DailyDose

నిజామాబాద్ లో భాజపా, తెరాస మధ్య రాళ్ల దాడులు

Auto Draft

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి రణరంగంగా మారింది. శివాజీ విగ్రహావిష్కరణ విషయంలో తెరాస, భాజపా కార్యకర్తలు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ధర్పల్లి ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఇవాళ ఎంపీ అర్వింద్ ధర్పల్లి, మోపాల్‌లో శివాజీ విగ్రహం ఆవిష్కరించాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. భాజపా నేతలను ముందస్తు అరెస్టు చేశారు.పోలీసులు పర్యటనను అడ్డుకుంటున్నారని అర్వింద్‌ ఆరోపించారు. తనను అ‌డ్డుకున్నా భాజపా ఎదుగుదలను అడ్డుకోలేరని అర్వింద్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక తెరాస, భాజపా కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకుని పోటాపోటీ నినాదాలు చేశారు. రైతు కండువాలు వేసుకున్న తెరాస కార్యకర్తలు విగ్రహావిష్కరణ చేసేందుకు ప్రయత్నించగా.. భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.