అమెరికాతో పాటు కెనడా తదితర దేశాల్లో శరవేగంగా విస్తరించిన సిలికానాంద్ర మనబడి స్థాపించి 15 ఏళ్ళు పూర్తవుతుంది. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా 2007 ఫిబ్రవరి 21వ తేదీన మనబడిని సిలికాన్ వ్యాలిలో తొలుత స్థాపించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన మనబడిలో 60వేల మంది విద్యార్ధులు తెలుగు భాషను అభ్యసిస్తున్నారు. మనబడి ఏర్పాటు చేసి 15 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా సిలికానాంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, మనబడి టీం చామర్తి రాజులు విద్యార్ధులతో పాటు త వారి తల్లిదండ్రులను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు.