* రాష్ట్రంలో చిన్న,చిన్న విద్యుత్ కోతలున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు దాన్ని పెద్దవి చేసి చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసి వెళ్లడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విభజించాయన్నారు. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని ఆయన పేర్కొన్నారు. డీజీపీగా సవాంగ్ రెండున్నరేళ్లు పని చేశారని ఆయన తెలిపారు. సవాంగ్‌కు ఇప్పుడు కూడా మంచి పోస్ట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
* కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ డీసీ కార్యాలయం ఎదుట ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి నిరసన తెలిపారు. డీసీ కాంపౌండులోకి కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చి ఆందోళన చేశారు. హిజాబ్ తో తమను తరగతి గదుల్లోకి అనుమతించాలని కోరుతూ విద్యార్థినులు డిప్యూటీ కమిషనరుకు వినతిపత్రాన్ని సమర్పించారు.తమకు హిజాబ్ తోపాటు చదువు కావాలని కర్ణాటక విద్యార్థినులు కోరారు.కర్ణాటకలోని బెల్గాంలో ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా పురుషులు అల్లాహు-అక్బర్ అని నినాదాలు చేశారు.కర్ణాటకలోని బెల్గాంలో ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా కొందరు వ్యక్తులు అల్లాహు-అక్బర్ అని అరుస్తూ కనిపించారు.దీంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టారు.
* ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ ఇంట్లో ఐటీ సోదాలు
పన్ను ఎగవేత కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్రా రామకృష్ణ నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయిలోని ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెకు చెందిన ముంబయిలోని ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత కేసులో ఐటీ రైడ్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.ఆనంద్‌సుబ్రమణియన్‌ను ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించడం, తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసరుగా, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనా పరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇటీవల వార్తల్లో నిచిచారు చిత్రా రామకృష్ణ.చిత్రా రామకృష్టతో పాటు ఇతరులపై పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్ఎస్ఈ ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, డివిడెండ్లకు సంబంధించిన విషయాలతో పాటు ఆయా సంస్థల త్రైమాసిక ఫలితాల సమాచారం, ఇతర అంతర్గత సమాచారాన్ని ఆమె ఓ యోగితో పంచుకున్నారని పేర్కొన్నారు. దీనితో పాటే ఎక్స్ఛేంజ్ ఉద్యోగుల పనితీరు అంచనాలపై కూడా ఆయనను సంప్రదించారని చెప్పారు.
*గోల్కొండ పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీసుల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. హాఫ్ కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు. బారికేడ్లు పెట్టి పోలీస్ స్టేషన్ మార్గంలో పోలీసులు రాకపోకలను నిషేధించారు. మీడియాకు పోలీస్ స్టేషన్ వద్దకు అనుమతి నిరాకరించారు. అర కిలో మీటర్ దూరంలోనే పోలీసులు మీడియాను అడ్డుకుంటున్నారు. గోల్కొండకు వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
* మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది.
* బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అడవిపంది ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన పీటర్, పంకెన గ్రామానికి చెందిన దుర్గం ముత్తయ్య (45) ద్విచక్రవాహనంపై మహారాష్ట్రకు వెళ్లి మంగళవారం తిరుగు పయనమయ్యారు. పలిమెల మండలంలోని లెంకలగడ్డ గ్రామ సమీపంలోని పుల్సురు ఒర్రె సమీపంలో రాత్రి బైక్‌ను అడవి పంది ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ దుర్గం ముత్తయ్య మరణించాడు. గాయపడ్డ పీటర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు
*మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. మంత్రి సత్యవతి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె హుటాహుటిన పెద్దతండాకు బయలుదేరారు.
*కాంచీపురం, మదురై, నాగపట్టణం, సేలం తదితర జిల్లాల్లో క్యాన్సర్ ప్రత్యేక చికిత్సా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం ప్రకటించారు. స్థానిక ఓమందూర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా రోబొటిక్ చికిత్సా కేంద్రం ఏర్పాటుపనులను మంత్రి సుబ్రహ్మణ్యం, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జె.రాధాకృష్ణన్ బుధవారం పరిశీలించారు.
*బ్రెజిల్ దేశంలో సంభవించిన మెరుపు వరదల్లో 78 మంది దుర్మరణం చెందారు.భారీవర్షాల వల్ల బ్రెజిల్ దేశంలోని పెట్రోపోలిస్ నగరంలోని వీధులు నదులుగా మారాయి. వరదనీటి ధాటికి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.
*రాయలసీ యూనివర్సిటీలో పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 17 మంది డీబార్ అయ్యారని పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ కె. విశ్వనాథరెడ్డి తెలిపారు. జిల్లాలోని 75 పరీక్షా కేంద్రాల్లో 3వ సెమిస్టర్ పరీక్షలకు 3,209 మంది దరఖాస్తు చేసుకోగా 2,914, మధ్యాహ్నం 5వ సెమిస్టర్ 6,461 దరఖాస్తు చేసుకోగా 5,771 హాజరయ్యారని తెలిపారు.
*‘కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగూ చేతకాదు. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రి మేకపాటికి సూచించారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గుడివాడలో తహశీల్దార్‌పై వైసీపీ నేత దాడి చేయడాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన పద్మారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
*తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఒప్పందం చేసుకుంది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోదాముల నిర్మాణం, వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో పనిచేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది.
*‘యువతను మత్తుకు బానిస చేస్తున్న సుమారు 2లక్షల కిలోల గంజాయుని పట్టుకుని దగ్గరుండి తగులబెట్టించినందుకు డీజీపీ గౌతం సవాంగ్‌పై అర్ధంతరం గా బదిలీ వేటు వేస్తారా? గంజాయి మాఫియా ఆగడాలకు చెక్ పెట్టడమే సవాంగ్ చేసిన తప్పా? దెబ్బతిన్న మాఫియా ఫిర్యాదుతో సవాంగ్‌పై అవమానకరంగా బదిలీ వేటు వేయడం సీఎం జగన్‌కు తగునా?’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మంచి అధికారి అయిన సవాంగ్‌ను విజయవంతంగా సాగనంపారని విమర్శించారు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సవాంగ్ తనకు రెండు కళ్లులాంటి వారని జగన్ అన్నారని, ఇప్పుడు ఆయన రెండు కళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి, పోలీసు కస్టడీలోనే చిత్రహింసలు పెట్టిన వ్యవహారం పై విచారణను సవాంగ్‌పై సీఎం ఒత్తిడి చేసి నిలువరించి ఉండొచ్చని ఆరోపించారు. తన అరెస్ట్ విషయం సవాంగ్‌కు కూడా ముందుగా తెలియదన్నారు
*సముద్ర మార్గం గుండా చొరబడిన శత్రు మూకలపై మెరైన్ కమెండోలు దాడి చేసి మట్టుబెట్టారు. అనంతరం హెలికాప్టర్లలో వెళ్లిపోయారు. విశాఖ సాగర తీరంలో బుధవారం కనిపించిన యుద్ధ వాతావరణ దృశ్యమిది.
*జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీ ణ ప్రాంతాలలో పైపులైన్లతో ఇళ్లకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడం లో ఏపీ వెనుకబడింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ 100 శాతం లక్ష్యాన్ని సాధించి దేశంలో రెండోస్థానంలో ఉండగా, ఏపీ 51.8 శాతం లక్ష్యాన్ని సాధించి 16వ స్థానంలో నిలిచింది. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యసాధనలో దేశ వ్యాప్తంగా 46.71 శాతం సాధించినట్టు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 95,16,848 ఇళ్లకు పైపులైన్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 49,37,547 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించింది. 100 శాతం లక్ష్యసాధనతో గోవా ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. కాగా, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కూడా రక్షిత మంచి నీటి కనెక్షన్లు ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ర్టాలను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ప్రజలకు, పిల్లలకు పరిశుభ్రమైన రక్షిత నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతోనే జల్‌జీవన్ మిషన్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
*రాష్ట్రంలో కొత్తగా 675 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 24,663 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 675మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 143, పశ్చిమగోదావరిలో 130, చిత్తూరు 68, కృష్ణా 64, విశాఖపట్నంలో 57, గుంటూరు 55 కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా మరో 2,414 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.
*సీఎం జగన్ దగ్గరకు రాజంపేట జిల్లా వివాదం చేరింది. జగన్‌ను జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్, మేడా మల్లికార్జున్ రెడ్డి తదితరులు కలిశారు. జిల్లా కేంద్రం సమస్య పరిష్కారంపై నేతలతో సీఎం చర్చించారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని స్థానికంగా ఆందోళన పెరుగుతోంది. సొంత పార్టీ నుంచే నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి.
*ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూపీలో బీజేపీకి ఓట్లు వేయకపోతే ప్రజలను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ మాట్లాడిన వీడియో ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు బెదిరించే విధంగా ఉన్నాయన్న ఈసీ.. ఎన్నికల కోడ్‌ను, చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను చట్టప్రకారం ఎందుకు చర్యలు చేపట్టరాదో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని పేర్కొంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరొక కమేడియన్ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలో ఎవరైనా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారా? అని ఆలోచించినప్పుడు ఇలాంటి కమేడియన్లు మన ముందుకు వస్తారని ట్వీట్ చేశారు. రాజాసింగ్‌వి మతిలేని వ్యాఖ్యలని కాంగ్రెస్ పిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.
*గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో తెనాలి రోడ్డులో అక్షయపాత్ర వంటశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు