ప్రశ్న
————–
బిచ్చగాడు అడుక్కనేటప్పుడు ‘దానం చెయ్యండి’ అని కాక “ధర్మం చెయ్యండి” అని ఎందుకు అడుగుతాడు?
జవాబు
——————–
పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే:
సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి.
మొదటి రెండు భాగాలు స్వంతానికి వాడుకోవాలి.
మూడోభాగం పన్నులు, తదితరాలు.
నాలుగో భాగం ఊరుమ్మడి ఖర్చులు (కళాకారులు, పురోహితులు, పనిచేయలేనివారు, పేదలు, సన్యాసులు ఇలాంటి వారికి) ఇవ్వాలి.
వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు.
దీన్ని ధర్మం పాటించడం అంటారు.
అందుకే బిచ్చగాళ్లు మన ధర్మం పాటించాలని మనల్ని అడుగుతారు.
దానమంటే ఇదికాక నీ స్వంత భాగంలో ఇవ్వడం. ✅