Devotional

సమ్మక్క-సారలమ్మ జాతరలో కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

సమ్మక్క-సారలమ్మ జాతరలో కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

మేడారం జాతర.. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వన దేవతలను దర్శించుకొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే, మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు?
**పులుల మధ్య సమ్మక్క
మేడారం, సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే.. ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు.
**కాకతీయుల కాలంలో..
క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు, మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు.
**తాపరుద్రుడి దండయాత్ర
మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరవు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర శంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు.
**సంపెంగవాగు జంపన్నవాగుగా ఇలా..
మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు-కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవింద రాజులు (సమ్మక్క-పగిడిద్దరాజు అల్లుడు) వీరోచితంగా పోరాటం చేశారు. కానీ, కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు.
**సమ్మక్కకు వెన్నుపోటు
తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ, ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత చెట్టుకింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు.
*కుంకుమ భరిణెలకు పూజలు ఇందుకే..
కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం ఏర్పడింది.
*చివరికి వన ప్రవేశం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు. దీంతో మహా జాతర ముగుస్తుంది.

~~~~~~~~~~~~~~~~~~~~
1.జన సమ్మోహనం.. జగజ్జనని ఆగమనం
ములుగు జిల్లా మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మా ర్మోగింది. జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం గురు వారం రాత్రి ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయ దొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీ పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్క ను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఈ సందర్భంగా చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల దాకా భక్త జనంతో కిటకిటలాడింది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే క్రతువు గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్విగ్నభరితంగా సాగింది.
*ఉదయం నుంచే మొదలై..
సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ఏర్పాట్లు గురువారం ఉదయమే మొదలయ్యాయి. సమ్మక్క వడ్డెలు, పూజారులు ఉదయం 5.30 గంటలకే మే డారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కంకవనాలు (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యే క పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకలగుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తులు సమ్మక్క వచ్చే దారి పొడవునా రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నింపేశా రు. సాయంత్రం ఏడు గంటల సమయంలో సమ్మక్క తల్లితో పూజారులు చిలకలగుట్ట దిగడం ప్రారంభించారు. ఇది చూసి భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పూజారులు సిద్దబో యిన మునీందర్, లక్ష్మణ్రావు, మహేష్, చందా బాబూరావు, దూప వడ్డె నాగేశ్వర్రావు అమ్మవా రిని వడ్డె కొక్కెర కృష్ణయ్యకు అప్పగించాక మేడారం వైపు కదిలారు. ప్రభుత్వం తరఫున అధికారిక లాం ఛనాల ప్రకారం సమ్మక్కకు ఆహ్వానిస్తూ, ఆమె రాకకు సూచనగా ములు గు జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే చిలకలగుట్ట నుంచి మేడా రం దాకా లక్షలాది మంది భక్తజనం సమ్మక్క నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు.
*రక్షణ వలయం మధ్య
ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య వడ్డెల బృందం సమ్మక్క ప్రతిరూపంతో మేడారం వైపు బయలుదేరారు. దారిపొడవునా భక్తులు అమ్మకు దండం పెట్టుకున్నారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని చల్లారు. సమ్మక్కను తీసుకువస్తున్న బృందం అక్కడి నుంచి ఎదుర్కోళ్ల పూజా మందిరం చేరుకుంది. అక్కడ వడ్డెలు, పూజారులు ఎదురుకోళ్లు జరిపించారు. సమ్మక్కకు సెలపెయ్యను బలి ఇచ్చారు. మేడారం గద్దెల ముఖ ద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. తర్వాత 9.19 గంటల సమయంలో గద్దెలపైకి తీసుకువచ్చారు. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చినప్పటి నుంచి ప్రతిష్టించే వరకు గద్దెల ఆవరణలో విద్యుత్ దీపాలను ఆపివేశారు. రహస్య పూజలు చేసిన అ నంతరం రాత్రి 9.43 గంటల సమయంలో దీపా లను ఆన్ చేశారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు.
*కేసీఆర్ పేరిట బెల్లం బంగారం సమర్పణ
గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజు కావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. కేసీఆర్ పేరిట అమ్మవార్లకు బెల్లం బంగారం మొక్కు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కూడా అమ్మవార్లకు సీఎం పేరుమీద బెల్లం సమర్పించారు.
*నలుగురు దేవతలు.. నలుదిక్కులా మొక్కులు
బుధవారం మేడారం గద్దెలకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాగా.. గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. దీనితో మొత్తం నలుగురు దేవతలు గద్దెలపైకి చేరి.. మహా జాతర పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. మొక్కులు సమర్పించేందుకు లక్షల మంది భక్తులు భారీగా తరలివచ్చారు. దేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. బుధ, గురువారాల్లో సుమారు 75 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు.

2. మేడారం జనసంద్రం.. మొక్కులు చెల్లించిన మంత్రి ఎర్రబెల్లి
మేడారం జనసంద్రమైంది. గిరిజన దేవతలైన సమ్మక్క-సారక్క వనం వీడి గద్దెలపైకి చేరగా.. అశేష జనవాహిని తరలివచ్చి మొక్కులు చెల్లిస్తున్నది. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సైతం నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దెలపైకి అమ్మవార్లు చేరక ముందే 75లక్షల మంది దర్శించుకున్నారన్నారు.

3. సమ్మక్క తల్లి చిలకలగుట్ట దిగి జనం మధ్యకు వచ్చింది. భక్తులను కండ్లారా చూసుకొనేందుకు, వారిని మనసారా దీవించేందుకు మేడారం గద్దెపైకి చేరింది. ఆదివాసీ జాతరలో సమ్మక్క తల్లిని తోడ్కొని వచ్చి గద్దెలపైకి చేర్చే అద్భుత ఘట్టం గురువారం ఆవిష్కృతమైంది. ఈ పతాక సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సమ్మకను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే ప్రారంభమైంది. సమ్మక వడ్డెలు ఉదయం 10:13 గంటలకు మేడారం సమీపంలోని చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక పూజా మందిరం నుంచి అడేరాల(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మకను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం సాయంత్రం నాలుగు గంటలకు చిలుకలగుట్టపైకి బయల్దేరింది. అప్పటికే చిలుకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని చేతపట్టుకొన్న మరుక్షణమే ప్రధాన పూజారి కొకెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక ఉదుటున చిలుకలగుట్ట దిగారు. సమ్మక్క రాకకు సూచనగా అమ్మవారిని ఆహ్వానిస్తూ ప్రభుత్వ తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య సైతం ఏకే 47 తుపాకీ ట్రిగ్గర్ను నొకారు. ఈ శబ్దంతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. చిలకలగుట్ట దాటే సమయంలో ఎస్పీ మరోసారి తుపాకీ కాల్పులు జరిపి సమ్మకను ఆహ్వానించారు. చిలకలగుట్ట నుంచి గద్దెల దాకా దారిపొడవునా, అడవి అంతా సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. సమ్మక్క వస్తుండగా దారిలోనే భక్తులు కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకొన్నారు. శివసత్తులు పూనకాలతో శివాలూగారు. మొక్కుల కోసం తెచ్చుకొన్న ఒడిబియ్యాన్ని సమ్మక్కపై వెదజల్లారు. ఈ ప్రధాన సందర్భం సాయంత్రం 7.20 గంటల నుంచి రాత్రి 9.12 వరకు ఉద్విగ్న క్షణాల మధ్య కొనసాగింది. సమ్మక గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో కరెంటు సరఫరాను నిలిపివేశారు. సమ్మక గద్దెలపైకి చేరిన తర్వాత కరెంట్ సరఫరా కొనసాగించారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. సమ్మక, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరడంతో మొకులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. సమ్మక గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక రోజే ఏకంగా 30 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు.

4. మేడారం బాట పట్టిన బీజేపీ నేతలు
బీజేపీ నేతలంతా మేడారం బాట పట్టారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్‌తో కలిసి హెలికాప్టర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మేడారానికి వచ్చారు. బీజేపీ కార్యాలయం నుంచి గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఒరన్‌తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం జాతరకు రానున్నారు. బండి సంజయ్‌ వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మేడారం వెళ్లనున్నారు.

5. మేడారం జాతరలో పోలీసులు, అధికారుల మధ్య సమస్వయ లోపం
మేడారం మహాజాతర నిర్వహణలో పోలీసులు, అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది. మేడారం జాతరలో అనుభవం లేని ఐపీఎస్ అధికారులతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త ఐపీఎస్ అధికారులు జాతరను పూర్తిగా కమాండ్ చేస్తున్నారు. వారి అతి ఉత్సాహంతో భక్తులు, స్థానిక పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం – పస్రా మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

6. మేడారం జాతరలో రాష్ట్ర బీజేపీ నేతలు
మేడారంలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, లక్ష్మణ్ తో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు. వనదేవతల గద్దెల దగ్గరకు చేరుకున్న కేంద్ర మంత్రులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గద్దెలపై ఉన్న అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.

7. జైనథ్ గుడి చూసొద్దాం
ఆదిలాబాద్ అంటేనే అడవితల్లి కట్టిన ఆకుపచ్చని చీర. పచ్చని చెట్లు, వాగులు, వంకలు, జలపాతాలకు నెలవు అయిన ఈ ప్రాంతం పురాతన దేవాలయాలకు కూడా ఫేమస్. అలాంటి వాటిలో జైనథ్ ఊర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం చూడాల్సింది. ఇది తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. జైన దేవాలయాన్ని పోలి ఉండడంతో దీన్ని ‘జైనథ్ దేవాలయం’ అని పిలుస్తారు. పూర్తిగా నల్లరాయితో కట్టిన ఈ గుడికి 800 ఏండ్ల చరిత్ర ఉంది. పెద్దపెద్ద రాళ్లను తొలచి మహాబలిపురం వంటి గుడులు కట్టిన పల్లవుల కాలం నాటిది ఈ గుడి.
*జైనథ్ గుడి లోపలి, బయటి గోడలపై చెక్కిన శిల్పాలు పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ గుడి బయటి గోడలపైన 20 శ్లోకాలు చెక్కి ఉంటాయి. ఈ గుడిని నాలుగు నుంచి తొమ్మిదో శతాబ్దంలో పల్లవ రాజులు కట్టించారని ఈ శ్లోకాల్లో ఉంది. రెండు అడుగుల ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఈ గుడిని కట్టారు. గర్భగుడిలో 6 అడుగుల ఎత్తైన స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని పూర్తిగా నల్లరాతితో చేశారు.
*ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏమిటంటే.. దసరా తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజున సూర్యుడి కిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో జైనథ్ గుడికి వస్తుంటారు. ఏటా అక్టోబర్–నవంబర్ నెలల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. రథోత్సవం కూడా కన్నులపండువగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నారాయణస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని ‘నారాయణ స్వామి, నారాయణమూర్తి, లక్ష్మీనారాయణుడు’ అని కూడా పిలుస్తారు. జైనథ్ గుడి కారణంగానే తమ ఊరికి ‘జైనథ్’ అని పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు.
*లా వెళ్లాలి.. ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది జైనథ్ గుడి. హైదరాబాద్ నుంచి 327 కిలోమీటర్ల జర్నీ.
టైమింగ్స్: ఉ. 6 నుంచి రాత్రి 8:30 వరకు.

8. వ‌న దేవ‌త‌ల‌కు నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించిన కేటీఆర్
జ‌న్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఓబుళాపూర్‌లో జ‌రుగుతున్న‌ స‌మ్మ‌క – సార‌ల‌మ్మ జాత‌ర‌ను కేటీఆర్ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వ‌న దేవ‌త‌ల‌కు కేటీఆర్ నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌కు మంత్రి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

9. మేడారం జాతరకు హాజరైన మంత్రి తలసాని
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మజాతరకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కుటుంబ సమేతంగా హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తులాభఆరం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

02182022142608n25
KTR-Sammakka3
KTR-Sammakka4
william stafford quotes