DailyDose

మేడారం జాతరలో అపశృతి – TNI తాజా వార్తలు

మేడారం జాతరలో అపశృతి – TNI  తాజా వార్తలు

* మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అపశృతి….క్యూలైన్ తొక్కిసలాటలో ఇద్దరు మృతి…పోలీసుల నిర్లక్ష్యం తో నే జరిగిందని భక్తుల ఆగ్రహం క్యూ లైన్ లో భద్రత వైఫాల్యం పై ఉన్నత అధికారుల అరా వి ఐ పి వివీఐపి ఇచ్చిన పి యార్టి సామాన్య భక్తుల క్యూలైన్ లో ఎందుకు ఇవ్వడం లేదని పోలీస్ లపై ఆగ్రహం.

* ఏపీ సచివాలయంలో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేత..
కొవిడ్‌ కారణంగా ఆంక్షల మధ్య కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు పూర్తి స్థాయిలో హాజరయ్యే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వందశాతం ఆక్యుఫెన్సీకి అనుమతినిచ్చిన ప్రభుత్వం ఈరోజు ఏపీ సచివాలయంలో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఉన్నతాధికారులు సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని సూచించారు. ఉన్నతాధికారులు కూడా బయోమెట్రిక్, ఫేస్‌ రికగ్నిషన్‌ పాటించాలని ఆయన ఆదేశించారు.

* గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలను ఖండించిన పెద్ద, చిన్న జీయర్లు
గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలను పెద్ద జీయర్, చిన్న జీయర్ ఖండించారు. కర్ణాటకలోని కిష్కిందే హనుమంతుడి జన్మస్థలమని తాము చెప్పినట్లు.. గోవిందానంద సరస్వతి దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. గోవిందానంద దుష్ప్రచారాలను భక్తులు నమ్మొద్దని సూచించారు. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని పెద్ద, చిన్న జీయర్లు స్పష్టం చేశారు.

*బడ్జెట్ సమావేశాలపై ఏపీ ప్రభుత్వ కసరత్తు
బడ్జెట్ సమావేశాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 8 లేదా 14వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో సమావేశాలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

*ఆత్మకూరు ఘటనలో శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
ఆత్మకూరు ఘటనలో నంద్యాల పార్లమెంట్ బీజేపీ అద్యక్షులు బుడ్డాశ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ పత్రాలను కడప కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌కు బీజేపీ నేతలు అందజేశారు. పత్రాలను పరిశీలించిన అనంతరం శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. కేంద్ర కారాగారం వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు… శ్రీకాంత్ రెడ్డికి స్వాగతం పలికారు. కాగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు

*రాష్ట్రంలో కొవిడ్‌ప్రభావం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,579మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా బెంగళూరులో 769 మంది, మిగిలిన జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. 5,079 మంది కోలుకోగా 23మంది మృతి చెందారు. వీరిలో బెంగళూరులో ఏడుగురు, ఐదు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 19,761 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 8,828మంది ఉన్నారు

*కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్‌లని నిరసిస్తూ.. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం పిలుపునిచ్చింది. మరికాసేపట్లో ప్రగతి భవన్‌ను ఎస్సీ సెల్ నేతలు ముట్టడించనున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్‌కు తరలించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ప్రగతి భవన్‌ను ఎస్సీ సెల్ ముట్టడించింది. ఎస్సీ సెల్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో.. ప్రగతి భవన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు

* నారావారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు యత్నం – సర్వే నెంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు యత్నం – చంద్రబాబు స్థలంలో రాతి కూసాలు నాటుతున్న కబ్జాదారులు – 1989లో 87 సెంట్లు రిజిస్టర్ భూమి కొనుగోలు చేసిన ఖర్జూరనాయుడు – 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమి వితరణగా ఇచ్చిన చంద్రబాబు – చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ వేస్తున్న కబ్జాదారులు

*తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాభై శాతం ఛాయిస్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మే 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.ఎప్పటిలాగా ఈసారి 11 పేపర్లుండవు. కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. అన్ని పేపర్లలో ప్రశ్నాపత్రంలో ఉన్న యాభై శాతం వాటికి మాత్రమే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.

*ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయాన్ని తాడేపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీహెచ్ఈఆర్ఎంసీ మెంబర్ సెక్రటరీ రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు కృషిచేయాలని నిర్దేశించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనుమర్ల గుండారెడ్డి, ప్రధాన కార్యదర్శి జె.రమణాజి, ఆర్థిక కార్యదర్శి జి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.

*జీవీఎల్ నరసింహారావు ప్రత్యేక హోదా వ్యతిరేకి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలకుల వైఖరిని ఎండగడుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

*అమరావతి రాజఽధానిలో ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన భూముల్లో ఆక్రమణలను నిరోధించాలని క్యాపిటల్ సిటీ ఏరియా పరిధిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ ఆదేశాలు జారీచేశారు. కొందరు రైతులు పూలింగ్ ఇచ్చిన భూములలో వేసిన ప్లాట్ల సరిహద్దులను తొలగించి పంటలు వేయటం తమ దృష్టికి వచ్చిందని, వీటిని నిరోధించాలని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

*రాష్ట్రంలో రెండు లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు దుబాయికి చెందిన పరిశ్రమ ముందుకొచ్చింది. దుబాయిలోని తాజ్ బే హోటల్లో గురువారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సమక్షంలో ఎంవోయూ చేసుకున్నారు. రూ.500కోట్ల పెట్టుబడితో రెండు లాజిస్టిక్ పార్కులను నిర్మించేందుకు దుబాయికి చెందిన షరాఫ్ గ్రూప్ ముందుకొచ్చిందని మేకపాటి తెలిపారు. గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, డిస్ప్లే యూనిట్లకు పెద్దపీట వేస్తూ రవాణాకు తగిన రైల్ స్లైడింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు షరాఫ్ గ్రూప్ ముందుకొచ్చిందన్నారు. దీనివల్ల 700 మందికి ప్రత్యక్షంగా, 1300 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.

*భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల‌ల్లో దేశవ్యాప్తంగా 25,920 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరో 492 మంది క‌రోనా కారణంగా మృతి చెందారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 66,254 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 2,92,092 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉంది. ఇప్పటి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,74,64,99,461 డోసుల‌ను కేంద్ర ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది.