మోడీ కీలక నిర్ణయం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జోరును పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కమలం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని లోక్కల్యాణ్ మార్గ్లోని తన నివాసంలో దేశవ్యాప్తంగా సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యమిచ్చారు. బీజేపీ గెలుపును కాంక్షిస్తూ వారితో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా వారు.. సిక్కుల పవిత్రమైన కిర్పన్(ఖడ్గం)ను మోదీకి అందజేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్జీ సించేవాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
* బీజేపీ-వైసీపీ మధ్య లోపాయకారి పొత్తు: బండారు
మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం కన్నెర్ర చేస్తే జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ-వైసీపీ మధ్య లోపాయకారి పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్, విజయసాయి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. ఏపీ గవర్నర్ రబ్బర్ స్టాంప్‌గా మారారని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు
* అర్థం పర్థం లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే ఆనంకే సాధ్యం: రామ్‌కుమార్‌రెడ్డి
అర్థం పర్థం లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికే సాధ్యమని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతిమాలిన రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. ఆనం అజెండా ఏంటో అందరికీ తెలుసని, వెంకటగిరిని బాలాజీ జిల్లాలో కలిపేందుకు ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయని తెలిపారు. తన తండ్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి లేకుంటే.. ఆనంకు రాజకీయ భవిష్యత్తే ఉండేది కాదని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు
* ఏపీ ప్రజలకు వాతలతో పాటు కోతలు ఎక్కవయ్యాయి: Kala venkat rao
రాష్ట్ర ప్రజలకు వాతలతో పాటు కోతలు ఎక్కువయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రూ.11వేల కోట్లపై చిలుకు విద్యుత్ ఛార్జీల వాతలు ప్రజలకు పెట్టారన్నారు. 66 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే… సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ కోత విధిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ పనులు ముగించుకుని వచ్చే రైతులు, గ్రామీణులకు ఇంటి అవసరాలకు విద్యుత్ లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి పంచాయితీలకు వచ్చిన దాదాపు రూ.23వేల కోట్లను విద్యుత్ బకాయిలు ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం దండుకుందని విమర్శించారు. విద్యుత్ పేరుతో సమీకరించిన రూ.60వేల పైచిలుకు కోట్లు ఏం చేశారో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే విద్యుత్ కాదని అధిక ధరలకు కొనుగోలు చేయటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పరనిందలు మాని పనిచేసే విధానం జగన్ రెడ్డి నేర్చుకోవాలని కళా వెంకట్రావు హితవుపలికారు.
* తల్లులను క్షోభ పెట్టారు.. సీఎం నాలుక కోయాలి: గీతారెడ్డి
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఓ మూర్ఖుడు అని.. రాహుల్, సోనియా ఆయనకు తెల్వదా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తండ్రి ఎవరని సంస్కారహీనంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇంకా గీతారెడ్డి మాట్లాడుతూ.. ‘‘తల్లులను క్షోభ పెట్టారు. సీఎం హిమంత బిశ్వ శర్మ నాలుక కోయాలి. ప్రధాని మోదీకి సంస్కారం ఉంటే వెంటనే హిమంతను పదవి నుంచి తొలగించాలి. తాము పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. తెలంగాణలో కూడా ప్రజాస్వామ్యం లేదు. ఉద్యోగాలడిగితే రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా?’’ అని ఫైర్ అయ్యారు.
*పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 1 లక్ష ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తామని, మహిళలకు నెలకు రూ.1,100 చొప్పున ఇస్తామని, వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, మాఫియాను అంతం చేస్తామని తెలిపింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, నూనె గింజలు, చిరు ధాన్యాలు, జొన్నలను రైతుల నుంచి నేరుగా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1 లక్ష ప్రభుత్వోద్యోగాల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఈ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సంవత్సరానికి ఎనిమిది వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపింది. గృహిణులకు ఆర్థిక సాయం పథకం క్రింద నెలకు రూ.1,100 చెల్లిస్తామని వాగ్దానం చేసింది. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీ.
* అధికార మదంతో మాట్లాడితే జాగ్రత్త.. కబర్దార్: రేణుకా చౌదరి
అసోం సీఎం హిమంత నిన్నటి వరకు కాంగ్రెస్ ఉప్పు తిన్నారని.. ఈనాడు పదవి కోసం దిగ జారిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పేర్కొన్నారు. సీఎం అయినంత మాత్రాన హిమంతకు కొమ్ములు లేవంటూ మండిపడ్డారు. అధికార మదంతో మాట్లాడితే జాగ్రత్త.. కబర్దార్ హిమంత బిశ్వ అని హెచ్చరించారు. ఆడవారు తిరగబడితే తట్టుకోలేవని రేణుక హెచ్చరించారు. మహిళలను ఈ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడం ఏంటన్నారు. ఇక్కడి ఆడవారికి మాట్లాడే అర్హత కూడా లేకుండా పోయిందన్నారు. మహిళలు వేసుకునేవి గాజులు కావని విష్ణు చక్రాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హిమంత బిశ్వ వ్యాఖ్యలు ఖండించాలని రేణుకా చౌదరి పేర్కొన్నారు.
*పేదవాడి ఇంటిపై కూడా వైసీపీకి ధనదాహం: Achennaidu
టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకొందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో 3,16,000 ఇళ్లను ప్రారంభించి 2,62,000 పూర్తి చేశామని తెలిపారు. పేదవాడి ఇంటిపై కూడా వైసీపీకి ధనదాహం ఉందని మండిపడ్డారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకిచ్చిన భూములు చెరువులను తలపిస్తున్నాయన్నారు. జగనన్న కాలనీ స్థలాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టుల్లో కేసు వేసిందని చెప్పడం అబద్ధమని తెలిపారు. పేదలకు ఇచ్చిన స్థలాలకు తాము అడ్డుపడలేదని ఆధారాలతో నిరూపించామని చెప్పారు. వైసీపీ 3 సంవత్సరాల్లో ఐదిళ్లు మాత్రమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. 1983 నుంచి రాష్ట్ర ప్రజానికానికి టీడీపీ బాసటగా ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
*నన్నెందుకు అరెస్టు చేయలేదు? : కేజ్రీవాల్
తాను ఖలిస్థానీ వేర్పాటువాదినని వచ్చిన ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. తాను ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలను నిర్మిస్తున్నందుకు మధురమైన ఉగ్రవాదిని అయి ఉండవచ్చునన్నారు. తాను ఉగ్రవాదినై ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఖలిస్థాన్ అనుకూలవాది అని ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేజ్రీవాల్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ, ‘‘నేను ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించే మధురమైన ఉగ్రవాదిని అయి ఉండవచ్చు’’ అని చెప్పారు. ‘‘నేను వేర్పాటువాదిని అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిసి ఉంటే, ఆ విషయాన్ని ఆయన ఎందుకు రుజువు చేయలేదు? ఈ ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు చేయించలేదు?’’ అని ప్రశ్నించారు.
*గిరిజన యూనివర్సిటీకి 45 కోట్లు కేటాయించాం : కిషన్‌రెడ్డి
గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే పండగ మేడారం జాతర జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు సమ్మక్క జాతరకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. గిరిజన యూనివర్సిటీకి 45 కోట్లు కేటాయించామన్నారు. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో ములుగు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
*పేదవాడి ఇంటిపై కూడా వైసీపీకి ధనదాహం: Achennaidu
టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకొందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో 3,16,000 ఇళ్లను ప్రారంభించి 2,62,000 పూర్తి చేశామని తెలిపారు. పేదవాడి ఇంటిపై కూడా వైసీపీకి ధనదాహం ఉందని మండిపడ్డారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకిచ్చిన భూములు చెరువులను తలపిస్తున్నాయన్నారు. జగనన్న కాలనీ స్థలాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టుల్లో కేసు వేసిందని చెప్పడం అబద్ధమని తెలిపారు. పేదలకు ఇచ్చిన స్థలాలకు తాము అడ్డుపడలేదని ఆధారాలతో నిరూపించామని చెప్పారు. వైసీపీ 3 సంవత్సరాల్లో ఐదిళ్లు మాత్రమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. 1983 నుంచి రాష్ట్ర ప్రజానికానికి టీడీపీ బాసటగా ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు
*ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కేసీఆర్ విఫలం: BJP leader
ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఓరన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను అణిచివేస్తోందన్నారు. తెలంగాణలో ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే కేసీఆర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గిరిజనుల నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను త్వరలో ప్రజలు ఇంటికి పంపిస్తారన్నారు. ఆదివాసులకు భూ పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆదివాసులు భూసాగు చేసుకోకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారన్నారు. ఆదివాసులకు, గిరిజనులకు వ్యతిరేకంగా కేసీఆర్ సర్కార్ పని చేస్తోందని అన్నారు. సమ్మక్క సరలమ్మ జాతర కోసం కేంద్రం రెండున్నర కోట్లు కేటాయించిందని సమీర్ ఓరన్ పేర్కొన్నారు.
*ఈ నెల 21 నుంచి జనసేన సభ్యత్వ నమోదు..
జనసేన పార్టీని పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత చర్యలు మొదలెట్టారు. అందుకు రెండో దఫా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 21 నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జనసైనికులు, వీర మహిళలను ఉద్దేశించి వీడియోను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని ఆ వీడియోలో పిలుపునిచ్చారు.తొలి దఫా సభ్యత్వ నమోదును 2020 సెప్టెంబర్ నెలలో చేపట్టారు. అప్పుడు దాదాపు లక్ష మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకునేలా చూడనున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని, లక్ష మందికి బీమా సౌకర్యం వర్తింపజేసి చనిపోన కార్యకర్తలకు అండగా నిలిచామని తెలిపారు.ఇప్పటివరకు ప్రమాదాల్లో చనిపోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా చెక్కులు అందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మన కోసం, పార్టీ కోసం తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని ఈ బీమా సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
*తొలి రెండు విడతల్లోనే మా పార్టీ సెంచరీ కొట్టేసింది: అఖిలేశ్ యాదవ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తొలి రెండు విడతల ఎన్నికల్లోనే తామే ‘సెంచరీ’ కొట్టేశామని, మిగతా విడతల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు తమ సొంతమవుతాయని పేర్కొన్నారు. తొలి రెండు విడతల్లో రాష్ట్రంలోని 133 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న మూడో విడత, 23న నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి.
*అమరీందర్ను తొలగించింది అందుకే: రాహుల్
కెప్టెన్ అమరీందర్ సింగ్ను పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి గల కారణాన్ని రాహుల్ గాంధీ వెల్లడించారు. పంజాబ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అమరీందర్ విముఖత వ్యక్తం చేశారని, అంతే కాకుండా ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని అందుకే ఆయనను సీఎం పదవి నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. గురువారం రాష్ట్రంలోని ఫతేగఢ్ సాహిబ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ అమరీందర్పై విమర్శలు గుప్పించారు.
*సీఎం చన్నీ ఉద్దేశం వేరు: ప్రియాంక వివరణ
ఉత్తరప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్లో అడుగు పెట్టనివ్వబోమంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీ తీవ్ర వివాదానికి దారి తీశాయి. చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రియాంక తనకు తాను యూపీ కూతురిగా చెప్పుకొంటారని, మరోవైపు చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. పంజాబేతరులైన సంత్ రవిదాస్, గురు గోవింద్ సింగ్లను అవమానించారంటూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం మాటల దాడికి దిగారు
*వైసీపీ నేతల అభ్యంతరాలు నిజం
జిల్లాల విభజనపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వంటి వారి అభ్యంతరాలు అక్షర సత్యాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చిన్న జిల్లాల విభజన అవసరం లేదని, తెలంగాణను కాపీ కొట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి జగన్రెడ్డి తప్పు చేస్తున్నారని గురువారం ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాల ఏర్పాటే అర్థరహితమన్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనీ, అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ నుంచి కాపీ కొట్టదల్చుకుంటే అక్కడ అమలవుతున్న ‘రైతు బంధు’ వంటి వాటిని కాపీ కొట్టండి. ఒక పద్ధతి ప్రకారం, భౌగోళిక స్వరూపం, సాగునీటి వసతుల ఆధారంగా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా జిల్లాల పునర్విభజన చేయండి. అడ్డగోలగా చేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదు’’ అని సోమిరెడ్డి హెచ్చరించారు.
*కోతలు ఉన్నాయని ఒప్పుకోవడం సంతోషం: అయ్యన్న
ఈ రెండు రోజులు తప్ప అంతకుముందు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడ ఉన్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ‘ఇన్నాళ్లకు మంత్రికి వాస్తవం తెలిసింది. ఇప్పుడైనా కోతలు ఉన్నాయని ఒప్పుకోవడం సంతోషం. రష్యా, శ్రీలంక పర్యటనలు, పేకాటలు, హవాలా మీద పెట్టే శ్రద్ధ మీ శాఖ మీద కూడా పెట్టండి. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు విద్యుత్ కోతలు ఉన్నాయో తెలుస్తుంది.’ అని పేర్కొన్నారు
*వైసీపీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటా..: దేవినేని ఉమ
వైసీపీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని టీడీపీ నేత దేవినేని ఉమ తేల్చి చెప్పారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించినా, ప్రజల కోసం దేనికైనా సిద్ధమని, వెనక్కు మాత్రం తగ్గేదే లేదన్నారు. జి. కొండూరు మండలంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి కొండపల్లి, గొల్లపూడి, మైలవరంలో బార్ అండ్ రెస్టారెంట్లు అనే మూడు భారీ పరిశ్రమలను ఎమ్మెల్యే వసంత తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. కమీషన్ల కక్కుర్తి కోసమే వీటిని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఒక్క లిఫ్ట్ పెట్టిన పాపాన పోలేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్ళ లేకపోయారని ఆయన మండిపడ్డారు. ఒక చేత్తో బియ్యం ఇస్తూ, ఇంకో చేత్తో అమ్ముకొని గోదాముల్లో స్టాక్ పెడుతున్నారన్నారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలించి మంత్రులు, ఎమ్మెల్యేలు, దళారులు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.