Politics

మోడీపై జగన్ అవిశ్వాసం పెట్టాలి – TNI రాజకీయ వార్తలు

మోడీపై జగన్ అవిశ్వాసం పెట్టాలి – TNI  రాజకీయ వార్తలు

*మోదీ సర్కార్‌పై జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలి…శైలజనాథ్ కీలక వ్యాఖ్యలు
ఏపీని మోసం చేసినందుకు మోదీ సర్కార్‌పై జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్, మోదీ కుట్రలకు ఏపీ ప్రజలు బలవుతున్నారన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్.. మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శైలజానాథ్ తెలిపారు

* అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలి: ఆచంట సునీత
రాష్ట్రంలోని అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమసల్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర ధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. కడుపుమంటతో సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కితే, వారి వెనక టీడీపీవారున్నారని తప్పుడు రాతలు రాయిస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఆగ్రహంతోనే అంగన్‌వాడీలు ధర్నాలకు దిగారన్నారు. అంతేతప్ప ఎవరో చెబితే కాదనే విషయాన్ని సాక్షి దినపత్రిక గ్రహించాలన్నారు. రాష్ట్రంలోని లక్షా 20వేల మంది అంగన్‌వాడీ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఆమె కోరారు. అంగన్‌వాడీలకు న్యాయం చేయకపోతే తన ప్రభుత్వాన్ని తానే పతనం చేసుకున్నవాడిగా చరిత్రలో జగన్ నిలిచిపోతాడన్నారు. సిబ్బంది వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.10,500లకు పెంచింది చంద్రబాబేనన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను నీరుగార్చాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళాసాధికారత, స్త్రీ,శిశు సంక్షేమం ఎక్కడున్నాయో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం భజన తప్ప, వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా మంత్రులకు ఆడబిడ్డల కష్టసుఖాలు, కన్నీళ్లు కనిపిస్తున్నాయా అని ఆమె మండిపడ్డారు

* వీఆర్ఏల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుంది: ఈటల
కేసీఆర్ ప్రధాని అయ్యేకంటే ముందు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్‌ చేశారు. వీఆర్ఏల మహాధర్నాలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు బాగుంటేనే గ్రామాలు పచ్చగా ఉంటాయన్నారు. వీఆర్ఏలకు సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళను కేటాయించాలన్నారు. వీఆర్ఏల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏల సమస్యలపై బీజేపీ ప్రశ్నిస్తుందన్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రెవెన్యూ శాఖ కేసీఆర్ హయాంలో వెలవెల బోతోందని విమర్శించారు. ప్రజలతో సంబంధాలు కలిగిన రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు

* డబుల్ ఇంజెన్ ప్రభుత్వంతోనే మణిపూర్ అభివృద్ధి: మోదీ
మణిపూర్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో మణిపూర్ అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పునాదులు వేసిందని చెప్పారు. మణిపూర్‌లోని హైన్‌గాంగ్ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అన్నారు

* విశాఖలోనే పెందుర్తిని కొనసాగించాలి: మాజీ మంత్రి బండారు
పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి బండారు సత్య నారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోనే పెందుర్తి కొనసాగింపుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రిని విశాఖ శారదాపీఠం స్వామిజీ ఆడగాలన్నారు. ఆయనకు కూడా ఆ బాధ్యత ఉందన్నారు. లేదంటే పీఠం కూడా అనకాపల్లి వెళ్లిపోతుందన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజు దీనిపైన సీఎంను ఆడగాల్సిన ఆవసరం ఉందన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు పెందుర్తి జంక్షన్ వద్ద 25 నుంచి 27 వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు

* వివేకా హత్య కేసులో శివగామి ఎవరు?: రఘురామ
భీమ్లా నాయక్ సినిమా 25వ తేదీన విడుదల అవుతుందని.. దానికి ముందే టికెట్ రేట్లపై సీఎం జగన్ జీవో ఇస్తే బాగుటుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. జగన్ తనను తాను కరెక్ట్ చేసుకోవడానికి ఇదో ఒక మంచి సమయంగా ఆయన పేర్కొన్నారు. పులివెందుల కోర్టులో నిన్న దస్తగిరి నుంచి వాంగ్మూలం రికార్డ్ చేశారని.. 306 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారని రఘురామ పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో శివగామి ఎవరని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకొంతమంది పేర్లు ఇందులో ఉండొచ్చన్నారు. సీబీఐ ఛార్జ్ షీట్‌లో ఉన్న వారిని వారం రోజుల్లో విచారణకు పిలిచే అవకాశం ఉండొచ్చన్నారు. సజ్జల తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 16 ఏళ్ల క్రితం ఎక్కడో ఒక ఘటన జరిగిందని.. దానిపై సజ్జల ఇప్పుడు మాట్లాడుతున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. వివేకానందరెడ్డి హత్యలో దోషులు ఎవరనేది తేలాలని రఘురామ పేర్కొన్నారు.

* కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం: కవిత
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఎంపీ మాలోతు కవిత అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణలో తిరిగితే ప్రజలు ఒప్పుకోరన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామని విమర్శించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు- కేంద్రం వైఖరిపై రేపు నిరసన చేస్తున్నామని తెలిపారు.

* త్వ‌ర‌లోనే విశాఖ‌కు రైల్వే జోన్‌: సోము వీర్రాజు
ఏపీకి ప్ర‌త్యేక రైల్వే జోన్‌పై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ వ‌స్తుంద‌ని ఆయ‌న ప్ర‌కటించారు. ఏపీలోని వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ ప‌నితీరుపై విమ‌ర్శ‌లు గుప్పించిన సంద‌ర్భంగా సోమవారం నాడు ఆయ‌న ఈ మేర‌కు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం భారీగా నిధులు ఇస్తోంద‌న్న వీర్రాజు.. ఆ నిధుల‌ను వైసీపీ స‌ర్కారు నిర్దేశించిన ప‌నుల‌కు వాడ‌కుండా దారి మ‌ళ్లిస్తోంద‌ని ఆరోపించారు. స్థానిక సంస్థ‌ల‌కు కేంద్రం విడుద‌ల చేస్తున్న నిధుల‌ను ఆయా సంస్థ‌ల ఖాతాల‌కు పంపాల్సి ఉండ‌గా.. అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు నిధుల‌ను ఇత‌ర‌త్రా ప‌నుల‌కు వాడుతోంద‌ని ఆరోపించారు. వేల కోట్ల నిధుల‌ను కేంద్రం విడుద‌ల చేస్తున్నా.. రాష్ట్రం ప‌ట్ల మోదీ స‌ర్కారు నిర్ల‌క్ష్యం చూపుతోందంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అస‌త్య ప్ర‌చారం చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

*బంగారు భార‌త‌దేశాన్ని కూడా త‌యారు చేసుకుందాం: సీఎం కేసీఆర్‌
సంగారెడ్డి జిల్లాలోని నారాయ‌ణ్‌ఖేడ్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ‌ను ఎలా త‌యారు చేసుకున్నామో.. బంగారు భార‌త‌దేశాన్ని కూడా త‌యారు చేసుకుందామ‌న్నారు. నారాయ‌ణ్‌ఖేడ్‌లో సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజ‌కీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తాన‌ని తెలిపారు.

*జగన్ ప్రభుత్వం అందరినీ మోసం చేసింది: జీవీఎల్‌
జగన్ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. దళితుల నిధులను కూడా పక్కదారి పట్టించారన్నారు. 4 కోట్ల దళిత విద్యార్థుల కోసం మోదీ కొత్త పథకం ప్రారంభించారన్నారు. దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ కేంద్రమే బ్యాంక్‌ అకౌంట్‌లో వేస్తుందన్నారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని జీవీఎల్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఏపీలో హిందూ మతాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. రిజర్వేషన్ పొందుతూ మతం మారితే ‌అనర్హత తప్పదని జీవీఎల్‌ పేర్కొన్నారు.

*రాజ్యాంగ సంస్థలను సొంత ఆస్తుల్లా వాడుతున్నారు
దేశంలోని రాజ్యాంగ సంస్థలను బీజేపీ, ఆర్ఎ్సఎస్ తమ సొంత ఆస్తుల మాదిరిగా వాడుకుంటున్నాయని కాంగ్రెస్ నేత, లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, ప్రెస్ తదితర వ్యవస్థలను నిర్వీర్యం చేశాయని, వాటిని బలోపేతం చేసేందుకు బీజేపీతో పోరాడతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మణిపూర్ పర్యటనలో ఉన్న రాహుల్ను… పార్టీకి చెందిన స్థానిక నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్లో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

*బరేలిపై బీజేపీ సవతి ప్రేమ
కేంద్రం, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాలు రాయ్బరేలి నియోజకవర్గంపై సవతి ప్రేమ చూపుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు, స్థానిక ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వర్చువల్గా ప్రసంగించారు.

*రాజ్యాంగ సంస్థలను సొంత ఆస్తుల్లా వాడుతున్నారు
కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కాంగ్రె్సకు కొత్త కూటమిలో చోటు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన నాగపూర్లో మీడియాతో మాట్లాడారు. ఆదివారం నాటి కేసీఆర్-ఉద్ధవ్ ఠాక్రే చర్చల్లో కాంగ్రెస్ లేని కూటమి అనే మాట రాలేదని చెప్పారు.

*17 నెలల్లో 19 వేల మంది కార్యకర్తలు జైలుకు వెళ్లారు: ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 17 నెలల్లో 19,000 మంది జైలుకు వెళ్లారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజల కోస కాంగ్రెస్ పనిచేస్తోందని, ఛత్తీస్గఢ్లో రైతు రుణాలు మాఫీ చేశామని అన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గించామని, మహిళలకు సాధికారత కల్పించామని, 40 శాతం టిక్కెట్లు మహిళలకే కేటాయించామని చెప్పారు. వాళ్లు నెగ్గుతారా నెగ్గరా అనేది తమకు ముఖ్యం కాదని, పోరాడటమే ముఖ్యమని అన్నారు.

*ఇళ్ల స్థలాలపై చర్చకు సిద్ధం
‘‘సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాజకీయాలు చేయవద్దు. ఇళ్ల నిర్మాణాల్లో, స్థల కేటాయింపుల్లో చంద్రబాబుకు, అచ్చెన్నాయుడికి సందేహాలుంటే క్షేత్ర స్థాయికి రావాలి. మంత్రి హోదాను పక్కన పెట్టి ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. విజయనగరంలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల స్థల కేటాయింపుల విషయంలో తామే మెరుగంటూ లెక్కలతో వివరించారు. టీడీపీ టిడ్కో ఇళ్లలో ఒక్క ఇంటినీ లబ్ధిదార్లకు అందించలేదని విమర్శించారు. వాటి కోసం గత ప్రభుత్వం లబ్ధిదార్ల నుంచి వసూళ్లకు పాల్పడగా, ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.

*ఏపీ పోలీసులను చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది: Lokesh
ఏపీ పోలీసులను చూస్తో జాలితో కూడిన అసహ్యమేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. తమపై వైసీపీ దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకు ఖాకీలు కొమ్ముకాస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ తొత్తులుగా మారి ప్రశ్నించే ప్రజలు – ప్రతిపక్ష టీడీపీపై దాడులకు తెగబడ్డారన్నారు. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులు చివరికి వైసీపీ మూకల బాధితులవుతున్నారని తెలిపారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం బరితెగింపుని వెల్లడిస్తోందన్నారు. పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేదెవరు అంటూ లోకేష్ ప్రశ్నించారు.

*పేదల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది: సోము వీర్రాజు
పేదల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోందని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. అవి తమవని ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడిన ఘనత వాజ్పేయి, మోదీదేనని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్పష్టమైన ఇసుక విధానం తెస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.

*పేదల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది: సోము వీర్రాజు
పేదల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోందని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. అవి తమవని ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడిన ఘనత వాజ్పేయి, మోదీదేనని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్పష్టమైన ఇసుక విధానం తెస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.

*ప్రజాగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబై పర్యటన: ఈటల
ప్రజాగ్రహం తప్పించుకోవడానికే సీఎం కేసీఆర్ ముంబై పర్యటన చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదన్నారు. నోటిఫికేషన్లు లేకపోవడం తెలంగాణ యువకులకు పెళ్ళిళ్లు కావటంలేదని తెలిపారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వీఆర్వోలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఈటల రాజేందర్ తప్పుబట్టారు