DailyDose

హమ్మయ్య.. భారత్ లో కుదుటపడుతున్న కరోనా

Auto Draft

భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల‌ల్లో దేశవ్యాప్తంగా 25,920 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరో 492 మంది క‌రోనా కారణంగా మృతి చెందారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 66,254 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 2,92,092 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉంది. ఇప్పటి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,74,64,99,461 డోసుల‌ను కేంద్ర ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది.