Devotional

మేడారం జాతరలో బెల్లాన్ని బంగారంగా భావిస్తారు… ఎందుకో తెలుసా?

మేడారం జాతరలో బెల్లాన్ని బంగారంగా భావిస్తారు… ఎందుకో తెలుసా?

మేడారం జాతరలో బెల్లాన్ని బంగారంగా భావిస్తారు… ఎందుకో తెలుసా…
మన దేశంలో బంగారానికి ఎంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలోని మేడారం జాతరలో మాత్రం పసిడి అంటే రుచి.. పచి లేని అలోహ ముద్ద కాదు.. మనందరం తినే బెల్లం. అందుకే మేడారంలో సమ్మక్క, సారలక్క జాతరకు వెళ్లే భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బెల్లాన్ని తీసుకెళతారు.అదే బెల్లంతో అమ్మవార్లను కొలుస్తారు.. తలుస్తారు.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరంలో టన్నుల కొద్దీ బెల్లం అమ్మవార్లకు సమర్పించబడుతుంది. అయితే ఈ మేడారం జాతరలో బెల్లాన్నే ఎందుకు సమర్పిస్తారు? ఇక్కడు బెల్లానికి బంగారం లాంటి ప్రాధాన్యత ఎలా వచ్చింది అనే విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం…
****ఆదివాసీల ఆచారం..
మామూలుగా మనలో చాలా మంది దేవుళ్లందరికీ అనేక రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాయి. అయితే అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీల ఆచారాలు మాత్రం మనందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో సమ్మక్క, సారలక్కకు భక్తులందరూ బెల్లాన్ని బంగారంగా భావించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.
**బెల్లంతో పాటు..
వడి బాల బియ్యం, చీర, పసుపు బట్టలు, తట్టెలు, కొబ్బరికాయలు, బుట్టలు, బోనాలు, పట్నాలు, చిలకలు, ఎదురుకోళ్లు.. యాట పోతుల వాటిని కూడా మొక్కులుగా చెల్లించుకుంటారు.
**ఉప్పు, బెల్లం చాలా విలువైనవి..
ఆదివాసీలకు బెల్లం, ఉప్పు అంటే ఇష్టం. ఎందుకంటే ఇవి ఇతర ప్రాంతాల నుండి వారి దగ్గరికి వస్తాయి. అందుకే వారు వీటికి ఎక్కువ విలువ ఇస్తారు.
***సంతానం విషయంలో..
ముఖ్యంగా చాలా మంది మహిళలు తమకు సంతానం కలిగినా.. సంతానం కలగాలన్నా.. తమ బరువును అంతా ఈ బెల్లంగా రూపంలో చెల్లించుకునేందుకు ఈ జాతరకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు తమ కోరికలను నెరవేరుతాయని కొందరు.. మరి కొందరు తమ కోరికలు నెరవేరినందుకు ఈ మొక్కులను తీరుస్తారు.
***బరువును బట్టి బెల్లం..
ఇక్కడి అమ్మవార్లకు తమ పిల్లల బరువును బట్టి బెల్లాన్ని సమర్పిస్తున్నారంట. ముఖ్యంగా తమ పిల్లలకు ఉద్యోగం వస్తే లేదా తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వచ్చినా.. విదేశాలలో ఉన్నత చదువులకు సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఆ పిల్లల ఎత్తు.. బరువు ఉన్న బెల్లాన్ని సమర్పిస్తారమని భక్తులే స్వయంగా చెబుతున్నారు.
***అప్పట్లో బెల్లం చాలా ఖరీదు..
ఆదివాసీలందరూ ఒకప్పుడు బెల్లం చాలా ఖరీదైన వస్తువుగా భావించేవారు. దీన్నే దేవతలకు సమర్పించేవారు. అయితే దీనికి సంబంధించి మరో కథను కూడా అక్కడి స్థానికులు చెబుతున్నారు. సమ్మక్క భర్త పేరు పగిడిద్ధ రాజు. అతని పేరులో పగిడి అంటే బంగారం అనే అర్థం ఉందని వారి నమ్మకమట. అందుకే ఇక్కడ బెల్లానికి బంగారం అని పేరు వచ్చిందని చాలా మంది చెబుతుంటారు.
***విప్పసారా కూడా…
అప్పట్లో ఆదివాసీలు సమ్మక్క,సారలక్కకు బెల్లంతో పాటు విప్పసారాను కూడా సమర్పించేవారట. అయితే ఇది చాలా సాంప్రదాయమట. కొంత సారాను అమ్మకు సమర్పించి.. మిగిలింది వారు సేవించేవారట. విప్పసారా అంటే విప్ప పువ్వుతో స్వయంగా తయారు చేసిన ద్రవాన్ని సమర్పించేవారట.
**మొక్కుల్లో మార్పులు..
మన తెలుగు రాష్ట్రాల్లో జాతర అంటే మద్యం, మాంసం అనేది చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవ్వరైనా కోళ్లను, గొర్రెలను, మేకలతో తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో వీటితో పాటు విప్పసారాలోనూ మార్పు వచ్చింది. ఇతర రకాల మద్యం సేవించి.. మద్యాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారట.