లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్‌తో జరిగే ఈ యేటి బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఆ సదస్సులో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆ సమావేశంలో లైఫ్ సైన్సెస్ గురించి గేట్స్‌తో మంత్రి కేటీఆర్ చాట్ చేయనున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బయోఏషియా సదస్సు జరగనున్నది. కోవిడ్19 మహమ్మారి వేళ గత రెండేళ్ల అనుభవాలు.. హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్ గేట్స్, కేటీఆర్ మధ్య సంభాషణ జరగనున్నది. రెండు రోజులు జరిగే ఈవెంట్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ అలెక్స్ గోర్క్సీ, మెడ్‌ట్రానిక్ సీఈవో జెఫ్ మార్తాలు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. బయోఏషియా సదస్సులో ప్రభావంతమైన, విజినరీ నేతలు పాల్గొంటారని, ప్రస్తుతం బయో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితిపై గేట్స్‌తో ఆసక్తికరమైన చర్చ నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 19వ బయోఏషియా సదస్సులో గేట్స్ పాల్గొనబోవడం సంతోషకరమని బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తెలిపారు. 2021 సదస్సు అత్యంత సక్సెస్ సాధించిందని, దాంట్లో 31వేల మంది డెలిగేట్లు పాల్గొన్నట్లు జయేశ్ రంజన్ తెలిపారు.