టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో కలిసి మహేష్ బిగాల హైదరాబాద్‌లో బర్త్‌డే వేడుకలు పండుగలా నిర్వహించారు. ఎన్నారైలతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.ఈ కార్యక్రమములో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు సౌత్ ఆఫ్రికా నుంచి – నాగరాజు గుర్రాల, నరేందర్ రెడ్డి మేడసాని, చైనా – రవీందర్ రెడ్డి, మధుసూదన్ వర్మ , సంపత్ చారి, ఆస్ట్రేలియా – మాధవ్ కటికనేని, యూఎస్ఏ – అమ్రిత్ ముళ్ళపూడి, హౌస్టన్ పోర్చుగల్ – రవి కుమార్ బట్టు, ఫ్రాన్స్ – పద్మ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
* సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రచంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు..మూడు రోజుల పాటు కేసీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.అందులో రెండో రోజు ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలను సిడ్నీ, అడిలైడ్ , మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్ ,గోల్డ్ కోస్ట్ , బెండీగో, బల్లారాట్ నగరాలలో TRS ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు.సభ్యులందరు ఒక్కొక్క మొక్క నాటి హరిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో కెసిఆర్ దీర్గాయుష్యు కై ప్రత్యేక పూజలు, అన్న దాన కార్యక్రమాలు చేసి అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడ్డ నేత కేసీఆర్ అన్నారు. చావు అంచులకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాలలో రాష్ట్రాన్ని నేడు ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.సీఎం కేసీఆర్ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజేష్ రాపోలు , ప్రవీణ్ రెడ్డి, రవి యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, సంతోష్, వినోద్, చైతన్య, జోన, అనూప్ తదితరులు పాల్గొన్నారు.
*కువైట్ లో,,
గల్ఫ్‌దేశమైన కువైట్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నేతలంతా కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా బట్టలు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలోనూ భాగస్వాములు కావాలని కోరారు.
*మలేసియాలో ..
మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు మేరకు టీఆర్‌ఎస్ మలేషియా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మలేషియా శాఖ అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనల మేరకు జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా లైట్‌హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్‌లో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా చిన్నపిల్లల ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ సహాయ నిధికి అందజేశారు. కార్యక్రమంలో మలేషియా శాఖ ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేశ్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవీందర్ రెడ్డి, హరీశ్ గుడిపాటి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
*బహ్రెయిన్ లో..
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు. నాలుగున్న కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్ పుట్టినరోజును ఎన్‌ఆర్‌ఐ టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్‌లో అధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ ఎన్‌ఆర్‌ఐ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రటరీ అన్నారం సుమన్ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణను కోట్లాడి సాధించి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఏడున్నర ఏండ్లుగా నిరుపేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని వెల్లడించారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక ప్రధాని మోదీ విషంచిమ్ముతున్నారని విమర్శించారు. గత ఏడున్నరేండ్లుగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్కపైసా ఇవ్వకున్నా తామే ఇస్తున్నట్లు గోబెల్స్ ప్రసారం చేసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు బహ్రైన్ ఎన్‌ఆర్‌ఐ టీఅర్ఎస్ పక్షాన హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.