Movies

మరచిపోలేని నిర్మాత .. రామానాయుడు

మరచిపోలేని  నిర్మాత  ..     రామానాయుడు

డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 – ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత,
?వర్ధంతి?
సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాముడు భీముడు’ చిత్రంతో నిర్మాతగా సినీ కెరీర్ మొదలుపెట్టి మూవీ మొఘల్‌గా ఎదిగారు రామానాయుడు. నిర్మాతగా ఐదు దశాబ్దాల ప్రస్థానంలో.. భారతీయ భాషలన్నింటిలోనూ ఆయన సినిమాలు నిర్మించారు. ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న కన్నుమూశారు.
*1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడులో రామానాయుడు జన్మించారు.
*1964లో సురేష్ ప్రొడక్షన్స్ను స్థాపించి తొలిచిత్రం రాముడు-భీముడు చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం దాదాపు 100కుపైగా చిత్రాలను ఆయన నిర్మించారు. నిర్మాతగానూ రామానాయుడు యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. భారతీయ భాషలన్నింటా చిత్రాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా రామానాయుడు నిలిచిపోయారు.
*13 భాషల్లో 150కి పైగా ఆయన చిత్రాలను నిర్మించారు. బెంగాల్లో తీసిన అశోక్ అనే చిత్రానికి గాను నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా రామానాయుడు గిన్నిస్రికార్డ్సులోకి ఎక్కారు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి దాదాపు 24 మంది దర్శకులు ఇండస్ర్టీకి పరిచయమయ్యారు. అలాగే అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయనచే సినీ ఇండస్ర్టీకి పరిచయమై అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
*2010లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2013లో పద్మభూషన్ అవార్డులను ఆయన అందుకున్నారు. 2006లో రఘుపతి వెంకయ్య అవార్డును రామానాయుడు అందుకున్నారు. అలాగే శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీ వారు ఆయనను డాక్టరేట్గా సత్కరించారు. ఆయన నిర్మించిన జీవనతరంగాలు, సోగ్గాడు చిత్రాలకు గాను ఫిల్ఫ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. ఆయన సినీ జీవితంలో 1971లో వచ్చిన ప్రేమ్నగర్ పెద్ద హిట్ను అందుకుంది.
*రామానాయుడు పెద్దకుమారుడు సురేష్ బాబు టాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతుండగా, రెండో కుమారుడు వెంకటేష్ హీరోగా కొనసాగుతున్నారు.