Movies

కిల్లర్ గా ప్రియాంక

కిల్లర్ గా  ప్రియాంక

హాలీవుడ్ చిత్రసీమలో ప్రియాంకచోప్రా జైత్రయాత్ర కొనసాగుతున్నది. తాజాగా ఆమె మరో భారీ చిత్రంలో అవకాశం సొంతం చేసుకుంది. ‘ఎండింగ్ థింగ్స్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆంథోని మెకీ కథానాయకుడిగా నటించనున్నారు. కెవిన్ సులివన్ దర్శకుడు. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ‘ట్రూ లైస్’ తరహాలో సాగే చిత్రమిదని సమాచారం. ఇందులో ప్రియాంకచోప్రా డబ్బు కోసం హత్యలు చేసే హై ప్రొఫైల్ కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో నటించనుందట. ఆమె ఇప్పటివరకు హాలీవుడ్లో చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన ఇతివృత్తమిదని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రథమార్థంలో సెట్స్మీదకు తీసుకురానున్నట్లు తెలిసింది