* మరికొన్ని గంటల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసు కేసు నమోదైంది. అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై పంజాబ్ ఎన్నికల పోలింగ్ అధికారి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దూషించినట్లు ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంపై ఆయా పార్టీ నేతలు కేజ్రీవాల్‌పై పంజాబ్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కాగా, ప్రచార సమయం ముగిసినప్పటికీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కూడా కేసు నమోదు చేశారు.
* మచిలీపట్నంలో జోరుగా గంజాయి.. విద్యార్థిని పట్టుకున్న పోలీసులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ దందా రోజురోజుకు పెరిగిపోతున్నది. డ్రగ్స్ వాడకాన్ని అణచివేసేలా తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటుండగా.. ఏపీలోనూ గంజాయి దందాపై పోలీసులు నజర్ వేశారు. పోలీసులకు అందుతున్న సమాచారం మేరకు దాడులు జరిపి నిందితులను పట్టుకుంటున్నా.. గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. గుడ్లవల్లేరులో బ్యూటీ పార్లర్ ముసుగులో గంజాయి అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా, మచిలీపట్నంలో విద్యార్థి పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి సేవిస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానిక జగన్నాథపురంలోని రైస్ మిల్లు వెనుక ఖాళీ స్థలంలో విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు కనిపించారు. పోలీసుల రావడాన్ని గమనించిన విద్యార్థులు అప్రమత్తమై కాళ్లకు బుద్ధి చెప్పారు. అయితే, ఎస్‌ఐ అనూష వారిని వెంబడించి ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థిని విచారిస్తున్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాలను దృష్టిపెట్టినట్లు ఎస్‌ఐ అనూష తెలిపారు. అటు తిరుపతిలోనూ గంజాయి వాసనలు వస్తున్నాయి. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను స్థానిక పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 12 కేజీల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన సురేందర్‌రెడ్డి అనే వ్యక్తితోపాటు చెన్నైకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి అర్ధ నగ్నంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేసి హత్య చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*ఐరోపాలో యునిస్ తుపాను బీభత్సం సృష్టించింది. వరుస తుపానులతో బ్రిటన్, బెల్జియం, నెదర్లాండ్, డెన్మార్క్, జర్మనీ దేశాలు వణికిపోతున్నాయి.
*కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బిల్డింగ్ కూలి కిందపడటంతో కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. అధికారులు పట్టించుకోలేదు. ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌పై కూలీలు దాడికి పాల్పడ్డారు. ఈఈ శ్యాంప్రసాద్, ఏఈ విశ్వనాథ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
* నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో తెరాస, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. విగ్రహావిష్కరణ కోసం ఇరు వర్గాలు పోటీపడి పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రాళ్ల దాడిలో ధర్పల్లి ఎస్‌ఐ వంశీకృష్ణ, ఓ మహిళా కానిస్టేబుల్‌కి గాయాలయ్యాయి. విగ్రహం వద్ద చెరోవైపు తెరాస, భాజపా కార్యకర్తలు బైఠాయించి పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు యత్నించారు.
* జగ్గయ్యపేట వత్సవాయిలో మండలం లింగాలలో బిజెపి నేత దారుణ హత్య కృష్ణాజిల్లా బిజెపి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి వేట కొడవల్లతో నరికి చంపిన దుండగులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
* నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో తెరాస, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. విగ్రహావిష్కరణ కోసం ఇరు వర్గాలు పోటీపడి పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రాళ్ల దాడిలో ధర్పల్లి ఎస్‌ఐ వంశీకృష్ణ, ఓ మహిళా కానిస్టేబుల్‌కి గాయాలయ్యాయి. విగ్రహం వద్ద చెరోవైపు తెరాస, భాజపా కార్యకర్తలు బైఠాయించి పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు యత్నించారు.
* అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి డివిజన్‌లోని దుబే కాలనీలో నివసించే సౌజన్య.. బాచుపల్లి డీఆర్కే కాలేజీలో బీటెక్ చదువుతోంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది
*సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 19 – 25 సంవత్సరాల వయసు గల మహిళలను కోర్టు ఆదేశంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా అనాథాశ్రమంలో చేర్పించారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరికి అక్కడ 20 రోజులుగా తర్ఫీదు ఇస్తున్నారు.అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్‌రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు. ఉదయం వీరు లేకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. ఆశ్రమం నిర్వాహకులు నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*రణస్థలం మండలంపైడభీమవరం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ వద్ద ఆగి ఉన్న లారీని కేరళ-త్రివేండ్రం టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో సుమారు యాబై మంది ప్రయాణీకులు ఉన్నారు. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకునికేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురం సముద్ర తీరానికి విద్యార్థుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి. నిన్న చీరాల మండలం వాడరేవు వద్ద ఇంటర్ విద్యార్దులు షేక్.ఆఫ్రిది(18), వెంకట మారుతి(18) అనే ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. విషయం తెలిసిన పోలీసులు… గజ ఈతగాళ్లతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈరోజు ఉదయం విద్యార్థులు మృతదేహాలు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి. విద్యార్థుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
*శ్రీకాకుళం జిల్లాలోని రాజాం పట్టణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్ వద్ద మద్యం సేవించి హంగామా చేశారు. హోటల్‌లో ఫర్నిచర్, వస్తువులను మందుబాబులు ధ్వంసం చేశారు. పరస్పరం రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని తాగుబోతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
*జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని వత్సవాయి మండలంలో దారుణ హత్య జరిగింది. చిట్యాల గ్రామంలో బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు నిన్న (శుక్రవారం) అర్థరాత్రి హత్య చేశారు. వత్సవాయి మండల కేంద్రంలో పని చూసుకొని రాత్రి ఇంటికి తిరిగివస్తుండగా మాటు వేసి మల్లారెడ్డిని దుండగులు హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
*ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పెను ప్రమాదం తప్పింది. టపాసులు పేల్చడంతో మంటలు టెంట్లకు అంటుకున్నాయి. టెంట్లుకుర్చీలు కాలిపోయాయి. నర్సింగపూర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్జడ్పి చైర్మన్ వసంత ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సభా వేదికకు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది
*మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం ఆర్టీసీ బస్సు ఢీకొని..నలుగురు మృతిమేడారం జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.కొంతమంది కారులో మేడారం జాతరకు వెళ్లారు. జాతరకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నారు.మార్గంమధ్యలో గట్టమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
*గుంటూరు దాచేపల్లిలో ఎయిర్ గన్ కలకలం ఫ్రెండ్స్ మధ్య గొడవలతో గన్ గురి పెట్టిన స్నేహితుడు ఇద్దరి మధ్య డబ్బు వ్యవహారంలో ముదిరిన గొడవ పోలీసులు ఎంట్రీ తో సద్దుమణిగింది ఎయిర్ గన్ మరియు ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్న గుంటూరు పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు
*లష్కరే సంస్థకు పత్రాలు లీక్ చేసిన ఐపీఎస్ అధికారి అరెస్ట్
రహస్య పత్రాల లీకేజి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. కొంతకాలం కిందట ఎన్ఐఏలోనే రహస్య పత్రాల లీకేజి ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు అరెస్టయింది కూడా గతంలో ఎన్ఐఏలో పనిచేసిన అధికారే. ఆయన పేరు అరవింద్ దిగ్విజయ్ నేగి. ఆయన గతంలో ఎన్ఐఏలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం సిమ్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. లష్కరే కార్యకలాపాలపై నమోదైన కేసులో భాగంగా ఆ అధికారిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.కాగా, లష్కరే నెట్ వర్క్ వ్యాప్తికి సంబంధించి అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు గతంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారి అరవింద్ నేగి అరెస్ట్ సందర్భంగా ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు జరిపారు. అధికారిక రహస్యపత్రాలను లష్కరే ఉగ్రవాద సంస్థకు లీక్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
*లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ మాజీ ఎస్‌పీ, ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని అరెస్టు చేసిన NIA అధికారులు .
*శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద అంజూరన్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురయింది ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు 6 గురి పరిస్థితి విషమం, రిమ్స్ హాస్పిటల్ కు తరలింపు వెనకనుండి లారీని ఢీకొన్న అంజూరన్ ట్రావెల్స్ బస్
*కృష్ణజిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలో జగన్నాథపురంలో జోరుగా సాగుతున్న గంజాయి ..గంజాయి సేవిస్తున్న విద్యార్ధులు సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు …జగన్నాథపురం రైసుమిల్లు వెనకాల ఖాళీ స్థలంలో గంజాయి సేవిస్తున్న విద్యార్ధులు …ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమాచారం తెలుసుకుని పారిపోయిన స్టూడెంట్స్ …విద్యార్థులను వెంబడించి పట్టుకుని ఒకర్ని అదుపులోకి తీసుకున్న ఎస్సై అనూష ..
*ఆస్తి కోసం తండ్రి మీదే కొడుకు దాడి చేశాడు. ఈ సంఘటన ఈ నెల 16న జరిగింది. పెద్దమరివీడు గ్రామానికి చెందిన చంద్రన్న మొదటి భార్య గౌరమ్మ చనిపోవడంతో వెంకటేశ్వరమ్మను రెండో పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య గౌరమ్మకు కుమారుడు మల్లేష్, కుతురు శిరీష ఉన్నారు. రెండో భార్య వెంకటేశ్వరమ్మకు ఇద్దరు కూతుళ్లు గౌరమ్మ, మల్లేశ్వరమ్మ ఉన్నారు.
*పాన్కార్డ్ అప్డేషన్ చేస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్లో వివరాలు చెప్పడంతో బ్యాంకు ఖాతాలోని రూ.లక్ష పోగొట్టుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో జరిగింది
* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండ్ వద్ద బైకు కవర్లో పెట్టిన రూ.10.50 లక్షలను బుధవారం చోరీ చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం లక్ష్మణ్రావుగూడకు చెందిన శ్రీరంగపురం శ్రీనివాస్ తన ఇంటి నుంచి రూ.10.50లక్షలు తీసుకుని బైక్పై చేవెళ్లలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచికి వెళ్లారు. ఆయన వెంట స్నేహితులు రవి, శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్ ఆ బ్యాంకులో రూ.4.8 లక్షలు డ్రా చేశాడు. ఆ తరువాత కెనరా బ్యాంకు వద్దకు వెళ్లి, ఆ డబ్బును అక్కడ ఉన్న తన బావకు ఇచ్చాడు. ఇంటి నుంచి తెచ్చిన డబ్బుని వేరే పనికోసం బైక్ కవర్లోనే ఉంచాడు. ఈ మధ్యలో దాహం వేయడంతో స్నేహితులతో కలిసి బస్స్టాండ్ పక్కన ఉన్న కొబ్బరిబొండాల దుకాణం వద్దకు వెళ్లాడు. బైక్ను రోడ్డు పక్కన నిలిపాడు. ఇంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వారి వద్దకు వచ్చి రూ.500 చిల్లర ఉందా? అని శ్రీరంగపురం శ్రీనివా్సను అడిగాడు.
* విరుదునగర్ జిల్లా రాజపాళయం వద్ద పొలంలో దాచి వుంచిన లక్షలాది రూపాయల విలువ చేసే రెండు ఏనుగు దంతాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రాజపాళయం పుల్లుపత్తి ప్రాంతంలో ఉన్న పంటపొలంలో ఏనుగు దంతాలను దాచి వుంచినట్లు అటవీ శాఖ అధికారులకు రహస్య సమాచారం అందింది. అటవీశాఖ అధికారులు ఆ పొలంలో తనిఖీలు చేసినప్పుడు ఓ చోట దాచి వుంచిన రెండు ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఆ పొలంలో బసచేస్తున్న ముత్తురాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు
* కోయంబత్తూరు సిడ్కోనగర్ వద్ద బుధవారం ఉదయం కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వరుడు, అతడి తల్లి మృతి చెందారు.