DailyDose

దేవభూమి అంటే ఇలా ఉండాలి!

దేవభూమి అంటే ఇలా ఉండాలి!

తమిళనాడు రాష్ట్రంలోని మధురై లో రూపు దిద్దుకోనున్న అద్భుతం.. భారీ బంగారు విగ్రహాలు కాదు..రియల్ ఎస్టేట్ కట్టడాలు కాదు..నిజమైన జ్ఞాన సంపద వెల్లివిరిసే నిర్మాణం.”కళైజ్ఞర్ కరుణానిధి మెమోరియల్ లైబ్రరీ.”.సుమారు మూడు ఎకరాల్లో , 2.04 లక్షల చదరపు అడుగుల్లో తయారుకాబోతున్న ఈ అద్భుతమైన గ్రంధాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో ద్వారా ఫౌండేషన్ పనులను ప్రారంభించారు.99 కోట్లతో 8 అంతస్థుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కొలువు దీరబోతున్న ఈ గ్రంధాలయ నిర్మాణానికి 12 నెలల సమయం పడుతుందట.అధునాతనమైన సౌకర్యాలు , 8 ఫ్లోర్స్ , ఎలివేటర్లు , ప్రశాంతమైన రీడింగ్ ఏరియాస్ , గ్రూప్ రీడింగ్ ఏరియా, లాన్స్, వాష్ రూమ్స్, రెస్టింగ్ ప్లేసెస్, పగటి పూట పూర్తి సహజమైన వెలుతురు ఉండే ఏర్పాట్లు..పూర్తి ఎయిర్ కండిషనింగ్ తో దేశంలోనే మహత్తరమైన గ్రంధాలయంగా నిలవబోతుంది.అన్ని రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాలతో పాటు సాఫ్ట్ కాపీలు, జిరాక్స్ లు , ఆన్లైన్ మ్యాగజైన్ లు , వివిధ రకాల సాంకేతిక పరికరాల ద్వారా డిజిటల్ రీడింగ్ సౌకర్యం కూడా ఉంటుందట.స్వర్గధామం అంటే ఇదేనేమో..బ్లైండ్ , డెఫ్ రీడర్స్ కోసం ఆడియో విజువల్ హాల్స్ , ట్రెయిన్డ్ సిబ్బంది , హెల్పర్స్ ఉంటారు.ఆకడమీషియన్ లు , విద్యార్థులు , రీసెర్చ్ స్కాలర్లకు , యువతకు , కళాకారులకు , గృహిణులకు , పిల్లలకు , పోటీపరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు , ఇతర పాఠకులకెందరికో ఉపయోగపడేలా ఈ కళైజ్ఞర్ మెమోరియల్ లైబ్రరీ ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఇది కదా అసలైన దివ్య క్షేత్రం.