తాళ్లూరి ట్రస్ట్ ఛైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య సతీమణి, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ మాతృమూర్తి తాళ్లూరి భారతిదేవి భారత కాలమానం ప్రకారం ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మృతి పట్ల తానా కార్యవర్గ సభ్యులు, జయశేఖర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, పలువురు ప్రవాసులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆమె అంత్యక్రియలు ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో నిర్వహించనున్నారు.
తాళ్లూరి జయశేఖర్‌కు మాతృవియోగం
Related tags :