Movies

ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది

ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది

హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ నటించిన తొలి మ్యూజికల్‌ వీడియో ‘గాంధారి’ విడుదలైంది. సోనీ మ్యూజిక్, ది రూట్‌ అసోసియేషన్‌లో రూపొందిన పాట ఇది. పవన్‌ సీహెచ్‌ స్వరపరచిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా, అనన్య భట్‌ పాడారు. బృందా మాస్టర్‌ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు ‘గాంధారి.. గాంధారి.. నీ మరిది.. గాంధారి.. దొంగ చందమామలా ఒంగి చూసిండే’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాట ఆవిష్కరణ సందర్భంగా కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ – ‘‘గాంధారి’లాంటి మ్యూజిక్‌ వీడియో చేయడం ఓ ప్రయోగంలా అనిపించింది. రెండు రోజుల్లోనే ఈ పాటను పూర్తి చేశాం. బృందా మాస్టర్‌గారు కొరియోగ్రఫీ చేసిన పాటలు చేశాను. ఇప్పుడు ఆమె దర్శకత్వంలోనూ వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది. ‘సారంగ దరియా’ పాట తర్వాత ఈ ‘గాంధారి’ సాంగ్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పవన్‌ సి.హెచ్‌ మరో హిట్‌ అందుకున్నారు’’ అన్నారు. ‘‘కీర్తి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా ఎంజాయ్‌ చేస్తూ ఈ పాట చేశాను’’ అన్నారు బృంద. సంగీతదర్శకుడు పవన్, రూట్‌ ప్రతినిధి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.