బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలు శిక్ష ఖరారైంది. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. సంచలనాత్మక దాణా కుంభకోణానికి(fodder scam) సంబంధించిన ఐదో కేసులోనూ ఆయన దోషిగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇవాళ జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది సీబీఐ కోర్టు.బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం 950 కోట్ల రూ. దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు రాగా.. దొరండా ట్రెజరీ కేసులో 139.35 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 99 మందిలో 24 మందిని నిర్ధోషులుగా విడుదల చేయగా.. 46 మందికి గతవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖారు చేసింది. 73 ఏళ్ల లాలూ.. దుమ్కా, దియోగర్, చాయ్‌బస ట్రెజరీల కేసులకు సంబంధించి.. 14 జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దొరండా ట్రెజరీ కేసు తీర్పు వెలువడేంత వరకు ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారు.ఆపై అరోగ్య సమస్యలతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆరో కేసు బంకా ట్రెజరీకి సంబంధించింది ఇంకా విచారణ దశలోనే ఉంది.