NRI-NRT

ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు

ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు

ఉక్రెయిన్​-రష్యా మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. దీంతో ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను ముమ్మరం చేసింది విదేశాంగ శాఖ. రెండు దేశాల మధ్య మరో నాలుగు విమానాలను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు గుజరాత్​ వడోదరకు చెందిన ఓ యువతి పశ్చిమ ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి వచ్చింది.రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్థితి తీవ్ర రూపం దాల్చిన తరుణంలో భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా ఉక్రెయిన్​లో ఉన్న భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియను మొదలుపెట్టింది. మూడు రోజుల పాటు ఎయిర్​ఇండియా ప్రత్యేక విమానాల ద్వారా వీరందరినీ స్వదేశం తీసుకురానుంది. మంగళవారం రాత్రికి తొలి విమానం భారత్​కు చేరుకోనుంది.

కేంద్రం సూచన మేరకు ఫిబ్రవరి 22, 24, 26న మూడు విమానాలను భారత్​- ఉక్రెయిన్ మధ్య ఆపరేట్ చేయనున్నట్లు ఎయిర్​ఇండియా ఇప్పటికే ప్రకటించింది. వీటికి అదనంగా మరో నాలుగు విమానాలు ఫిబ్రవరి 25, 27, మార్చి 6న ఉక్రెయిన్ రాజధాని క్వియ్​ నుంచి భారత్​ బయల్దేరనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇవి కాకుండా ఎయిర్​ అరేబియా, ఎయిర్ దుబాయ్​, ఖతార్ ఎయిర్​వేస్​ ఉక్రెయిన్​-భారత్​ మధ్య సాధారణ విమాన సేవలను కొనసాగిస్తాయని పేర్కొంది.ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న ఓ భారత విద్యార్థిని ఆస్థా సింధా స్వదేశం చేరుకుంది. గుజరాత్​లో వడోదర తన నివాసానికి సురక్షితంగా వచ్చింది. తన తల్లిదండ్రుల చెంతకు చేరినందుకు ఆనందం వ్యక్తం చేసింది.స్వదేశానికి వచ్చిన విద్యార్థినితాను పశ్చిమ ఉక్రెయిన్​లో ఉండి చదువుకుంటున్నానని, ప్రస్తుతం అక్కడ ప్రశాంతంగానే ఉందని ఆస్థా వెల్లడించింది. తల్లిదండ్రులు ఆందోళన చెందడం వల్లే స్వదేశానికి వచ్చినట్లు పేర్కొంది. భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు తమకు సాయం అందించి కీలకంగా వ్యవహరించిందని వివరించింది. ఉక్రెయిన్​ను వీడాలని మూడు సార్లు మెయిల్స్​, సందేశాల ద్వారా హెచ్చరించందని చెప్పింది.ఉక్రెయిన్​లో తమ బిడ్డ భద్రతపై ఎంతగానో కంగారు పడినట్లు ఆస్థా తండ్రి అరవింద్​ చెప్పాడు. భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాఖ సాయం అందించిందని, విమాన టికెట్ ధరను కూడా రూ.లక్ష నుంచి రూ.50వేలకు తగ్గించిందని సంతోషం వ్యక్తం చేశాడు.