Movies

రష్మిక ఇక తగ్గేదే లే..?

రష్మిక ఇక తగ్గేదే లే..?

కన్నడ బ్యూటీ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు తన రెమ్యునరేషన్ బాగా పెంచేసిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. ‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చి భారీ సక్సెస్ సాధించిన ‘పుష్ప’ చిత్రంలో నటించింది. పాన్ ఇండియన్ స్థాయిలో 5 భాషలలో విడుదలైన ఈసినిమాతో అన్నీ భాషలలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు రష్మిక రెమ్యునరేషన్ బాగా పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప’ చిత్రానికి రూ.కోట్ల వరకు అందుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు దాదాపు రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే రష్మిక హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలను పూర్తి చేసింది. తెలుగులో ‘పుష్ప’ సీక్వెల్, శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలు చేస్తోంది.