NRI-NRT

హ్యూస్టన్ మెట్రో చైర్మన్ గా మనవాడు

Auto Draft

ప్రముఖ భారతీయ అమెరికన్ ఇంజనీర్ సంజయ్ రామభద్రన్ తదుపరి హ్యూస్టన్ మెట్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయనను తాజాగా ఈ పదవికి ఎంపిక చేశారు. దీంతో అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ప్రధాన ప్రజా రవాణా సంస్థకు నాయకత్వం వహించబోతున్న మొదటి భారతీయ అమెరికన్ వ్యక్తిగా సంజయ్ నిలిచారు. బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంజయ్ ఆ తరువాత టెక్సాస్ A&M విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2015 నుండి మెట్రో బోర్డులో పని చేస్తున్నారు. ప్రస్తుతం క్యాపిటల్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఫైనాన్స్ అండ్ ఆడిట్ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇంతకుముందు ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (ఐఏసీసీజీహెచ్) అధ్యక్షుడిగా వ్యవహరించారు. కాగా, హారిస్ కౌంటీకి చెందిన మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీ అనేది టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఉన్న ఒక ప్రధాన ప్రజా రవాణా సంస్థ. ఇది బస్, లైట్ రైల్, బస్ రాపిడ్ ట్రాన్సిట్, హై ఆక్యుపెన్సీ వెహికల్ లేన్, హై ఆక్యుపెన్సీ టోల్ లేన్‌లు, చాలా వరకు పారాట్రాన్సిట్ సేవలను నిర్వహిస్తుంది. హ్యూస్టన్ మెట్రో ట్రాన్సిట్ ఏజెన్సీ వార్షిక బడ్జెట్ 1.3 బిలియన్ డాలర్లు. ఈ సంస్థ 4,100 మంది ఉద్యోగులను కలిగి ఉంది.