తెలుగులో ‘నేనొక్కడినే’తో హీరోయిన్‌గా పరిచయమైన క్రితి సనన్ బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ‘మిమి’అనే మహిళా ప్రాధాన్య చిత్రంలో తన నటనతో మెప్పించిన ఈ కథానాయికకు బాలీవుడ్‌లో చేతినిండా ప్రాజెక్టులున్నాయి. ‘నేను సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు. ఇదొక విభిన్నమైన ప్రపంచంగా కనిపించింది’ అంటున్న కృతి సనన్ విశేషాలు…‘‘ఏదైనా మంచి పాత్రను హోమ్‌వర్క్ చేసి నటనతో మెప్పిస్తే కచ్చితంగా జనాలు గుర్తిస్తారు. చిన్న పాత్రా? పెద్ద పాత్రా? అని ఆలోచించరు. ప్రతిభకు పట్టం కడతారు. అలాంటప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ ఫీల్డ్‌కి వచ్చినందుకు గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇలా ఎందుకన్నానంటే.. అసలు మనం ఇటొస్తామని అనుకోలేదు. ఎలాంటి నేపథ్యమూ లేదు. మాది మధ్యతరగతి కుటుంబం. అసలు ఇక్కడ నిలదొక్కుకుంటానా? తీసుకున్న నిర్ణయము సరైనదా? అని పేరెంట్స్ టెన్షన్ పడ్డారు. జీమ్యాట్ పరీక్ష రాశాక సినిమాల్లోకి వచ్చా. ఐదేళ్ల లోపల సినిమాలో అవకాశాలు వస్తే సరి లేకుంటే మేం చెప్పినదే చేయాలన్నారు పెద్దలు. సినిమాలో అవకాశాలు రాకపోయినా? చేసిన సినిమాలు ఫ్లాపయినా? మంచి పాత్రలు రాలేకపోయినా? ఇప్పుడిలా ఈ ప్రయాణం కొనసాగించకపోయేదాన్ని. ఇప్పుడిలా హీరోయిన్‌గా కొనసాగుతున్నానంటే.. అదృష్టమే అని చెప్పుకోవాలి. కొత్త క్యారెక్టర్స్ కోసం వెతుకులాట.. డిఫరెంట్‌గా కనిపించాలనే ఆరాటమే.. మంచి కథలను ఎంచుకోవడానికి కారణమైంది.
అమ్మ పేరు గీత, నాన్న పేరు రాహుల్. నాకో చెల్లెలుంది. ముంబైలో సారా అలీఖాన్ ఇంటి దగ్గరే మా ఇల్లు. లాక్‌డౌన్ టైమ్‌లో వంట వండటం చేశా. అమ్మకి డ్యాన్సు నేర్పించా. అప్పుడప్పుడు చెల్లితో స్టయిలి్‌సగా హెయిర్ కట్ చేయించుకున్నా. ముఖ్యంగా ఇంట్లోని పెట్ డాగ్స్ (డిస్కో, ఫాబే)తో ఆడుకున్నా. సమయమే తెలీదు వాటితో ఆడుకుంటుంటే. షూటింగ్‌లు ప్రారంభమయ్యాక.. షూటింగ్ పూర్తవుతూనే ఇంటికి ఎప్పుడెప్పుడొచ్చి ఆడుకుందామా అని ఉంటుంది. అవి కూడా అంతే వస్తూనే ఎంతో ప్రేమగా పలకరిస్తాయి. లిఫ్టు డోర్, ఇంట్లో ఎక్కడైనా దెబ్బలు తగిలించుకుంటాయేమోనని బెంగపడుతుంటా. ఇప్పుడిలా ఉన్నాను.. కానీ ఆరేళ్ల క్రితం వరకు నాకు పెట్స్ అంటే మహాభయం. కుక్కలంటే భయపడేదాన్ని. ఇప్పుడు ఇంట్లో పెట్స్‌తో ఆడుకోవడం వల్ల పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఏదేమైనా కథానాయికగా నిలదొక్కుకున్నా. ఇప్పుడిప్పుడే విభిన్నమైన పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నిలిచిపోయే సినిమాలు చేయాలనేదే కోరిక. మా ఇంట్లో హాల్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే ఫ్యామిలీ ఫొటోలను సెట్ చేశా. ఇంట్లోని ఇలస్ర్టేషన్, ఆర్ట్‌వర్క్స్‌లో హాలీవుడ్ కథానాయిక మర్లిన్ మాన్రో ఉంటుంది. ఆమె ఫొటో కింద ఉండే.. ‘వెల్ బిహేవ్డ్ ఉమెన్ రేర్‌లీ మేక్ హిస్టరీ’ అని ఉంటుంది. ఆ కొటేషన్ అంటే నాకిష్టం!’’ ఇంట్లో హాల్‌లో ఇలస్ర్టేషన్, ఆర్ట్‌వర్క్స్‌లో హాలీవుడ్ కథానాయిక మర్లిన్ మాన్రో ఉంటుంది. ఆమె ఫొటో కింద ఉండే.. ‘వెల్ బిహేవ్డ్ ఉమెన్ రేర్‌లీ మేక్ హిస్టరీ’ అని ఉంటుంది. ఆ కొటేషన్ అంటే నాకిష్టం!