DailyDose

అహ్మదాబాద్ పేలుళ్ళ కేసులో 38 మందికి మరణ శిక్ష

అహ్మదాబాద్  పేలుళ్ళ కేసులో 38 మందికి మరణ శిక్ష

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు శిక్ష ఖరారైంది. 49మంది నిందితుల్లో 38మందికి మరణశిక్ష, 11మందికి జీవిత ఖైదు విధిస్తూ.. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 77మంది నిందితులపై విచారణ జరిపింది. 2008 జులై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం), హర్ఖత్ ఉల్ జిహాదీ ఆల్ ఇస్లామీ తీవ్రవాద సంస్థలే ఈ పేలుళ్లకు కారణమని తేల్చారు.