన్స్‌ కంపెనీ షేర్లు బుధవారం మంచి లాభాలతో లిస్టయ్యాయి. రూ.866కి జారీ చేసిన ఈ షేర్లు బీఎ్‌సఈలో దాదాపు తొమ్మిది శాతం లాభంతో రూ.936 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రా డేలో రూ.993కు చేరినా చివరికి 7.95 శాతం లాభంతో రూ.934.85 వద్ద ముగిశాయి. ఎన్‌ఎ్‌సఈలో మాత్రం 8.9 శాతం లాభంతో రూ.943.05 వద్ద ముగిశాయి.

*డాక్టర్‌ రెడ్డీస్‌ ఉత్పత్తులైన కాంబిహేల్‌, డాఫీల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు మాన్‌కైండ్‌ ఫార్మా బుధవారం ప్రకటించింది. వీటిలో కాంబిహేల్‌ తీవ్రమైన ఆస్త్మా కేసుల చికిత్సలో ఉపయోగించే ఔషధం కాగా డాఫీ శిశువుల మాయిశ్చరైజింగ్‌ బార్‌. ఉభయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలో ఈ రెండు ఔషధాల తయా రీ, మార్కెటింగ్‌, పంపిణీ హక్కులు మాన్‌కైండ్‌ ఫార్మా వశం అవుతాయి. మార్చి లోగా బ్రాండ్ల విలీనం, పరివర్తన ప్రక్రి య పూర్తవుతుందని భావిస్తున్నారు.

*ఏబీజీ షిప్‌యార్డుపై ఉచ్చు బిగుస్తోంది. కంపెనీపైనా, దాని మాజీ ప్రమోటర్లపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం క్రిమినల్‌ కేసులు ఫైల్‌ చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టంలో (పీఎంఎల్‌ఏ) వివిధ సెక్షన్ల కింద ఈడీ ఈ కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర ముంచారనే ఆరోపణలపై ఏబీజీ షిప్‌యార్డు, దాని మాజీ ప్రమోటర్లపై సీబీఐ ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.

*వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియా మకాల ద్వారా 55,000కు పైగా ఫ్రెషర్లను నియమిం చుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. నాస్కామ్‌ వార్షిక ఎన్‌టీఎల్‌ఎ్‌ఫ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టెక్నాలజీ రంగంలో ఇంజనీ రింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు అపార అవకాశాలున్నాయన్న పరేఖ్‌.. ఈ ఉద్యోగాల్లో చేరేవారు స్వల్పకాలంలోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు

*మహీంద్రా ఆటోమోటివ్ బుధవారం వాహనం మరియు లీజింగ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫారమ్ క్విక్లిజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది… కస్టమర్‌లు మహీంద్రా వాహనాలను ఇబ్బంది లేని పద్ధతిలో లీజుకు తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ క్రమంలో… ప్లాట్‌ఫాంను ఇప్పుడు మహీంద్రా ఆటో పోర్టల్‌లో మరియు దాని డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటుందని మహీంద్రా ఆటోమోటివ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

*బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ రెండేళ్లకు పైగా కాలపరిమితి ఎ్‌ఫడీలపై చెల్లించే వార్షిక వడ్డీ రేటును 0.10-0.15 శాతం మేర పెంచింది. ఈనెల 15 నుంచి పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో 2 నుంచి 3 ఏళ్ల కాలపరిమితి ఎఫ్‌డీలపై వడ్డీరేటు 5.10 శాతం నుంచి 5.20 శాతానికి పెరిగింది. 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్‌డీరేటు 5.30 శాతం నుంచి 5.45 శాతానికి పెరగగా.. 5 నుంచి 10 కాలపరిమితి ఎఫ్‌డీ రేటు 5.40 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది.

*ఇజ్రాయెలీ కంపెనీ టవర్ సెమీకండక్టర్‌ను $ 5.4 బిలియన్లకు ఇంటెల్ కంపెనీకి అందించేందుకు అంగీకరించింది. పెరుగుతున్న డిమాండ్ మధ్య దాని తయారీ సామర్థ్యం మరియు సాంకేతిక పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని భావిస్తోంది. ఇంటెల్… ఈ రోజు(మంగళవారం) విడుదల చేసిన ఓ ప్రకటన మేరకు… టవర్ కోసం ఒక్కో షేరుకు $ 53 ను నగదు రూపంలో చెల్లించనుంది. ఇంటెల్ $ 5.4 బిలియన్ల డీల్‌లో టవర్ సెమీకండక్టర్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించింది